SRPT: మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఎస్సై మోహన్ బాబు తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టామన్నారు. ‘అరైవ్-అలైవ్’ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ప్రజలకు చైతన్యం కల్పిస్తున్నామని చెప్పారు. పిల్లలకు వాహనాలు ఇవ్వడం నేరమని, ప్రమాదాలు జరిగితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
WGL: వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను ఎంపీ కడియం కావ్య పరిశీలించారు. ఉత్తర తెలంగాణకు తలమానికంగా నిలిచే ఈ ఆసుపత్రి ద్వారా వరంగల్‌తో పాటు పలు జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, త్వరలోనే ఓపీ, ఐపీ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని అన్నారు.
TPT: ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు జిల్లా వ్యాప్తంగా నమోదైన వివిధ నేరాలపై సవివరంగా సమీక్షించి, స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో బాలలపై నేరాలు, పోక్సో కేసులు, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ, గ్రీవెన్స్ పిటిషన్లు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. సైబర్ నేరాలు, గాంజాయి నియంత్రణలో “జీరో టోలరెన్స్” విధానం సూచించారు.
అన్నమయ్య: జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగంపై డ్రోన్లతో నిఘాను మరింత పటిష్టం చేసి, జీరో టోలరెన్స్ విధానంతో కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. కూల్ లిప్ అనే నికోటిన్ పదార్థాన్ని పాఠశాలలు, కళాశాలల్లో నిషేధించాలని సూచించారు. ఎన్జీవోల సమన్వయంతో డి-అడిక్షన్ కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలన్నారు. జిల్లా ఎస్పీ పాల్గొన్నారు.
SRCL: జిల్లాకు చెందిన 12 గ్రామాల ప్రజలు ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కలిసి తమ సమస్యలను వివరించారు. ప్రస్తుతం పెద్ద లింగాపూర్ సబ్‌స్టేషన్ ఎదుట నిరాహార దీక్ష కొనసాగిస్తున్నామని, తమ దీక్షకు మద్దతుగా రావాలని తీన్మార్ మల్లన్నను కోరారు. 4న దీక్షా శిబిరానికి స్వయంగా హాజరై రైతులకు మద్దతు ఇస్తా అన్నారు.
HYD: చార్మినార్ పరిధిలోని జామ మసీద్ చౌక్‌లో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ మాసం అవడంతో నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఎంఐఎం నేతలు, స్థానిక ముస్లింలు పాల్గొన్నారు.
NDL: మహానంది దేవస్థానానికి గత 27 రోజుల్లో రూ. 25,05,573 ఆదాయం వచ్చినట్లు EO కాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. జిల్లా దేవాదాయశాఖ అధికారి మోహన్ పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది. మహానందీశ్వర స్వామి, కామేశ్వరీదేవి, సీతా కోదండ రామాలయాల హుండీల్లో రూ.34,64,108 వసూలవగా, గో సంరక్షణ నిధికి రూ.16,825, అన్నదాన హుండీకి రూ.24,640తో పాటు 2 USA డాలర్లు వచ్చాయి.
NRML: కేజీబీవీలలో ఖాళీగా ఉన్న ఏఎన్ఎం, అకౌంటెంట్ పోస్టుల భర్తీకి మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో భోజన తెలిపారు. బైంసాలో ఏఎన్ఎం ఒక పోస్టు, ఖానాపూర్, దస్తురాబాద్‌లలో అకౌంటెంట్ ఒక్కో పోస్టు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. రోస్టర్ ప్రాతిపదికన నియామకం జరుగుతుందని, అర్హులైన అభ్యర్థులు మార్చి 4లోపు ఎంఈవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
రంజీ ఫైనల్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి జమ్మూకశ్మీర్ 477 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 293 పరుగులకు ఆలౌటైంది. JK తొలి ఇన్నింగ్స్‌లో 584, ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌లో 186/4 పరుగులు చేసింది. రేపు చివరి రోజు కావడంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశం ఉంది. దీంతో తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా జమ్మూకశ్మీర్ విజేతగా నిలవడం ఖాయం.
KMM: బోనకల్ మండలం తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న బి. ఉపేందర్ ఉదయం 11గంటలు దాటినా కార్యాలయానికి హాజరు కావడం లేదని శుక్రవారం మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. పరిపాలనా సేవల కోసం వచ్చే ప్రజలు గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని తెలిపారు. దీనివల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు పేర్కొన్నారు.
KDP: సిద్ధవటం మండలం కడప-చెన్నై జాతీయ రహదారి కనుమలోపల్లి సమీపాన వెలసిన శ్రీ మానసా దేవి అమ్మవారికి శుక్రవారం కడప పట్టణానికి చెందిన నారాయణ,రవికుమార్ కుటుంబ సభ్యులు రూ. 2 లక్షలు విలువైన తొడుగులు సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అమ్మవారి విగ్రహ ప్రతిష్ట రోజు తొడుగులు సమర్పిస్తామని మొక్కుకున్నామన్నారు. అందుకు ఇవాళ అమ్మవారికి మొక్కులు చెల్లించామన్నారు.
MNCL: క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక విషయంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేసిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బెయిల్ పిటిషన్‌ను జిల్లా న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్, సుమన్‌కు సంబంధించిన న్యాయవాదుల వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత సోమవారానికి వాయిదా వేశారు.
MDCL: విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడంలో డాట్ల ఫౌండేషన్ కృషి అభినందనీయమని ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్తా తెలిపారు. కౌకూర్ ZPHS పాఠశాలలో డాట్ల ఫౌండేషన్ సహకారంతో నిర్మించిన రెండు అదనపు తరగతి గదులను శుక్రవారం ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో మేనేజింగ్ ట్రస్టీ పూర్ణిమ, ఎంఈవోలు మనోహర్, మురళికృష్ణమూర్తి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
PDPL: జిల్లాలో స్త్రీ నిధి బకాయిలను 100% రికవరీ చేయాలని డీఆర్‌డీవో కాళిందిని స్త్రీ నిధి సిబ్బందిని ఆదేశించారు. ఇవాళ కలెక్టరేట్లో అధికారులతో స్త్రీ నిధి రుణాలపై సమీక్ష నిర్వహించారు. మార్చి 5 లోపు రుణాల రికవరీ, రుణ ప్రణాళిక 100% పూర్తి చేయాలన్నారు. దీనితో సిబ్బంది వేతనాలు నిలిపివేసి, శాఖాపరమైన చర్యలు చేపడతామని తెలిపారు.
MNCL: తాండూర్ మండల కేంద్రంలోని ఐబీ బ్రిడ్జి కింద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రేపల్లెవాడకు చెందిన సెయింట్ థెరీస్సా స్కూల్ బస్సు, బైకును ఢీకొనడంతో మనోహర్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో విద్యార్థులు ఉన్నారు. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం బెల్లంపల్లి ఆస్పత్రికి తరలించారు.