రింకూ సింగ్ తండ్రి ఖాన్‌చంద్ సింగ్ శుక్రవారం చనిపోయిన సంగతి తెలిసిందే. దీంతో రింకూ స్వగ్రామానికి వెళ్లి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. అయితే శనివారమే అతను జట్టుతో కలుస్తాడని BCCI వర్గాలు తెలిపాయి. ఖాన్‌చంద్ తీవ్ర అనారోగ్యంతో మొన్న నోయిడాలో చికిత్స పొందుతుండగా..రింకూ జింబాబ్వే మ్యాచ్ ముందు కూడా జట్టును వీడాడు. మ్యాచ్ వేళకు వచ్చినా తుదిజట్టులో ఛాన్స్ రాలేదు.
TG: 45 మంది IASలను బదిలీ చేస్తూ గురువారం ఇచ్చిన ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక సవరణ చేసింది. పరిశ్రమలు, ఐటీ శాఖల అదనపు బాధ్యతలను సీఎస్ రామకృష్ణారావుకు అప్పగించింది. గురువారం వచ్చిన ఉత్వర్తుల ప్రకారం ఈ బాధ్యతలను ఎన్. శ్రీధర్‌కు అప్పగించగా.. దానిపై సవరణ చేస్తూ శుక్రవారం మరో జీవో జారీ చేసింది.
➢ 1885: స్వాతంత్ర్య సమరయోధుడు బాబు చోటేలాల్ శ్రీవాత్సవ జననం➢ 1922: తెలుగు సాహితీవేత్త రాచమల్లు రామచంద్రారెడ్డి జననం➢ 1948: రంగస్థల నటీమణి పువ్వుల రాజేశ్వరి జననం➢ 1973: సినీ నటుడు సునీల్ జననం➢ జాతీయ విజ్ఞాసశాస్త్ర దినోత్సవం➢ ప్రపంచ దర్జీల దినోత్సవం
AP: యువతిగా ఫేక్ IDతో పరిచయాలు పెంచుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఓ సైబర్ నేరగాడిని HYD పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖకు చెందిన నిందితుడు పెదపూడి ప్రసన్నకుమార్ ఓ మ్యాట్రిమోనియల్ సైట్‌లో అమ్మాయిలా నటిస్తూ పెళ్లి చేసుకుంటానని మోసాలు చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. క్రిప్టో ఇన్వెస్ట్ మోసాలకూ పాల్పడ్డాడని, 400+ సిమ్ కార్డులతో ఫేక్ అకౌంట్లు తెరిచాడని గుర్తించారు.
TG: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సౌందరరాజన్(90) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న రంరాజన్ శుక్రవారం తుదిశ్వాస విడిచారని ఆయన కుమారుడు, ఆలయంలో ప్రస్తుత అర్చకుడు రంగరాజన్ తెలిపారు. ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన ఆయన.. ఎప్పుడూ భక్తులతో మమేకమై స్వామి వారి గురించి భక్తులతో ఎంతో ప్రశాంతంగా వివరించేవారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తంచేశారు.
ఇంగ్లండ్‌తో ఉత్కంఠభరితంగా సాగిన కీలక ‘సూపర్ 8’ మ్యాచులో న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో ఓడింది. 160 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడంలో కివీస్ బౌలర్లు చివరి ఓవర్లలో తడబడ్డారు. దీంతో ఇప్పటికే సెమీస్‌కు చేరిన ఇంగ్లండ్ అనూహ్య విజయం సొంతం చేసుకుంది. ఈ ఓటమితో కివీస్ ‘సెమీస్’ ఆశలు రేపటి SL vs PAK పోరుపై ఆధారపడి ఉన్నాయి. అందులో పాక్ ఓడితేనే కివీస్ సెమీస్‌కు చేరుతుంది.
AP: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సౌందర్ రాజన్ మృతి బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. ‘ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. సౌందర్ రాజన్ చేసిన ఆధ్యాత్మిక సేవలు చిరస్మరణీయం. ఆలయాల సంప్రదాయాలను, స్వతంత్రతను కాపాడేందుకు ఆయన విశేష కృషి చేశారు’ అని పేర్కొన్నారు.
VZM: తన ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందవద్దని చీపురుపల్లి MLA, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేసారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని సిటీ న్యూరో ఆసుపత్రిలో బ్రెయిన్ స్టోక్‌తో చేరినట్లు వచ్చిన వార్తలపై ఆయన స్పందిస్తూ, ఇది కేవలం రోటీన్ చెకప్ మాత్రమేనని, ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. ఈ విషయాన్ని వైసీపీ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
అనకాపల్లి పట్టణ పరిధిలో నేషనల్ హైవే బైపాస్ రింగ్ రోడ్డు జంక్షన్ నుంచి శారదా నది వంతెన వరకు, పూడిమడక రోడ్డు జంక్షన్ నుంచి గుండాల జంక్షన్ వరకు అలాగే పలు ప్రాంతాల్లో ఎల్ఈడీ రోప్ లైట్స్ ఏర్పాటు చేశారు. పట్టణ సుందరీకరణ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన లైట్స్ ను శుక్రవారం జనసేన నియోజకవర్గం ఇంఛార్జ్ భీమరశెట్టి రాంకి ప్రారంభించారు.
SKLM: ఆమదాలవలస మహాత్మా జ్యోతిరావు పూలే పాఠశాల, కళాశాలలో చేరేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్ష కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎంవి రత్నకుమారి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్‌లో మార్చి 4వ లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
నాచురల్ స్టార్ నాని హీరోగా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రూపొందిస్తున్న భారీ చిత్రం ‘ది ప్యారడైజ్’. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన ‘ఆయా షేర్’ సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తాజా లెక్కల ప్రకారం ఈ పాట యూట్యూబ్‌లో 30 మిలియన్ వ్యూస్‌ను దాటేసింది. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే 50 మిలియన్ మార్క్‌ను అందుకునే అవకాశం ఉంది.
MBNR: సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ చెస్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు పాలమూరు యూనివర్సిటీ చెస్ పురుషుల జట్టు తమిళనాడులోని భారతీదాసన్ యూనివర్సిటీ తిరుచిరాపల్లికి బయలుదేరింది. వీసీ శ్రీనివాస్ క్రీడాకారులకు క్రీడా దుస్తులు అందజేసి, క్రమశిక్షణతో సాధన చేసి విజయాలు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్ బాబు, పీడీ డా. శ్రీనివాస్ పాల్గొన్నారు.
SRD: పదో తరగతిలో విద్యార్థులు మంచి మార్కులు సాధించాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. కంది మండలం కాశీపూర్ కస్తూర్బా పాఠశాలను శుక్రవారం తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్షలు దగ్గర పడుతున్నందున విద్యార్థులు ఏకాగ్రతతో చదవాలని చెప్పారు. పరీక్షల ముగిసే వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు.
పల్లేకలె వేదికగా రేపు రాత్రి 7 గంటలకు శ్రీలంక, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. శ్రీలంక ఇప్పటికే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించగా, పాక్ సెమీస్ ఆశలు ఈరోజు జరుగుతున్న ENG vs NZ మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉన్నాయి. న్యూజిలాండ్ గెలిస్తే.. పాకిస్తాన్ ఇంటిదారి పడుతుంది. ఒకవేళ కివీస్ ఓడిపోతే మాత్రం.. లంకతో జరిగే మ్యాచ్‌లో పాక్ భారీ తేడాతో విజయం సాధిస్తేనే సెమీస్‌కు చేరుకుంటుంది.
VZM: రైల్వే ఆధునీకరణ కారణాల కారణంగా రైలు నంబరు 58532/ 31 విశాఖపట్నం బ్రహ్మపూర్, బ్రహ్మపూర్ విశాఖపట్నం మార్చి 2న, రద్దు చేస్తున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం పవన్ కుమార్ శుక్రవారం తెలిపారు. అలాగే రైలు నంబరు 67289/ 290 విశాఖపట్నం పలాస, పలాస విశాఖపట్నం మేము పాసింజర్ రైళ్లు రద్దు చేస్తున్నట్లు ఓ ప్రకటనలో చెప్పారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.