కామారెడ్డి జిల్లాలోని లింగంపేట మండలం మాలోత్ సంగ్యనాయక్ తండాలోని తుల్జా భవాని, దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని మార్చి 6, 7 తేదీలలో నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా విగ్రహ ప్రతిష్ఠ, హోమాలు, ప్రత్యేక పూజలు ఉంటాయని పేర్కొన్నారు. కావున భక్తులు భారీగా తరలి రావాలని కోరారు.
TPT: సూళ్లూరుపేట హోలీ క్రాస్ జంక్షన్ సమీపంలో ఆదివారం సాయంత్రం జాతీయ రహదారిపై తడ ఎంపీడీవో చంద్రశేఖర్ ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ వైపు భాగం దెబ్బతిన్నప్పటికీ ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
WGL: వర్ధన్నపేట మండలంలోని కట్య్రాల గ్రామానికి చెందిన సతీష్ గుండె పోటుతో మృతి చెందాడు. గ్రామంలో టెంట్ సామాను తీసుకు వస్తుండగా ఒక్కసారిగా కుప్ప కూలడంతో స్థానికులు వెంటనే వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. బీజేపీలో గత కొన్నేళ్లుగా చురుగ్గా పని చేస్తూ సేవలు అందిస్తున్నారు.
ప్రకాశం: గిద్దలూరు మండలంలోని దిగువమెట్ట సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో దిగువ మెట్ట నుంచి నంద్యాల వైపు వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి రోడ్డుపక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
RR: అందరూ ఆరోగ్యంగా జాగ్రత్తగా కాపాడుకోవాలని జిల్లా అదనపు న్యాయమూర్తి స్వాతిరెడ్డి అన్నారు. SDNR కోర్టు సముదాయంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి స్వాతిరెడ్డి వైద్యశిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు 6 మాసాలకు ఒకసారి తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు ఈనెల 4న సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ శాఖ అధికారులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. హోలీ పండుగ సందర్భంగా బుధవారం మార్కెట్లో క్రయవిక్రయాలు జరగవని చెప్పారు. తిరిగి ఈనెల 5 నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు యధావిధిగా జరుగుతాయని అన్నారు. ఈ విషయాన్ని జిల్లా రైతు సోదరులు గమనించాలని సూచించారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు ఈనెల 4న సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ శాఖ అధికారులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. హోలీ పండుగ సందర్భంగా బుధవారం మార్కెట్లో క్రయవిక్రయాలు జరగవని చెప్పారు. తిరిగి ఈనెల 5 నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు యధావిధిగా జరుగుతాయని అన్నారు. ఈ విషయాన్ని జిల్లా రైతు సోదరులు గమనించాలని సూచించారు.
NLG: రాష్ట్రవ్యాప్త మీటర్ రీడర్స్ కమిటీ ఆధ్వర్యంలో నేడు ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే నిరసనకు మిర్యాలగూడ, హాలియా సభ్యులు మద్దతు ప్రకటించారు. తమకు 30 రోజుల పని కల్పించాలని, అర్హత ఉన్న వారిని సబ్ స్టేషన్ ఆపరేటర్లుగా నియమించాలని డిమాండ్ చేశారు. బిల్లింగ్ గడువు పెంచాలని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
AP: రైలులో సీటు కోసం CRPF విశ్రాంత పోలీసు రివాల్వర్‌తో బెదిరింపులకు దిగాడు. యలహంక నుంచి కాచిగూడకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. నంద్యాల జిల్లా ఆర్.కృష్ణాపురం గ్రామానికి చెందిన మనోహర్ తనకు సీటు ఇవ్వాలంటూ ప్రయాణికులను బెదిరించాడు. దీంతో కొందరు గుంతకల్లు RPFకు సమాచారం ఇవ్వడంతో రైలు గుంతకల్లు చేరుకోగానే అతడిని అదుపులోకి తీసుకున్నారు.
MBNR: బాలానగర్ మండలం నేరెళ్లపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం చేపలు పట్టేందుకు ఊర చెరువులోకి దిగిన బంటు శ్రీనివాసులు (39), ప్రమాదవశాత్తు తన కాలుకు వల చిక్కుకోవడంతో నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. గమనించిన గ్రామస్థులు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
బజాజ్ ఆటో ఎండి రాజీవ్ బజాజ్ ట్రయంఫ్ 350cc బైక్‌లను ఏప్రిల్‌లో లాంచ్ చేయనున్నట్లు ధృవీకరించారు. ప్రస్తుత 400cc ఇంజిన్‌ను తగ్గించి ఈ కొత్త వెర్షన్ రూపొందిస్తున్నారు. దీనివల్ల 40% నుంచి 18% వరకు జీఎస్టీ తగ్గి, ధరలు మరింత పోటీగా ఉండనున్నాయి. ఇదే వ్యూహాన్ని KTM, Dominor మోడళ్లలోనూ అనుసరించే అవకాశం ఉంది. తక్కువ ధరలో ప్రీమియం బైక్ కోరుకునే వారికి ఇది గుడ్ న్యూస్.
WGL: నగరంలోని గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతోంది. ఈ సందర్భంగా నగర ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను అదనపు కమిషనర్ స్వీకరిస్తున్నారు. విభిన్న విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు హాజరై ప్రజల వినతులను పరిశీలిస్తూ, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ADB: పేద కుటుంబానికి చెందిన బిడ్డలు ఉన్నత చదువులు చదివి ఉజ్వలమైన భవిష్యత్తు పొందాలని మాస్ జిల్లా కో- ఆర్డినేటర్ నవీన్ జిల్లపెల్లి అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని ఇందిరమ్మ కాలానీకి చెందిన నిరుపేద విద్యార్ధి ప్రియాంక స్థానిక డైట్ కళాశాలలో డిప్లొమా చదువుతోంది. ఆర్థికంగా వెనుకబడిన ఈమెకు చదువుల కోసం ప్రతినిధులు రూ. 10వేల నగదును అందజేశారు.
MHBD: జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. నేడు ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థులకు కీలకమైన గణితం, బాటనీ, సివిక్స్ పరీక్షలు జరుగాయి. మాల్ ప్రాక్టీస్‌కు తావులేకుండా సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నిరంతరం తనిఖీలు చేపట్టారు.
WIపై విజయంతో భారత్ T20 WC సెమీస్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. దీంతో పాక్ మాజీ ప్లేయర్ మహ్మద్ ఆమిర్‌ను క్రికెట్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తుగా ట్రోల్ చేస్తున్నారు. కాగా ఇటీవల ఆమిర్ భారత్ సెమీస్‌కు అర్హత సాధించలేదని, బ్యాటింగ్ లైనప్ కూలిపోతుందని విమర్శలు చేశాడు. ఈ క్రమంలో అతను కొనియాడిన విండీస్‌పైనే భారత్ విజయం సాధించి సెమీస్‌కు దూసుకెళ్లడం విశేషం.