• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఎంపీని మర్యాదపూర్వకంగా కలిసిన కౌన్సిలర్

RR: చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని, చేవెళ్ల మున్సిపల్ బీజేపీ వార్డ్ కౌన్సిలర్ పెద్దోళ్ల దయాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీ పుట్టినరోజు సందర్భంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన వార్డు కౌన్సిలర్‌గా గెలిచిన దయాకర్‌ను ఎంపీ అభినందించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించాలని సూచించారు.

February 26, 2026 / 04:50 PM IST

ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన శివప్రసాద్

BPT: ఇసుకపల్లిలో వెలసిన శ్రీ భ్రమరాంబ సమేత చెన్నమల్లేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధికి దేవాదాయ శాఖ నుంచి రూ. 40 లక్షలు మంజూరయ్యాయి. మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రత్యేక చొరవతో ఈ నిధులు కేటాయించినట్లు టీడీపీ నేత శివప్రసాద్ తెలిపారు. ఈ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన గురువారం భూమి పూజ నిర్వహించారు.

February 26, 2026 / 04:50 PM IST

‘గౌరవెల్లి, గండిపల్లి పనులు వేగవంతం చేయండి’

SDPT: గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి లేఖ రాశారు. గండిపల్లి పనులు కేవలం 40 శాతమే పూర్తయ్యాయని వెంటనే రూ.100 కోట్లు మంజూరు చేసి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు. హుస్నాబాద్ నియోజకవర్గ రైతుల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం తగిన నిధులు కేటాయించాలని అన్నారు.

February 26, 2026 / 04:50 PM IST

‘భగీరథ మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలి’

SRPT: కోదాడ పట్టణానికి తాగునీటిని అందించే మిషన్ భగీరథ మేజర్ పైపులైన్లకు జరుగుతున్న మరమ్మతు పనులను మున్సిపల్ ఛైర్మన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పైపులైన్ పనుల్లో జాప్యం వల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదని, యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

February 26, 2026 / 04:48 PM IST

కలెక్టర్‌ను కలిసిన జిల్లా నూతన రిజిస్ట్రార్

బాపట్ల జిల్లా రిజిస్ట్రార్‌గా పదోన్నతి పొందిన పంగులూరి శ్రీనివాసరావు గురువారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాకు మంచి పేరు వచ్చేలా నిబద్ధతతో పనిచేయాలని ఈ సందర్భంగా శ్రీనివాసరావుకు కలెక్టర్ సూచించారు.

February 26, 2026 / 04:48 PM IST

IND vs ZIM: హెడ్ టు హెడ్ రికార్డు

T20 క్రికెట్‌లో భారత్, జింబాబ్వే జట్లు ఇప్పటివరకు 13 సార్లు తలపడ్డాయి. ఇందులో టీమిండియా 10 విజయాలతో జింబాబ్వేపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. జింబాబ్వే కేవలం 3 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. ఈ నేపథ్యంలో, ఈరోజు జరిగే మ్యాచ్‌లోనూ భారత్ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. అయితే, సంచలన ప్రదర్శనతో S-8కు చేరుకున్న జింబాబ్వేను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు.

February 26, 2026 / 04:48 PM IST

వచ్చేనెల 1 నుంచి ఉర్సు ఉత్సవాలు

NDL: చాగలమర్రి మండలంలో పెద్దవంగలిలో శ్రీ హజరత్ సయ్యద్ షా దస్తగిరి స్వామి ఉరుసు ఉత్సవాలు మార్చి 1, 2న నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు గురువారం తెలిపారు. మార్చి 1న గంధం, 2న ఉరుసు నిర్వహించనున్నట్లు మత పెద్దలు పేర్కొన్నారు. ఉత్సవాల నిమిత్తం దర్గాను నిర్వాహకులు సుందరంగా అలంకరిస్తున్నారు.

February 26, 2026 / 04:47 PM IST

కరీంనగర్ అభివృద్ధిలో ‘పమేలా మార్క్’

KNR: కరీంనగర్‌లో ప్రజా కలెక్టర్‌గా గుర్తింపు పొందారు. మహిళల కోసం ‘శుక్రవారం సభ’, ఆడపిల్లల రక్షణకు ‘ఓ చిన్ని పిచ్చుక’, ఇటుక బట్టీల పిల్లలకు ‘బ్రిక్ బుక్స్’ చేపట్టారు. దివ్యాంగుల కోసం సైన్ లాంగ్వేజ్ నేర్చుకుని, ప్రభుత్వ దవాఖానలోనే సర్జరీ చేయించుకుని ప్రజలకు నమ్మకం కల్పించారు. కాగా, తాజా బదిలీల్లో ఆమె బదిలీ అయిన విషయం తెలిసిందే.

February 26, 2026 / 04:47 PM IST

వైసీపీలో చేరిన ఎంపీటీసీ సభ్యురాలు

W.G: వీరంపాలెం, పట్టింపాలెం ఎంపీటీసీ సభ్యురాలు జంపల్లి సత్యవతి గురువారం వైసీపీలో చేరారు. నియోజకవర్గ ఇంఛార్జ్ వడ్డే రఘురామ్ సమక్షంలో ఆమె పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రఘురామ్ మాట్లాడుతూ.. గతంలో పార్టీని వీడిన వారు తిరిగి వస్తున్నారని, రానున్న రోజుల్లో కూటమి పార్టీల నుంచి భారీగా చేరికలు ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు.

February 26, 2026 / 04:46 PM IST

4వ రోజుకు చేరుకున్న అంగన్వాడీల దీక్ష

KRNL: ఆదోని ఐసీడీఎస్ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీలు నాలుగో రోజు సామూహిక దీక్ష నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వేతనం పెంచి, గ్రాచుటీ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని సీఐటీయూ నాయకులు గురువారం డిమాండ్ చేశారు. జీతాలు పెరుగేవరకు దశలవారీగా నిరసనలు, జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు కొనసాగిస్తామని సీఐటీయూ నాయకులు తెలిపారు.

February 26, 2026 / 04:46 PM IST

రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి: భాస్కరరావు

SRD: గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని బొంతపల్లి గ్రామంలో పటాన్‌చెరు డివిజన్ విద్యుత్ ఇంజినీరింగ్ అధికారి భాస్కరరావు రైతులతో సమావేశమై పొలాల్లో పర్యటించారు. వేసవి లోడును దృష్టిలో పెట్టుకుని బొంతపల్లి, గుమ్మడిదల సబ్ స్టేషన్లలో రూ.4 కోట్లతో రెండు 8 ఎంవిఎ ట్రాన్స్‌ఫార్మర్‌లు ఏర్పాటు చేశారు. కనుకుంట పరిధిలో రూ.15 లక్షలతో సమస్యలు పరిష్కరించారు.

February 26, 2026 / 04:46 PM IST

రైల్వే కోడూరులో రేపు టీడీపీ ప్రజా దర్బార్

అన్నమయ్య: రైల్వే కోడూరులో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా వినేందుకు టీడీపీ ప్రజా దర్బార్ కార్యక్రమం రేపు నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం 09:00 గంటల నుంచి మధ్యాహ్నం 01:00 గంటల వరకు రాఘవరాజుపురం టీడీపీ పార్టీ కార్యాలయంలో కార్యక్రమం జరుగుతుంది. టీడీపీ పార్టీ ఇంఛార్జ్ ముక్కా రూపానంద రెడ్డి ప్రజలను స్వయంగా కలుసుకుని వినతి పత్రాలను స్వీకరించనున్నారు.

February 26, 2026 / 04:45 PM IST

శనగ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు

KDP: రైతులందరూ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఫార్మర్ రిజిస్ట్రీ వెబ్‌సైట్ నమోదు చేసుకోవాలని మండల స్పెషల్ ఆఫీసర్ రామ శివ దీక్షిత్ సూచించారు. గురువారం వేముల మండలం పెర్నపాడులోని బుడ్డ శనగ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. బుడ్డ శనగకు ప్రకటించిన మద్దతు ధరను రైతులు పూర్తిగా వినియోగించుకోవాలన్నారు.

February 26, 2026 / 04:42 PM IST

BREAKING: సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే..?

సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో వెస్టిండీస్ 20 ఓవర్లలో 176/8 పరుగులు చేసింది. 10.2 ఓవర్లలో కేవలం 83 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ విండీస్ జట్టును.. హోల్డర్(49), షెపర్డ్(52*) ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి 8వ వికెట్‌కు కేవలం 57 బంతుల్లోనే 89 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఎంగిడి 3 వికెట్లు తీయగా, రబడ, బాష్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. టార్గెట్: 177.

February 26, 2026 / 04:42 PM IST

పాఠశాలాలు, కళాశాలలో రోడ్డు భద్రతపై అవగాహన

SRD: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ గురువారం తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పారు. విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించి హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. రోడ్డుపై పాదచారులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు.

February 26, 2026 / 04:41 PM IST