• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం: షేక్ సలాం

KMR: జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి షేక్ సలాం తెలిపారు. రేపటి నుంచి మార్చి 17 వరకు ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతాయని చెప్పారు. జిల్లాలో 37 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 17,953 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు, మంచినీటి వసతి కల్పించామన్నారు.

February 24, 2026 / 05:32 PM IST

‘స్మశాన వాటికకు స్థలం కేటాయించాలి’

KRNL: పెద్దకడబూరు మండలం మేకడోణ గ్రామంలో ఉన్న ముస్లిం మైనారిటీలకు స్మశాన వాటిక కోసం స్థలం చూపించాలని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఆర్ఐ జెర్మియాకు వినతిపత్రం అందజేశారు. ఈ ఏఐవైఎఫ్ తాలూకా అధ్యక్షులు జాఫర్ పటేల్, మండల నాయకులు జాఫర్ ఖాన్ పటేల్ మాట్లాడుతూ ముస్లీంలకు స్మశాన వాటికకు సరియైన స్థలం లేక ముస్లింలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు.

February 24, 2026 / 05:32 PM IST

అజీమ్ ఖాన్ మృతికి ఎమ్మెల్యే కోరం నివాళి

BDK: ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డుకు చెందిన అజీమ్ ఖాన్ గుండెపోటుతో మంగళవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య అజీమ్ ఖాన్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం ద్వారా అన్నివేళలా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

February 24, 2026 / 05:31 PM IST

మహిళల సమస్యలపై వర్సిటీ వీసీలతో రాయపాటి శైలజ సమీక్ష

GNTR: విశ్వవిద్యాలయాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. మంగళవారం మంగళగిరిలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ వర్సిటీల వీసీలతో ఆమె వర్చువల్ సమావేశం నిర్వహించారు. ‘క్యాంపస్ అంబాసిడర్’ కార్యక్రమం అమలుతో పాటు, విద్యార్థినుల సవాళ్లపై పరిశోధనలు చేయాలని ఆమె సూచించారు.

February 24, 2026 / 05:30 PM IST

బోర్డు పరీక్షలపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్

KMM: ఖమ్మం జిల్లాలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం, విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ.. విద్యార్థులు 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ లోపు కేంద్రానికి చేరుకోవాలన్నారు.

February 24, 2026 / 05:30 PM IST

బావను నరికి చంపిన మరదలు

TG: మొగిలయ్య(70) అనే వ్యక్తి తన మరదలు(50) నరికి చంపిన ఘటన హన్మకొండ జిల్లా హాసన్‌పర్తిలో జరిగింది. భార్య చనిపోవడంతో మొగిలయ్య తన మరదలితో సహజీవనం చేస్తున్నాడు. వీరిద్దరి మధ్య నెలకొన్న ఘర్షణ అతడి మరదలు చంపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

February 24, 2026 / 05:30 PM IST

పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన

WNP: మంత్రి జూపల్లి కృష్ణారావు పానగల్ మండలంలోని బహదూర్ గూడెంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం కొత్తపేటలో మహిళా సమైక్య భవనానికి శంకుస్థాపన ఆయన చేశారు. మహ్మదాపూర్, కొత్తపేటల్లో లబ్ధిదారులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ వేడుకలకు మంత్రి హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

February 24, 2026 / 05:30 PM IST

జనగణన-2027 రాజ్యాంగబద్ధమైనది: కలెక్టర్

NLR: సాధారణ కోవిడ్, కుటుంబ సర్వేల కన్నా, జనగణన-2027 సర్వే రాజ్యాంగబద్ధమైనదని దానిని క్రమ పద్ధతిలో నిర్వహించాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. మంగళవారం నెల్లూరు నగరంలోని హరినాధపురంలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

February 24, 2026 / 05:30 PM IST

మార్చి 3న విఘ్నేశ్వరుని ఆలయం మూసివేత

కోనసీమ: మార్చి 3వ తేదీ మంగళవారం చంద్రగ్రహణం కారణంగా అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి ఆలయం మూసివేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి సత్యనారాయణ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోజు స్వామి వారికి చేసే అన్ని సేవలు ఉదయం 9 గంటల వరకు మాత్రమే జరుగుతాయని, 9.30 గంటల నుంచి ఆలయం మూసివేస్తామని పేర్కొన్నారు. మరునాడు ఉదయం సంప్రోక్షణ అనంతరం దర్శనాలు ఉంటాయన్నారు.

February 24, 2026 / 05:30 PM IST

‘భూసేకరణ వేగవంతం చేయాలి’

VZM: జిల్లాలో జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల భూసేకరణను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన సమీక్షలో తారకరామ తీర్థసాగర్, తోటపల్లి, జాతీయ రహదారులు, రైల్వే లైన్లు తదితర పనుల పురోగతిని సమీక్షించారు. అలాగే ఎయిర్‌పోర్ట్ భూ సేకరణ పూర్తి కావాలన్నారు.

February 24, 2026 / 05:29 PM IST

‘ఆశ వర్కర్ల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి’

WGL: ఆశ వర్కర్ల పెండింగ్‌లో ఉన్న వేతనాలు విడుదల చేయాలని BRTU ఆధ్వర్యంలో ఇవాళ జిల్లా వైద్య కార్యాలయం సూపర్డెంట్‌కి వినతిపత్రం అందజేశారు. అనంతరం యూనియన్ నాయకుడు యువరాజ్ మాట్లాడుతూ.. ప్రతి నెల ఒకటో తారీకు జీతం అందిస్తామని ప్రభుత్వం చెప్పి ఇప్పటి వరకు వేతనాలు అందించడం లేదని అన్నారు. ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న వేతనాలు విడుదల చేయాలని కోరారు.

February 24, 2026 / 05:27 PM IST

‘రోడ్డు భద్రతలో మహిళల పాత్ర కీలకం’

ADB: ప్రతి కుటుంబం సురక్షితంగా ఉండాలంటే మహిళలు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కలిగి ఉండాలని సిరికొండ ఎస్సై పూజ అన్నారు. “అరైవ్ ఆలైవ్” కార్యక్రమంలో పోలీస్ స్టేషన్లో స్వయం సహాయక సంఘాల మహిళలతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఇంట్లోని వారు వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా మహిళలు ప్రోత్సహించాలని కోరారు.

February 24, 2026 / 05:27 PM IST

జాబ్ మేళాకు 242 మంది హాజరు

AKP: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నర్సీపట్నం రిషి డిగ్రీ కళాశాలలో మంగళవారం జాబ్ మేళా ఏర్పాటు చేశారు. ఈ మేళకు 242 మంది నిరుద్యోగ యువతీ యువకులు హాజరయ్యారు. ఇంటర్వ్యూల అనంతరం 108 మంది అభ్యర్థులు వివిధ కంపెనీలకు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి ప్లేస్‌మెంట్ అధికారి పప్పల శ్రీనివాసరావు పాల్గొన్నారు.

February 24, 2026 / 05:26 PM IST

బాధిత కుటుంబానికి యువ నేత భరోసా

MLG: మండలంలోని చేరుపల్లి (కొత్తపేట) గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ దీసీ సెల్ మండల అధ్యక్షులు ముత్తినేని ఆదినారాయణ బాబాయి సోదరుడు, పార్టీ నాయకుడు ముత్తినేని వసంతరావు అనారోగ్యంతో మృతి చెందారు. సోమవారం దశదిన కర్మకు కాంగ్రెస్ యువ నేత కుంజా సూర్య హాజరై చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

February 24, 2026 / 05:26 PM IST

రైల్వే, రహదారి పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

TPT: జిల్లాలో జరుగుతున్న రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, శ్రీ సిటీ పరిశ్రమల విస్తరణకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ సమస్యలను త్వరగా పరిష్కరించి పనులను గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

February 24, 2026 / 05:25 PM IST