• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పెసలు, మినుములకు ప్రభుత్వ మద్దతు ధర ఇదే

VZM: రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ఈనెల 27 నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నట్లు JC సేధు మాధవన్ సోమవారం తెలిపారు. తొలి దశలో జామి, సంతకవిటి, బొబ్బిలి మండలాల్లో కేంద్రాలు ప్రారంభిస్తామని, పెసలు క్వింటాకు రూ.8,768, మినుములు రూ.7,400 మద్దతు ధరగా ఉంటుందని, కొనుగోళ్లను ఏపీ మార్క్‌ఫెడ్ నోడల్ ఏజెన్సీగా, ఎన్‌సీసీఎఫ్ ద్వారా నిర్వహిస్తారన్నారు.

February 23, 2026 / 07:36 PM IST

WCలో జింబాబ్వేపై భారత్ రికార్డు ఇదే..!

ఈనెల 26న సూపర్-8 పోరులో జింబాబ్వేతో భారత్ తలపడనుంది. సెమీఫైనల్ రేసులో నిలవాలంటే భారత్ ఈ మ్యాచ్‌లో కచ్చితంగా విజయం సాధించాల్సి ఉంటుంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఒకే ఒక్కసారి 2022లో ఆస్ట్రేలియా వేదికగా తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో భారత్ 71 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక జింబాబ్వే జట్టు భారత గడ్డపై భారత్‌తో చివరిసారిగా 2002లో తలపడింది.

February 23, 2026 / 07:36 PM IST

వేతనాలు చెల్లించాలని పంచాయతీ కార్మికుల ధర్నా

SRCL: పెండింగ్ వేతనాలు చెల్లించాలని, కనీస వేతనం రూ. 26 వేలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులు కలెక్టరేట్ ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. జిల్లాలోని అన్ని పంచాయతీ కార్మికులు తరలివచ్చి తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ నినాదాలు చేస్తూ ధర్నా చేశారు.

February 23, 2026 / 07:36 PM IST

పీఎం శ్రీ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

MBNR: పీఎం శ్రీ పాఠశాలల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. సెంట్రల్ అబ్జర్వర్ ఫరీదా మహమ్మద్ బాలానగర్, రాజాపూర్ పాఠశాలలను తనిఖీ చేసి నిధుల వినియోగాన్ని పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమీక్షలో పనుల నాణ్యత, గడువు పై కలెక్టర్ అధికారులకు కీలక సూచనలు చేశారు.

February 23, 2026 / 07:35 PM IST

గడ్డిమందు తాగి వ్యక్తి ఆత్మహత్య.. కేసు నమోదు

NLR: కావలి మండలం సిరిపురం గ్రామానికి చెందిన కన్నె ఆనంద్ రావు (42) గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని కావలి రూరల్ పోలీసులు సోమవారం తెలిపారు. మృతుడు ఈ నెల 21న సిరిపురంలో గడ్డిమందు తాగడంతో కావలి ఏరియా ఆసుపత్రికి తరలించి, మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. దీనిపై రూరల్ ఎస్సై బాజిబాబు కేసు నమోదు చేశారు.

February 23, 2026 / 07:34 PM IST

జేసీ విష్ణు చరణ్‌ను కలిసిన ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ

ATP: జిల్లా జాయింట్ కలెక్టర్‌ విష్ణు చరణ్‌ను ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతపురం కలెక్టరేట్‌లోని జేసీ ఛాంబర్‌లో జరిగిన ఈ భేటీలో జిల్లా అభివృద్ధి, రెవెన్యూ అంశాలపై చర్చించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా, అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగేలా అధికారులతో సమన్వయం చేసుకుంటామని ఎంపీ తెలిపారు.

February 23, 2026 / 07:33 PM IST

పేకాట స్థావరంపై దాడులు.. అదుపులోకి 8 మంది

NLR: మర్రిపాడు మండలం తిక్కవరం గ్రామ శివారు ప్రాంతంలో పేకాట ఆడుతున్నారని సమాచారం రావడంతో ఎస్ఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి సోమవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 8 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ. 21,910 నగదు, 8 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిని 8 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

February 23, 2026 / 07:33 PM IST

‘పెండింగ్ క్లెయిమ్స్ వెంటనే విడుదల చేయాలి’

KDP: దేశవ్యాప్త పిలుపులో భాగంగా కడపలో భవన నిర్మాణ కార్మిక నాయకులు MRO నారాయణరెడ్డి, తాసిల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. పెండింగ్‌లో ఉన్న 46 వేల క్లెయిమ్స్‌ను వెంటనే పరిష్కరించి సొమ్ము విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వెల్ఫేర్ సెస్సును కార్మికుల సంక్షేమానికే వినియోగించి, వెల్ఫేర్ బోర్డును పటిష్టం చేయాలని నాయకులు కోరారు.

February 23, 2026 / 07:33 PM IST

కేబినెట్ కీలక నిర్ణయం

TG: రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పేరు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ గా మార్చింది. ఇకపై ప్రభుత్వ పరిధిలోకి టీవీవీపీ ఉద్యోగులు రానున్నారు. 

February 23, 2026 / 07:32 PM IST

ప్రజల వద్ద నుండి అర్జీలను స్వీకరించిన కమిషనర్

కృష్ణా: గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సంస్థ పరిష్కారం వేదికలో మున్సిపల్ కమిషనర్ మనోహర్ ప్రజల వద్ద నుండి 5 అర్జీలను స్వీకరించారు. శానిటేషన్ కు సంబంధించి 1 అర్జీ, ఆక్రమణలకు సంబంధించి 2 అర్జీలు, న్యూ డ్రైనేజ్ నిర్మాణం కోసం 2 అర్జీలు కమిషనర్‌కు అందాయి. సంబంధిత శాఖ అధికారులు సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కమిషనర్ ఆదేశించారు.

February 23, 2026 / 07:32 PM IST

అర్జీలు నిర్ణీత సమయంలోనే పరిష్కరించాలి: కలెక్టర్

GNTR: గుంటూరు కలెక్టరేట్ శంకరన్ హాల్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని ఆదేశించారు. ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీని నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని, ఆలస్యం జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు,

February 23, 2026 / 07:32 PM IST

పిఠాపురంలో ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్

కాకినాడ: పిఠాపురం సీఐ శ్రీనివాస్ ఆటో డ్రైవర్లకు అవగాహన, కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆటో నడిపే సమయంలో చేసే సాధారణ తప్పిదాలు, ప్రమాదాలకు గల అవకాశాలను వివరించారు. వేగం అదుపులో లేకుండా నడపడం ప్రాణాలకు హానికారకమని, పరిస్థితులను గమనిస్తూ వాహనం నడపాలని సూచించారు. నియమాలను లెక్కచేయకుండా నడిపితే జరిమానాలు, కేసులు, వాహన పత్రాలరద్దు వంటి చర్యలు తప్పవని సిఐ హెచ్చరించారు.

February 23, 2026 / 07:32 PM IST

‘లైంగిక దాడి ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలి’

KRNL: ఆలూరులో ఎనిమిదో తరగతి విద్యార్థిపై తోటి విద్యార్థులు లైంగిక దాడి చేసిన ఘటన కలకలం రేపింది. బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్, సిబ్బందిని సస్పెండ్ చేయాలని ఇవాళ డిమాండ్ చేశారు. నిందిత విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

February 23, 2026 / 07:32 PM IST

రెండు ఇసుక లారీల పట్టివేత, కేసు నమోదు

NLG: నార్కట్‌పల్లి శివారులోని కామినేని ఫ్లైఓవర్ వద్ద సోమవారం అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలను పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో తనిఖీలు చేపట్టగా, TG07T4554, TS07UH4554 నంబర్లు గల లారీల్లో హైదరాబాద్‌కు ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించామని ఎస్సై విష్ణుమూర్తి తెలిపారు. లారీలను, డ్రైవర్లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామన్నారు.

February 23, 2026 / 07:32 PM IST

రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు ప్రశంసలు

జగిత్యాల జిల్లా నెట్‌బాల్ జట్టు ఈనెల 20 నుంచి 23 వరకు మహబూబ్నగర్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి సీఎం కప్ టోర్నమెంట్లో పాల్గొని ప్రతిభ చాటింది. ఈ పోటీలలో క్రీడాకారులు అద్భుతమైన ఆట తీరుతో జిల్లా గౌరవాన్ని నిలబెట్టారు. రాష్ట్రస్థాయిలో పాల్గొనడం గొప్ప అనుభవంగా ఉందని క్రీడాకారులు అన్నారు. జిల్లా క్రీడా అభిమానులు, అధికారులు జట్టును అభినందించారు.

February 23, 2026 / 07:31 PM IST