• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం

SRCL: చందుర్తి మండలం బండపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అధ్యయన బ్రహ్మోత్సవాలులో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ప్రత్యేక వేదికపై ఉత్సవముత్తులను ఆసీనులను చేసి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కల్యాణోత్సవంలో వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

March 1, 2026 / 04:31 PM IST

మునుగోడులో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్

NLG: మునుగోడులో రూ.200 కోట్లతో 2,500 మంది విద్యార్థుల కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం ప్రారంభించడం శుభపరిణామమని MLA రాజగోపాల్ రెడ్డి తెలిపారు. CM రేవంత్ నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 79 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ప్రారంభమవుతున్నాయని చెప్పారు. విద్యకు బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు పెరగాల్సిన అవసరం ఉందన్నారు.

March 1, 2026 / 04:31 PM IST

‘వ్యవసాయ కూలీల సమస్యల పరిష్కారించాలి’

WNP: వ్యవసాయ కూలీల సమస్యలు పరిష్కరించాలని అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆత్మకూరు పట్టణంలోని బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయ ఆవరణలో జిల్లా సమావేశం నిర్వహించారు. రైతులకు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

March 1, 2026 / 04:31 PM IST

రోడ్డు ప్రమాదం.. ముగ్గురికి తీవ్రగాయాలు

మంచిర్యాల నుంచి మందమర్రి వైపు వెళ్తున్న బైక్ ప్రమాదానికి గురవడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం జరిగిన ఈ ఘటనలో దుర్గం లావణ్య, అఖిలేశ్వర్, అన్విత్లకు తీవ్ర గాయాలయ్యాయి. వాహనం అదుపుతప్పి కింద పడటాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. 108 సిబ్బంది క్షత్తగాత్రులను ఘటనా స్థలానికి చేరుకున్నారు.

March 1, 2026 / 04:30 PM IST

పిడుగురాళ్ల రోడ్డు ప్రమాదం.. గుర్తుతెలియని వ్యక్తి మృతి

PLD: పిడుగురాళ్లలోని పిల్లుట్ల రోడ్డులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. సున్నంబట్టీల వద్ద గుర్తుతెలియని వాహనం అటుగా వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టడంతో, అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

March 1, 2026 / 04:30 PM IST

పేకాట శిబిరంపై పోలీసుల దాడి.. 8 మంది అరెస్ట్

BPT: జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు ఆదివారం పర్చూరు పోలీసులు జూద స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 8 మంది జూదగాళ్లను పట్టుకుని, వారి నుంచి రూ.6,060 నగదును స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఎవరైనా ఇటువంటి పనులకు పాల్పడుతుంటే వెంటనే 112 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు.

March 1, 2026 / 04:30 PM IST

తుళ్లూరు, తాడికొండలో బీసీ కమ్యూనిటీ హాల్స్ ప్రారంభం

GNTR: దాతల సహాయంతో తుళ్లూరు మండలం పెద పరిమి మరియు తాడికొండ మండలం రావెల గ్రామాల్లో నిర్మించిన బీసీ కమ్యూనిటీ హాల్స్‌ను కేంద్ర సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం, దాతలు సూద్న్ గుంట రాఘవేంద్రప్రసాద్, కల్యాణికు సన్మానం చేశారు.

March 1, 2026 / 04:30 PM IST

బీఆర్ నాయుడు వ్యాఖ్యలకు పేర్ని నాని కౌంటర్

కృష్ణా: బీఆర్ నాయుడు వ్యాఖ్యలకు పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అవి ఫేక్ వీడియోలైతే నిజమైన వీడియోలను బయటపెట్టాలని సవాల్ విసిరారు. మీపై వస్తున్న విమర్శలకు ముందుగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీవారి సన్నిధిలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. చేసిన తప్పులు బయటపడితే ఎదురుదాడి చేయడం సరికాదని వ్యాఖ్యానించారు.

March 1, 2026 / 04:30 PM IST

ఇందిరమ్మ ఇంటితో సొంతింటి కల సాకారం: ఎమ్మెల్యే

MBNR: హన్వాడ మండలం ఎనిమిది తాండాలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. పేదలకు భద్రమైన నివాసం కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పథకం సొంతింటి కల నెరవేర్చుతూ సామాజిక సమానత్వానికి దారి తీస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బీమి బాయ్, నాయకులు అధికారులు పాల్గొన్నారు.

March 1, 2026 / 04:30 PM IST

IND vs WI: పిచ్ ఎలా ఉందంటే..!

టీ20 ప్రపంచకప్ సూపర్-8 భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా టీమిండియా, వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. భారీ స్కోర్లు నమోదు కావొచ్చని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. బౌలర్లకు కూడా కొంత సహకారం లభిస్తుందని ప్రధాన క్యురేటర్ సుజన్ ముఖర్జీ తెలిపాడు. మంచు ప్రభావం ఉంటుందని చెప్పాడు. మ్యాచ్‌కు ఎలాంటి వర్షం ముప్పు లేదని వెల్లడించాడు.

March 1, 2026 / 04:29 PM IST

పోగొట్టుకున్న మొబైల్ ఫోను బాధితుడికి అందజేత

BHPL: గోరికొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల నర్సంపేట పట్టణానికి చెందిన సురేష్ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నారు. బాధితుడు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు CEIR పోర్టల్ ద్వారా మొబైల్ ఆచూకీ కనుగొన్నారు. ఆదివారం SI దివ్య ఆధ్వర్యంలో బాధితుడు సురేష్‌కు మొబైల్ ఫోన్ తిరిగి అందజేశారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ హరీష్ ఉన్నారు.

March 1, 2026 / 04:29 PM IST

పాలిసెట్ నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ పాలిసెట్-2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తిగల అభ్యర్థులు వచ్చే నెల 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. రూ.300 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 22 వరకు అవకాశం ఉందన్నారు. జనరల్ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీలకు రూ.250 ఫీజు కట్టాల్సి ఉంటుంది. మే 13న రాత పరీక్ష జరుగుతుంది. పూర్తి వివరాలకు polycet.sbtet.telangana.govను సంప్రదించండి.

March 1, 2026 / 04:28 PM IST

‘పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం’

GDWL: పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని అలంపూర్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ పచ్చర్ల కుమార్ పేర్కొన్నారు. ఎర్రవల్లి మండలం యుక్తాపూర్లో నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని పార్టీ శ్రేణులతో కలిసి ఆదివారం ప్రారంభించారు. మహిళలకు ఉచిత ప్రయాణం, విద్యుత్, సన్న బియ్యం అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందన్నారు.

March 1, 2026 / 04:28 PM IST

TPTF జిల్లా అధ్యక్షుడిగా మోతే శ్రీనివాస్

ADB: TPTF ఆదిలాబాద్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన సంఘం సర్వసభ్య సమావేశంలో ఎన్నిక జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా వృకోధర్ ఎన్నికయ్యారు. అలాగే అసోసియేట్ అధ్యక్షుడిగా రామేశ్వర్, ఉపాధ్యక్షులుగా సాయికాంత్, శ్యాంరావు, బాపురావులను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

March 1, 2026 / 04:28 PM IST

పిల్లర్ల స్థాయిలోనే వదిలేశారు..!

SRD: సంగారెడ్డిలోని ప్రశాంత్ నగర్లో మంచినీటి ట్యాంక్ నిర్మాణం పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. అమృత్ 2.0 నిధుల్లో భాగంగా సంగారెడ్డి మున్సిపాలిటీలో ఆరు మంచినీటి ట్యాంకులు నిర్మించాలని నిర్ణయించారు. కాగా ప్రశాంత్ నగర్లో ఒక చోట మాత్రమే పిల్లర్ల స్థాయి వరకు నిర్మించి వదిలేశారు. మంచినీటి ట్యాంకులు నిర్మాణాలను వేగవంతం చేయించాలని కోరుతున్నారు.

March 1, 2026 / 04:27 PM IST