MDK: ఏడుపాయలలో పౌర్ణమిని పురస్కరించుకొని నేడు రాత్రి వన దుర్గమ్మ ఉత్సవ విగ్రహాన్ని పల్లకి సేవ నిర్వహించారు. ముందుగా అమ్మవారి మూల విరాట్ విగ్రహానికి పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకిలో ఏర్పాటుచేసిన ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వహించారు. ఆలయం నుంచి ప్రారంభమైన పల్లకిసేవ శివాలయం మీదుగా కొనసాగి రాజగోపురం గుండా ఆలయం వరకు చేరుకుంది.
ఇరాన్ నిఘా శాఖలో ఇద్దరు సీనియర్ అధికారులు మృతి చెందారు. ఆ ఇద్దరు అధికారులను తామే చంపినట్లు ఇజ్రాయెల్ రక్షణదళాల ట్వీట్ చేశాయి. నిఘా శాఖ సహాయమంత్రి సయ్యద్ యాహ్యా హమీద్, ఇరాన్ గూఢాచర్య విభాగ అధిపతి జలాల్ పోర్ హుస్సేన్ మృతి చెందారు. కాగా, ఇజ్రాయెల్ ఇలాంటి రహస్య ఆపరేషన్లపై మౌనంగా ఉంటుంది. కానీ ఈసారి బహిరంగంగా ప్రకటించడం ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది.
E.G: నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా మంత్రి కందుల దుర్గేష్ చొరవతో కీలక మౌలిక సదుపాయాల పనులకు మోక్షం లభించింది. యర్రాయిచెరువు – పిట్టల వేమవరం వరకు నిర్మించ తలపెట్టిన 1.1 కి.మీ సీసీ రోడ్డుకు కూటమి ప్రభుత్వం రూ.1.30 కోట్లు మంజూరు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దామని మంత్రి తెలిపారు.
ADB: హోలీ పండుగను జిల్లా ప్రజలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలియజేశారు. సోమవారం పోలీస్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమై మాట్లాడారు. హోలీ పండుగకు డీజే అనుమతి లేదన్నారు. యువత, పిల్లలు వాగులు, చెరువులలో స్నానాలకు వెళ్లరాదని సూచించారు.
BDK: కొత్తగూడెం జిల్లా IDOC కార్యాలయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దిష్ట కాలపరిమితిలో సమస్య పరిష్కరించే విధంగా వేగవంతమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్,అదనపు కలెక్టర్ విద్యా చందనతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు.
MHBD: కొత్తగూడ మండలం గుండంపల్లి గ్రామంలో చాలా కాలంగా సెల్ సిగ్నల్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులకు ఊరట లభించింది. బీఎస్ఎన్ఎల్ టవర్ ఏర్పాటైనా సిగ్నల్ రాకపోవడంతో నిరీక్షణలో ఉన్న ప్రజలకు నేడు సిగ్నల్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఇక పై ఫోన్ కాల్స్, ఇంటర్నెట్ సేవలు సాఫీగా ఉంటాయని విద్యార్థులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.
VSP: యువతకు స్ఫూర్తినిస్తూ భారతీయ–ఆస్ట్రేలియన్ ఎండ్యూరెన్స్ అథ్లెట్ ఓం సతీజా చేపట్టిన “వన్ ఇండియా రన్” సోమవారం విశాఖ చేరుకుంది. దేశవ్యాప్తంగా 5,000 కిలోమీటర్ల పరుగు ద్వారా సమాజ సేవ, ఆరోగ్యంపై అవగాహన కల్పించడమే లక్ష్యమని ఆయన తెలిపారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సాగుతున్న ఈ పరుగు ద్వారా ఉదయాన్ ఫౌండేషన్ కోసం రూ.60 లక్షలు సేకరించనున్నట్లు చెప్పారు.
JGL: రాయికల్ మున్సిపాలిటీ నూతన పాలకవర్గం సోమవారం బాధ్యతలు చేపట్టింది. మున్సిపల్ ఛైర్మన్‌గా కట్కం రవీందర్ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ నాగరాజు ఆధ్వర్యంలో అధికారిక పత్రాలపై సంతకం చేసి పదవి స్వీకరించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ ముఖ్య అతిథిగా హాజరై వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువ నాయకులు ఎల్.కార్తికేయ, కౌన్సిలర్లు ఉన్నారు.
PDPL: వర్షాకాలంలో పిడుగులు, మెరుపుల నుంచి విద్యుత్తు లైన్లు, ట్రాన్స్ ఫార్మర్లను కాపాడేందుకు పెద్దపల్లి సర్కిల్లో పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు ఎస్ఈ గంగాధర్ తెలిపారు. కీలక ప్రాంతాల్లో 122 లైట్నింగ్ అరెస్టర్లను ఏర్పాటు చేశామని, ఇవి అధిక వోల్టేజ్‌ను భూమిలోకి మళ్లించి బ్రేక్ డౌన్లను నివారిస్తాయన్నారు. వినియోగదారులకు అంతరాయం లేని విద్యుత్ అందుతుందన్నారు
సినీ హీరో విజయ్ దేవరకొండ రష్మికలకు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ దంపతులు విషెస్ చెప్పారు. బల్మూర్ మండలంలోని తుమ్మన్ పెట్ గ్రామంలో జరిగిన కార్యక్రమానికి కలెక్టర్ సతి సమేతంగా హాజరై విజయ్ దేవరకొండ దంపతులకు పుష్పగుచ్చం అందజేసి పెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది.
ATP: జిల్లాకు కేటాయించిన హౌసింగ్ లక్ష్యాన్ని ఉగాది నాటికి పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ అధికారులను ఆదేశించారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 16,702 ఇళ్లను పూర్తి చేసి ప్రారంభించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఉపాధి హామీ పనుల బిల్లుల నమోదు చేయాలని సూచించారు.
GNTR: ఏటుకూరు బైపాస్ జంక్షన్ వద్ద విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్రమంగా తరలిస్తున్న 14 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని మినీ లారీతో పాటు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై 6A కింద కేసు నమోదు చేయాలని అధికారుల ఆదేశాలతో నల్లపాడు పోలీస్ స్టేషన్ లో లారీ యజమాని, డ్రైవర్ మరియు సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేశారు.
MDK: శివంపేట కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ చేశారు. పాఠశాల వార్షికోత్సవ వీడ్కోలు వేడుకలను నిర్వహించగా, పాఠశాల విడిచి వెళ్లే సందర్భంగా విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు. జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ వారికి ప్రేరణాత్మక సందేశం అందించారు.
VKB: తెలంగాణ ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు, పింఛన్లతో పాటు ప్రత్యేక గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 250 గజాల ఇంటి స్థలం,పెన్షన్ సౌకర్యం కల్పించాలని విన్నవించారు. అర్హులైన ప్రతి ఉద్యమకారుడికి ప్రభుత్వం అండగా ఉండాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.
కృష్ణా: మచిలీపట్నం కలెక్టరేట్ కార్యాలయం ముందు నిర్వహించిన అమృత్ స్వచ్ఛ కృష్ణ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ బ్లాటింగ్ ప్లాంట్‌ను కలెక్టర్ బాలాజీతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు పరిశుభ్రమైన త్రాగునీరు అందించడం ప్రభుత్వం లక్ష్యమని, పరిశుభ్రమైన నీరు అందుబాటులోకి వస్తుందన్నారు.