• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అక్రమంగా నిల్వ ఉంచిన బాణాసంచా స్వాధీనం

ELR: పెదపాడు మండలం ఏపూరు గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా రూ.30 లక్షల విలువైన నిలువ ఉంచిన అక్రమ బాణాసంచాను పోలీస్, ఫైర్, రెవిన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బాణాసంచా నిల్వలో నిర్లక్ష్యం వహిస్తే అది భారీ ప్రాణ, ఆస్తి నష్టానికి దారితీస్తుందని అధికారులు తెలిపారు. నిల్వ కేంద్రం నివాస ప్రాంతాలకు దూరంగా, కేవలం కాంక్రీట్ భవనాల్లో మాత్రమే ఉండాలన్నారు.

March 1, 2026 / 06:14 PM IST

ఏఈగా బాధ్యతలు స్వీకరించిన సురేష్ కుమార్

NTR : వీరులపాడు మండలం అల్లూరు విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఏఈగా వి. సురేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన ముత్యాలంపాడు సబ్‌స్టేషన్ నుంచి బదిలీపై అల్లూరుకు వచ్చినట్లు తెలిపారు. ఇంతవరకు ఏఈగా విధులు నిర్వహించిన కృష్ణారెడ్డి ఇకపై సబ్ ఇంజనీర్‌గా సేవలందించనున్నారు. అధికారులు, సిబ్బంది నూతన ఏఈకు అభినందనలు తెలిపారు.

March 1, 2026 / 06:14 PM IST

అంగన్వాడీల అరెస్ట్‌లను ఖండించండి: సీఐటీయూ

KRNL: రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్లకు కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పిఎస్.రాధాకృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం చలో విజయవాడకు వెళ్తున్న అంగన్వాడీలను అడ్డుకోవడం, అరెస్ట్‌లు చేయడం సరికాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుత నిరసనలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

March 1, 2026 / 06:14 PM IST

కేసీ కెనాల్‌లో ప్రమాదవశాత్తు యువకుడు గల్లంతు

NDL: బండి ఆత్మకూరు మండల పరిధిలోని కేసీ కెనాల్‌లో ప్రమాదవశాత్తు యువకుడు పడిపోయి గల్లంతయ్యాడని ఎస్సై జగన్మోహన్ తెలిపారు. ఆదివారం ఉదయం ఒంగోలు ప్రాంతానికి చెందిన హేమంత్ అనే వ్యక్తి (17) గల్లంతైనట్లు తెలిపారు. ఎస్సై జగన్మోహన్, పోలీస్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, డ్రోన్ టీం సాయంతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

March 1, 2026 / 06:13 PM IST

ఆనందనిలయానికి మానవత సంస్థ 70 కుర్చీలు వితరణ

ELR: ఉంగుటూరు మండలం నారాయణపురం ఉషోదయ హై స్కూల్లో ఉంగుటూరు మండల మానవత సమావేశం ఆదివారం జరిగింది. సమావేశానికి అధ్యక్షులు KVV.సత్యనారాయణ అధ్యక్షత వహించారు. వృద్ధుల, అనాధ బాలల ఆశ్రమకు మానవత సంస్థ రూ.50 వేల విలువైన 70 కుర్చీలను ఆనంద నిలయం ఛైర్మన్ గుణ్ణం బులెబ్బాయ్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో రీజియన్ ఛైర్మన్ పుప్పాల గోపి, సర్వేశ్వరరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

March 1, 2026 / 06:12 PM IST

‘రహదారి విస్తరణలో చర్యలు తీసుకుంటాం’

NDL: కర్నూలు నగరంలో జిల్లా పరిషత్ సమావేశంలో ఆదివారం జిల్లా కలెక్టర్ రాజకుమారి పలు సమస్యలపై స్పందించారు. నూనెపల్లె-కోవెలకుంట్ల రహదారి విస్తరణలో బోర్లు దెబ్బతిన్న అంశంపై చర్యలు తీసుకుంటామని, ఎర్రగుంట్ల పాఠశాలలో వసతుల కొరతపై పరిశీలన జరిపించి వెంటనే సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. డోన్‌లో రేషన్ కార్డు సమస్యలు పరిష్కరించాలని అధికారుతకు ఆదేశించారు.

March 1, 2026 / 06:12 PM IST

బీరన్న గుడి ఆలయ కమిటీ ఎన్నిక

HNK: శాయంపేట మండలంలోని పెద్దకోడెపాక బీరన్న గుడి ఆలయ కమిటీ అధ్యక్షులుగా ముజిగిరి వేణు, కురుమ కుల పెద్ద మనిషిగా అమ్మ రాజు ఎన్నికయ్యారు. కురుమ కులస్తులు ఐక్యంగా ఉంటూ కుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధనకై కృషి చేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మంద దీన ప్రభాకర్, ఉపసర్పంచ్ ఫైండ్ల సునిత చంద్రమౌళి, అమ్మ అశోక్, రవీందర్, శ్రీనివాస్ ఉన్నారు.

March 1, 2026 / 06:10 PM IST

వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ స్వప్న పర్యటన

KRNL: జిల్లా పర్యటనలో భాగంగా, రాష్ట్ర వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ ఛైర్మన్ తుల్జాపూర్ స్వప్న ఎమ్మిగనూరు మండలం కె.తిమ్మాపురం గ్రామంలోని “శ్రీ బసవేశ్వర కళ్యాణ మండపం” నిర్మాణానికి ఇవాళ ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమానికి తాలుకా “వీరశైవ లింగాయత్ సంక్షేమ సేవా సమితి” కమ్యూనిటీ వ్యవస్థాకాధ్యక్షులు బిసి.నాగరాజు అధ్యక్షత వహించారు.

March 1, 2026 / 06:10 PM IST

క్యూ లైన్‌లో దర్శనానికి వేచి ఉన్న భక్తులు

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర సింహస్వామి దేవస్థానంలో ఆదివారం సెలవు దినం పురస్కరించుకొని భక్తుల రద్దీ జరిగింది. గర్భాలయం, విష్ణు పుష్కరిణి, ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, శీఘ్ర దర్శనం తదితర దేవాలయ ప్రాంతాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. స్వామి అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులు ఉదయం నుంచి క్యూ లైన్‌లో బారులు తీరారు.

March 1, 2026 / 06:10 PM IST

వనదుర్గమాతను దర్శించుకున్న రాహుల్ రాజ్

MDK: రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ కమీషనర్ రాహుల్ రాజ్ పాపన్నపేట మండలం ఏడుపాయల వన దుర్గ భవాని మాత అమ్మవారి నీ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి దర్శన భాగ్యం కల్పించి తీర్థప్రసాదాలు అందించారు.

March 1, 2026 / 06:10 PM IST

‘అంగన్వాడీల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం’

అన్నమయ్య: అంగన్వాడీల వేతనాలను రెండుసార్లు పెంచామని, వారి సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాజంపేట TDP అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు తెలిపారు. ఆదివారం TDP కార్యాలయంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టినా, CM చంద్రబాబు, Dy. CM పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అంగన్వాడీల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు.

March 1, 2026 / 06:09 PM IST

ఈ నెల 4న పట్టుబడిన వాహనాల వేలం

KRNL: ఆలూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాటుసారా, అక్రమ మద్యం తరలిస్తూ పట్టుబడిన 12 వాహనాలను ఈ నెల 4న వేలం వేయనున్నట్లు ఎక్సైజ్ సీఐ లలితాదేవి ఆదివారం తెలిపారు. ఉదయం 10 గంటలకు ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ రామకృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో సెబ్ స్టేషన్ ఆవరణలో ఈ వేలం జరుగుతుంది. వేలంలో పాల్గొనాలనుకునేవారు రూ.5 వేలు చెల్లించి పాల్గొనవచ్చని సీఐ పేర్కొన్నారు.

March 1, 2026 / 06:08 PM IST

ఆలయాన్ని సందర్శించిన చిన్న జీయర్ స్వామి

KNR: తిమ్మాపూర్ మండలంలోని నల్లగొండ శ్రీ సీతారామ లక్ష్మీనరసింహస్వామి ఆలయంను తొలిసారిగా చిన్న జీయర్ స్వామి సందర్శించారు. నుస్తులాపూర్ క్రాసింగ్ వద్ద భక్తులు ఘన స్వాగతం పలికి బైక్ ర్యాలీగా ఆలయానికి తీసుకువచ్చారు. అర్చకులు పూర్ణకుంభంతో ఆహ్వానించగా స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ఉపన్యాసం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్, ప్రజాప్రతినిధులు ఉన్నారు.

March 1, 2026 / 06:07 PM IST

షెడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే

ADB: బోథ్ మండలంలోని కన్గుట్ట గ్రామంలోని శబరిమాత ఆశ్రమ భక్తుల కోరిక మేరకు, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తక్షణమే స్పందించి, షెడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ నిర్మాణ పనులు సోమవారం నుంచి ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం అధ్యక్షులు స్వామి, మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్, గంగమల్లు, తదితరులు పాల్గొన్నారు.

March 1, 2026 / 06:07 PM IST

‘ఎస్ఎస్ ట్యాంకుల మరమ్మతుల్లో నాణ్యత పాటించాలి’

KRNL: ఆదోని మండలం చిన్న హరివాణం గ్రామంలో పైడ్‌లైన్ పనులకు రూ.80 లక్షలు మంజూరు చేసినందుకు రాష్ట్ర కురవ కార్పొరేషన్ ఛైర్మన్ దేవేంద్రప్ప కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం కర్నూలులో జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పనులు పూర్తై గ్రామానికి నీటి సరఫరా ప్రారంభమైందని తెలిపారు. ఎండాకాలం దృష్ట్యా ఎస్ఎస్ ట్యాంకుల మరమ్మతుల్లో నాణ్యత పాటించాలని సూచించారు.

March 1, 2026 / 06:06 PM IST