• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మంజీరాలో అర్ధరాత్రి ఇసుక దందా..!

MDK: పాపన్నపేట మంజీరా నదీ తీరంలో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతుంది. ఎనికపల్లి, చిత్రలా, గాజులగూడెం పరిధిలో రాత్రి 11 గంటల తర్వాత నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. చీకటి పడగానే ట్రాక్టర్లతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని, అధికారుల పర్యవేక్షణ కరువైందని మండిపడుతున్నారు.

February 25, 2026 / 06:24 AM IST

విధులకు హాజరుకాని 17 మంది వైద్యుల తొలగింపు

WGL: దీర్ఘకాలంగా విధులకు హాజరుకాని ఉమ్మడి వరంగల్ జిల్లాలో 17మంది వైద్యులను సేవల నుంచి తొలగిస్తూ డిఎంఈ నరేంద్రకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో హనుమకొండ ప్రసూతి ఆసుపత్రి, ఎంజీఎం ఆసుపత్రి, జనగామ, మహబూబాబాద్ తదితర ప్రాంతాల్లో పనిచేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అలాగే కాకతీయ వైద్య కళాశాలకు ఎంపికై విధుల్లో చేరని పలువురు వైద్యులను కూడా ఈ జాబితాలో ఉన్నారు.

February 25, 2026 / 06:24 AM IST

‘బస్తీ దవాఖానలను సద్వినియోగం చేసుకోవాలి’

SDPT: గజ్వేల్ 17వ వార్డులోని బస్తీ దవాఖాన, అంగన్వాడీ కేంద్రాన్ని మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ పద్మాబాయ్ సందర్శించారు. దవాఖానలోని వైద్య సదుపాయాలను పరిశీలించి, ప్రజలు వీటిని వినియోగించుకోవాలని కోరారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారం, కేంద్రం నిర్వహణ తీరును తనిఖీ చేశారు.

February 25, 2026 / 06:23 AM IST

డీసీసీబీ అభివృద్ధి ప్రణాళిక లక్ష్యాలను సాధించాలి: కలెక్టర్

MBNR: డీసీసీబీ అభివృద్ధి ప్రణాళిక లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. మంగళవారం డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వయం సహాయక సంఘాలను అనుసంధానం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఎక్సిక్యూటివ్ ఆఫీసర్ రమాకాంత్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

February 25, 2026 / 06:22 AM IST

ఇంటర్, పదో తరగతి పరీక్షలు.. టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు

KMR: కామారెడ్డి జిల్లాలో ఇంటర్, పదో తరగతి పరీక్షలను పకడ్బందీ ఏర్పట్లు చేసినట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. మంగళవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలకు సంబంధించి ఏమైనా సందేహాలు, సలహాలు కు 9866143782, 9948164514 నంబర్కు కాల్ చేయాలన్నారు.

February 25, 2026 / 06:22 AM IST

తిరుపతిలో బాలిక అదృశ్యం

TPT: తిరుపతిలోని ఆటోనగర్‌కు చెందిన అశాలత (19), ఆమె మేనవరాలు దుర్గా (2) అదృశ్యమైనట్లు ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 19న ఉదయం ఇంటి నుంచి వెళ్లిన వీరిద్దరూ తిరిగి రాలేదని తల్లి నాగరత్నం ఫిర్యాదు చేశారు. బంధుమిత్రుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. బాధితురాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

February 25, 2026 / 06:21 AM IST

దివ్యాంగులకు ల్యాప్టాప్ల పంపిణీ చేసిన MLA, కలెక్టర్

HNK: జిల్లాలోని ఐదుగురు దివ్యాంగులకు WGL పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మంగళవారం ల్యాప్టాప్లను పంపిణీ చేశారు. జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సాంకేతికత దివ్యాంగుల సాధికారతకు ఎంతో తోడ్పడుతుందని తెలిపారు.

February 25, 2026 / 06:21 AM IST

‘జిల్లాలో కొబ్బరి ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలి’

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మెగా కొబ్బరి ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని MLA ఆనందరావు మంగళవారం శాసనసభలో కోరారు. జిల్లాలో క్వాయర్ ఇండస్ట్రీ లేకపోవడాన్ని ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ప్రస్తావించారు. ‘వన్ ఫ్యామిలీ -వన్ ఎంట్రప్రెన్యూర్’ లక్ష్యంగా అడుగులు వేయాలని, ఉపాధి అవకాశాల కోసం మెగా పరిశ్రమలు తక్షణమే నెలకొల్పాలన్నారు.

February 25, 2026 / 06:20 AM IST

ఘనంగా సిర్లు పోతన్న ఎల్లమ్మ జాతర

PPM: పాలకొండ నగర పంచాయతీలోని శిర్లిపోతన్న ఆలయం వద్ద మంగళవారం జాతర వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా సమీప గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఆలయం ముందర ఉన్న పోతురాజు విగ్రహం వద్ద మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం పూజలు చేశారు. సాయంత్రం పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో దేవరపేట నుంచి వెంకమ్మపేట వరకు శిర్లు యాత్ర సందడి నెలకొంది.

February 25, 2026 / 06:20 AM IST

ఎంపీ సానా సతీశ్‌కు అరుదైన గౌరవం

KKD: 18వ లోక్ సభ కాలానికి సంబంధించి బల్గేరియాతో పార్లమెంటరీ ఫ్రెండ్దిప్ గ్రూప్ ఏర్పాటయింది. ఇందులో సభ్యునిగా కాకినాడకు చెందిన రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్‌ను లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా మంగళవారం నామినేట్ చేశారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలను విస్తరించేలా చర్యలు తీసుకుంటానని సానా సతీశ్ తెలిపారు.

February 25, 2026 / 06:20 AM IST

మంత్రి నిమ్మలతో ఎమ్మెల్యే శ్రావణి భేటీ

ATP: శింగనమల నియోజకవర్గ సాగు, తాగునీటి సమస్యల పరిష్కారం కోరుతూ ఎమ్మెల్యే బండారు శ్రావణి మంగళవారం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును కలిసి వినతిపత్రం అందజేశారు. బుక్కరాయసముద్రం చెరువు ఆధునీకరణ, బీటీ రోడ్డు పనులతో పాటు నార్పల మండల గ్రామాల కోసం హెచ్‌ఎల్‌సీ నుంచి నక్కనూతి కుంటకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని విడుదల చేయాలని కోరారు.

February 25, 2026 / 06:20 AM IST

వరంగల్ సూపర్ స్పెషాలిటీపై హరీశ్రావుకు మంత్రి దామోదర్ కౌంటర్

SRD: వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌పై మాజీ మంత్రి హరీశ్రావు చేసిన విమర్శలను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఖండించారు. బీఆర్ఎస్ హయాంలో పనులు 50% కూడా పూర్తికాలేదని, అశాస్త్రీయంగా వ్యయం పెంచారని ఆరోపించారు. తమ ప్రభుత్వం రూ. 300 కోట్లు ఆదా చేసి పనులు వేగవంతం చేసిందన్నారు. 35 విభాగాలతో, ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్, కేన్సర్ చికిత్స త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

February 25, 2026 / 06:19 AM IST

‘యువ ఆపద మిత్రుల సేవలను వినియోగించుకుంటాం’

HYD: ప్రకృతి వైపరీత్యాల సమయంలో యువ ఆపద మిత్రుల సేవలను వినియోగించుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. యువ ఆపదమిత్ర పథకంలో భాగంగా HYD జిల్లాకు చెందిన 105 మంది యువవాలంటీర్లు వారం రోజులపాటు ఫతుల్ గూడలో హైడ్రా శిక్షణ పొందారు. వారికి ధ్రువపత్రాలు అందజేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారీ వర్షాలు, వరదల సమయంలో హైడ్రాతో కలిసి పని చేయడానికి సిద్ధంగా అందుబాటులో ఉండాలన్నారు.

February 25, 2026 / 06:18 AM IST

మియాపూర్‌లో విద్యార్థి ఆత్మహత్య

HYD: మియాపూర్‌లోని సాయినగర్‌లో శంకర్(18) అనే విద్యార్థి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గతేడాది పదో తరగతిలో ఫెయిల్ అయిన శంకర్, తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం బీదర్ వెళ్లిన సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

February 25, 2026 / 06:18 AM IST

నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

NLG: ఇంటర్‌ మీడియట్‌ వార్షిక పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు ఇంటర్మీడియేట్‌ విద్యాశాఖ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సర్వం సిద్ధం చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 57,353 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం 103 కేంద్రాలు ఏర్పా టు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు.

February 25, 2026 / 06:16 AM IST