అన్నమయ్య: రైల్వే కోడూరులో ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై ఆరోపణలు చేసిన మహిళా ఉద్యోగి హర్షవీణ ఇవాళ స్థానిక కోర్టుకు హాజరుకానున్నారు. ఎమ్మెల్యే తల్లి ప్రమీలమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో నమోదైన కేసులో హైకోర్టు మార్చి 2న హర్షవీణకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు బెయిల్ షూరిటీలు స్థానిక కోర్టులో దాఖలు చేయనున్నారు.
GNTR: వ్యవసాయంతో గ్రామీణ అభివృద్ధిలో మార్పు అనే అంశంపై రైతులకు వెబినార్ సందేశం, సమావేశం శుక్రవారం ఫిరంగిపురం–1 రైతు సేవా కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు ఎన్. మోహన్‌రావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి వివరించారు.
KMR: పాల్వంచ మండలం ఫరీద్‌పేటలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రంథాలయాలు విజ్ఞాన గనులని, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగులకు ఇవి ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థులు, యువత పుస్తకాలను చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు.
PPM: రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ రూపొందించిన ‘స్వర్ణాంధ్ర@2047’ క్యాలెండర్లను జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ లక్ష్యాల సాధనలో జిల్లా అధికారుల చొరవ, సహకారంతో జిల్లా ముందంజలో ఉందని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో జేసీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ADB: విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఆదిలాబాద్ జిల్లాలోనే ప్రభుత్వ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలనీ పలువురు విద్యార్థులు కోరారు. శుక్రవారం నేరడిగొండలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటనలో భాగంగా ఆయనకు వినతి పత్రం అందజేశారు. యూనివర్సిటీని నిర్మల్‌కు తరలించే ప్రతిపాదనను విరమించుకోవాలన్నారు. అదేవిధంగా జిల్లాలో ST స్టడీ సర్కిల్ ప్రారంభించాలన్నారు.
HNK: 59వ డివిజన్ వికాస్ నగర్ కాలనీలోని శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర ఆలయంలో శుక్రవారం విగ్రహ ప్రతిష్ట మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో MLA నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ఆలయ కమిటీ, కాంగ్రెస్ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు.
NLG: చిట్యాల ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ మలుపు వద్ద తెరిచి ఉన్న గేట్ వాల్ వాహనదారులకు ప్రాణసంకటంగా మారింది. స్కూల్ వెనుక వైపు నివసించే స్థానికులు, వాహనదారులు మలుపు వద్ద తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇవాళ ఇదే వార్డులో ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో, అధికారులు స్పందించి వెంటనే డ్రైనేజీపై మూతను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
W.G: పోడూరు మండలం చింతలగరువు స్కూల్లో ఇవాళ HM కొల్లాబత్తుల సూర్య కుమార్ అధ్యక్షతన జాతీయ దంత వైద్యుల దినోత్సవం జరిపారు. MIHP ఎం. అనిత మాట్లాడుతూ.. మన దంతాలు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం అన్నారు. దంతాల పట్ల విద్యార్థులు తీసికోవలసిన జాగ్రత్తలు గురించి వివరించారు. ANM వి.మాలిని, హెల్త్ అసిస్టెంట్ R.రాజేష్, ఆశా వర్కర్ M. నిర్మలాకుమారి పాల్గొన్నారు.
NRPT: జిల్లాలోని ప్రైవేట్ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈవో సూచనలు జారీ చేశారు. SSC ప్రీ ఫైనల్ పరీక్షల ఫలితాలపై సమీక్ష సమావేశాన్ని రేపు శ్రీ కృష్ణ గోకులం హైస్కూల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశం మధ్యాహ్నం 2.00 నుంచి 3.30 గంటల వరకు జరుగుతుందని, సమయానికి అందరూ హాజరు కావాలన్నారు.
NDL: బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామంలో ఇవాళ ఎంపీడీవో గాయత్రి పర్యటించారు. ఇంటి పన్ను, కులాయి పన్ను సక్రమంగా చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని ప్రజలకు సూచించారు. పారిశుద్ధ్య పనులు సరిగా జరగడం లేదని, దోమల బెడద అధికమైందని గ్రామస్తులు ఆమె దృష్టికి తెచ్చారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
AP: టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీలో ఎవరు తప్పు చేసినా బాధ్యత వహించాలని అన్నారు. లేకపోతే వెంకటేశ్వరస్వామే వారిని శిక్షిస్తారని తెలిపారు. ‘కూటమి ప్రభుత్వంలో కల్తీ అని తేలినా.. మరో సంస్థ పేరుతో 4 ట్యాంకర్ల నెయ్యిని తీసుకొచ్చారు. నెయ్యిపై చర్చించాలని కోరితే ప్రభుత్వం తోకముడిచింది’ అని విమర్శించారు.
కృష్ణా: 15వ ఆర్థిక సంఘం నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి తెలిపారు. శుక్రవారం చల్లపల్లి అశోక్ నగరులో గ్రామ పంచాయతీ 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 4లక్షలతో నూతన సీసీ రోడ్డు నిర్మాణం పనులు చేపట్టారు. సర్పంచ్ పూజలు చేసి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో పంచాయతీ ఈఓ పీవీ మాధవేంద్రరావు, వార్డ్ సభ్యులు మీర్ రిజ్వాన్ పాల్గొన్నారు.
MBNR: మిడ్జిల్ మండలం రాణిపేటలో శుక్రవారం ‘డ్రై డే–ఫ్రైడే’ కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి సుదర్శన్ మాట్లాడుతూ.. డెంగీ, చికున్ గున్యా వంటి వ్యాధులు రాకుండా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నిల్వ నీటిని తొలగించి దోమల పెరుగుదలను అరికట్టాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.
అన్నమయ్య: మదనపల్లె మార్కెట్‌లో శుక్రవారం టమాటా ధరలు భారీగా పడిపోయాయి. ఇవాళ మార్కెట్‌కు సుమారు 70 మెట్రిక్ టన్నుల టమాటాలను రైతులు తీసుకొచ్చారు. వ్యాపారులు మొదటి రకం 10 కిలోల బాక్స్‌ను రూ.110కు, రెండో రకం బాక్స్‌ను రూ. 90కు కొనుగోలు చేశారు. పంట దిగుబడి బాగున్నప్పటికీ గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
NGKL: కల్వకుర్తి మండలంలోని గుంటూరు గ్రామానికి చెందిన తుప్పల సత్యనారాయణకు మంజూరైన సీఎం సహాయనిధి చెక్కును స్థానిక కాంగ్రెస్ నాయకులు ఇవాళ అందజేశారు. బాధితుడు అనారోగ్యంతో బాధపడుతూ.. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందగా ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో రూ. 60 వేల సీఎం సహాయనిధి చెక్కు మంజూరు అయినట్లు తెలిపారు.