• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రేపటి నుంచి జనసేన సభ్యత్వ నమోదు ప్రోగ్రాం

ELR: ఉంగుటూరు నియోజకవర్గంలో ఈనెల 26 నుంచి మార్చి 10 వరకు జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ధర్మరాజు తెలిపారు. సభ్యత్వం పొందిన వారికి రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం ఉంటుందని పేర్కొన్నారు. పార్టీలో తగిన గుర్తింపుతో పాటు సేవా కార్యక్రమాల్లో ప్రాధాన్యత ఉంటుందని, కార్యకర్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

February 25, 2026 / 06:30 AM IST

బనగానపల్లె ఆర్డీవోగా నరేంద్రనాథ్ రెడ్డి

NDL: రాష్ట్రంలో పలువురు డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. మరి కొందరికి డిప్యూటీ కలెక్టర్లుగా, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్‌పై పోస్టింగ్ ఇచ్చింది. ఇందులో భాగంగా బనగానపల్లె ఆర్డీవోగా నరేంద్రనాథ్ రెడ్డిని నియమించింది. ఈ మేరకు రాత్రి చీఫ్ సెక్రటరీ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయన్నారు.

February 25, 2026 / 06:30 AM IST

నడిరోడ్డుపై మొరాయించిన ఆర్టీసీ బస్సు

KRNL: పత్తికొండ పట్టణంలోని నడిరోడ్డుపై మంగళవారం రాత్రి ఓ పల్లెవెలుగు ఆర్టీసీ బస్సు చెడిపోయింది. కోర్టు, పోలీస్ స్టేషన్, రీడింగ్ రూమ్, నాలుగు స్తంభాల కూడలి వంటి ముఖ్యమైన ప్రాంతాలు కావడంతో అక్కడ తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇరుకు రోడ్డుపై గంటసేపు బస్సు నిలిచి ఉండిపోవడంతో వాహనదారులు అసౌకర్యానికి గురయ్యారు.

February 25, 2026 / 06:30 AM IST

మాకు న్యాయం చేయండి.. బాధితురాలి ఆవేదన

NLR: కలువాయి మండలం చింతలాత్మకూరు గ్రామ సర్పంచ్ ఏలూరు ప్రభావతి తన పొలాన్ని అక్రమించుకున్నారని అదే గ్రామానికి చెందిన నూటేటి జనజ ఆరోపించారు. రీ సర్వేలో తన భూమిని సర్పంచ్ పేరు మీదకి మార్చుకున్నారని వాపోయారు. పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగిన తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించాలని విజ్ఞప్తి చేశారు.

February 25, 2026 / 06:30 AM IST

నగరి ఆర్డీవోగా అనుపమ

CTR: రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న కొందరు డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ సీఎస్ విజయానంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. చిత్తూరు కలెక్టరేట్‌లో పనిచేస్తున్న అనుపమను నగరి ఆర్డీవోగా నియమించారు. ప్రస్తుతం నగరిలో ఆర్డీవోగా ఉన్న భవాని శంకర్ రెడ్డిని పోస్టింగ్ ఇవ్వకుండా బదిలీ చేశారు.

February 25, 2026 / 06:28 AM IST

నేటి నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు

MBNR: జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనునట్లు అధికారులు ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. పరీక్షల కోసం జిల్లాలో మొత్తంగా 35 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అందులో 20 ప్రభుత్వ కళాశాలలు కాగా 15 ప్రైవేట్ కళాశాలలన్నారు. 10859 ఇంటర్ మొదటి సంవత్సరం, 11025 మంది సెకండ్ ఇయర్ పరీక్షలు రాయబోతున్నారన్నారు.

February 25, 2026 / 06:27 AM IST

నేషనల్ టాలెంట్ సెర్చ్‌లో విద్యార్థుల మెరుపులు

NGKL: అపెక్స్ నేషనల్ టాలెంట్ సెర్చ్ పరీక్షలో అచ్చంపేట ఓ పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. అర్పిత్ కృష్ణ (నేషనల్ ర్యాంక్-3), రాకేష్ (స్టేట్ ర్యాంక్-2)తో పాటు రూపేష్, రిషిక్, సుష్మ జోనల్ స్థాయిలో ర్యాంకులు సాధించారు. విద్యార్థుల విజయంపై పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.

February 25, 2026 / 06:26 AM IST

మంజీరాలో అర్ధరాత్రి ఇసుక దందా..!

MDK: పాపన్నపేట మంజీరా నదీ తీరంలో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతుంది. ఎనికపల్లి, చిత్రలా, గాజులగూడెం పరిధిలో రాత్రి 11 గంటల తర్వాత నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. చీకటి పడగానే ట్రాక్టర్లతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని, అధికారుల పర్యవేక్షణ కరువైందని మండిపడుతున్నారు.

February 25, 2026 / 06:24 AM IST

విధులకు హాజరుకాని 17 మంది వైద్యుల తొలగింపు

WGL: దీర్ఘకాలంగా విధులకు హాజరుకాని ఉమ్మడి వరంగల్ జిల్లాలో 17మంది వైద్యులను సేవల నుంచి తొలగిస్తూ డిఎంఈ నరేంద్రకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో హనుమకొండ ప్రసూతి ఆసుపత్రి, ఎంజీఎం ఆసుపత్రి, జనగామ, మహబూబాబాద్ తదితర ప్రాంతాల్లో పనిచేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అలాగే కాకతీయ వైద్య కళాశాలకు ఎంపికై విధుల్లో చేరని పలువురు వైద్యులను కూడా ఈ జాబితాలో ఉన్నారు.

February 25, 2026 / 06:24 AM IST

‘బస్తీ దవాఖానలను సద్వినియోగం చేసుకోవాలి’

SDPT: గజ్వేల్ 17వ వార్డులోని బస్తీ దవాఖాన, అంగన్వాడీ కేంద్రాన్ని మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ పద్మాబాయ్ సందర్శించారు. దవాఖానలోని వైద్య సదుపాయాలను పరిశీలించి, ప్రజలు వీటిని వినియోగించుకోవాలని కోరారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారం, కేంద్రం నిర్వహణ తీరును తనిఖీ చేశారు.

February 25, 2026 / 06:23 AM IST

డీసీసీబీ అభివృద్ధి ప్రణాళిక లక్ష్యాలను సాధించాలి: కలెక్టర్

MBNR: డీసీసీబీ అభివృద్ధి ప్రణాళిక లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. మంగళవారం డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వయం సహాయక సంఘాలను అనుసంధానం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఎక్సిక్యూటివ్ ఆఫీసర్ రమాకాంత్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

February 25, 2026 / 06:22 AM IST

ఇంటర్, పదో తరగతి పరీక్షలు.. టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు

KMR: కామారెడ్డి జిల్లాలో ఇంటర్, పదో తరగతి పరీక్షలను పకడ్బందీ ఏర్పట్లు చేసినట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. మంగళవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలకు సంబంధించి ఏమైనా సందేహాలు, సలహాలు కు 9866143782, 9948164514 నంబర్కు కాల్ చేయాలన్నారు.

February 25, 2026 / 06:22 AM IST

తిరుపతిలో బాలిక అదృశ్యం

TPT: తిరుపతిలోని ఆటోనగర్‌కు చెందిన అశాలత (19), ఆమె మేనవరాలు దుర్గా (2) అదృశ్యమైనట్లు ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 19న ఉదయం ఇంటి నుంచి వెళ్లిన వీరిద్దరూ తిరిగి రాలేదని తల్లి నాగరత్నం ఫిర్యాదు చేశారు. బంధుమిత్రుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. బాధితురాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

February 25, 2026 / 06:21 AM IST

దివ్యాంగులకు ల్యాప్టాప్ల పంపిణీ చేసిన MLA, కలెక్టర్

HNK: జిల్లాలోని ఐదుగురు దివ్యాంగులకు WGL పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మంగళవారం ల్యాప్టాప్లను పంపిణీ చేశారు. జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సాంకేతికత దివ్యాంగుల సాధికారతకు ఎంతో తోడ్పడుతుందని తెలిపారు.

February 25, 2026 / 06:21 AM IST

‘జిల్లాలో కొబ్బరి ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలి’

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మెగా కొబ్బరి ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని MLA ఆనందరావు మంగళవారం శాసనసభలో కోరారు. జిల్లాలో క్వాయర్ ఇండస్ట్రీ లేకపోవడాన్ని ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ప్రస్తావించారు. ‘వన్ ఫ్యామిలీ -వన్ ఎంట్రప్రెన్యూర్’ లక్ష్యంగా అడుగులు వేయాలని, ఉపాధి అవకాశాల కోసం మెగా పరిశ్రమలు తక్షణమే నెలకొల్పాలన్నారు.

February 25, 2026 / 06:20 AM IST