• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

బళ్లారి చౌరస్తా బైపాస్ పనుల పరిశీలన

కర్నూలు బళ్లారి చౌరస్తా బైపాస్‌లో జరుగుతున్న పనులను నగరపాలక సంస్థ కమిషనర్ పీ. విశ్వనాథ్ మంగళవారం పరిశీలించారు. రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ బస్సుల రాకపోకలకు ఆటంకంగా ఉన్న మలుపు వద్ద రెండు షాపులను తొలగిస్తామని, పోలీస్ అనుమతి రాగానే పనులు పూర్తి చేసి ట్రాఫిక్ సమస్యలు తీరుస్తామని కమిషనర్ తెలిపారు.

February 25, 2026 / 07:00 AM IST

కొలతల్లో తేడా వస్తే చర్యలు తప్పవు: కమిషనర్

E.G: రాజమండ్రిలోని ప్రతి నిర్మాణానికి ఆస్తి పన్ను విధించాలని కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. మంగళవారం రెవెన్యూ అధికారులతో కలిసి ప్రసాద్ ఆదిత్య మాల్, మెక్ డొనాల్డ్స్, ప్రకాశ్ నగర్ భవనాలను తనిఖీ చేశారు. నిర్మాణ విస్తీర్ణానికి అనుగుణంగా పన్ను వసూలు జరుగుతోందా లేదా అన్నది కొలతలు వేసి తనిఖీ చేశారు. పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం చేయవద్దని అధికారులను ఆదేశించారు.

February 25, 2026 / 07:00 AM IST

రూ.18 వేల వేతనంతో ఉద్యోగాలు

ATP: దక్షిణ మధ్య రైల్వే గుంతకల్లు డివిజన్‌లో ఖాళీగా ఉన్న 16 పాయింట్స్‌మెన్ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఎండీ రజాక్ తెలిపారు. అర్హులైన మాజీ సైనికులు వచ్చే నెల 6లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన వారికి నెలకు రూ.18 వేల వేతనంతో పాటు ఇతర భత్యాలు చెల్లిస్తామని పేర్కొన్నారు.

February 25, 2026 / 07:00 AM IST

మార్చి 10 వరకు పది విద్యార్థులకు అల్పాహారం

MDCL: మేడ్చల్- మల్కాజ్‌గిరి జిల్లా వ్యాప్తంగా 108 ప్రభుత్వ పాఠశాలల్లో మార్చి 10వ తేదీ వరకు అల్పాహార కార్యక్రమం కొనసాగుతుందని జిల్లా DEO విజయకుమారీ తెలిపారు. ప్రతి విద్యార్థిపై రోజుకు రూ.15 చొప్పున వెచ్చించి పోషకాహారం అందిస్తున్నారు. 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ఇది శక్తినిస్తూ, ఆరోగ్యాన్ని కాపాడుతుందన్నారు.

February 25, 2026 / 07:00 AM IST

మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్

W.G: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం భీమవరం కలెక్టరేట్ నుంచి మెడికల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని విభాగాల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినా, రోగుల పట్ల అలసత్వం ప్రదర్శించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

February 25, 2026 / 07:00 AM IST

బ్రహ్మోత్సవాల్లో వేడుక.. రాత్రికి తిరుకల్యాణం

TG: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో అత్యంత కీలక ఘట్టమైన స్వామివారి తిరుకల్యాణోత్సవం ఈ రాత్రి కన్నుల పండుగగా జరగనుంది. అంతకుముందు ఉదయం స్వామివారు జగన్మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ వేడుకను వీక్షించేందుకు భారీగా భక్తులు తరలిరావడంతో కొండపై ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.

February 25, 2026 / 07:00 AM IST

మానసిక ఉల్లాసానికి క్రీడలు తోడ్పడతాయి

NTR: విజయవాడలో నిర్వహించిన ఏపీ లెజిస్లేచర్స్ స్పోర్ట్స్ మీట్‌లో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనమండలి స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. నిత్యం ప్రజల మధ్య ఉండే ప్రజాప్రతినిధులకు, క్రీడలు ఒక ఆటవిడవుగా ఉంటూ మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయని తెలిపారు.

February 25, 2026 / 07:00 AM IST

చిన్నారి మృతిపై చర్చ.. నేడు KTR పరామర్శ

TG: మాజీమంత్రి కేటీఆర్ ఇవాళ నాగర్‌కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల కుమ్మెర జాతరలో రెండేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో మరణించిన చిన్నారి కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించనున్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఇప్పటికే విమర్శలు వస్తున్న తరుణంలో, కేటీఆర్ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

February 25, 2026 / 06:56 AM IST

విజయ్, రష్మిక పెళ్లి.. అతిథులు వీరే!

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి వేడుకలు ఉదయ్‌పూర్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ వివాహం జరుగనుంది. ఈ పెళ్లికి సినీ ఇండస్ట్రీ నుంచి తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా, రాహుల్ రవీంద్రన్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. రేపు జరగనున్న వివాహ కార్యక్రమంలో కేవలం 100 మంది గెస్ట్‌లు మాత్రమే హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

February 25, 2026 / 06:52 AM IST

పాఠశాలకు సీసీ కెమెరాలు విరాళం

MBNR: జమిస్తాపూర్ ప్రాథమిక పాఠశాల భద్రత కోసం 4వ వార్డు మెంబర్ శ్రీనివాసులు సొంత ఖర్చుతో సీసీ కెమెరాలను మంగళవారం ఏర్పాటు చేశారు. తాను చదువుకున్న బడి పై కృతజ్ఞతతో, గతంలో జరిగిన కొన్ని అవాంఛనీయ సంఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. పాఠశాల భద్రత కొరకు తీసుకున్న చర్యలను ఉపాధ్యాయులు విద్యార్థులు అభినందించారు.

February 25, 2026 / 06:52 AM IST

అథ్లెటిక్స్ పోటీల్లో 3వ స్థానం సాధించిన సునంద

కృష్ణా: మచిలీపట్నానికి చెందిన సీహెచ్. సునంద ఇటీవల మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌లో జరిగిన 45వ జాతీయస్థాయి అథ్లెటిక్ పోటీలలో పాల్గొని, 3వ స్థానం దక్కించుకున్నారు. ఈ సందర్భంగా గాంధీ నగర్‌లో గల ఉదయపు నడక మిత్రమండలి భవనంలో జిల్లా కలెక్టర్ క్రీడాకారిణి సునందను అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని బుధవారం ఆకాంక్షించారు.

February 25, 2026 / 06:52 AM IST

అధికారులతో సమీక్ష నిర్వహించిన: కలెక్టర్

WGL: గీసుకొండ(M) కేంద్రంలోని కొమ్మల గ్రామంలో నిర్వహించనున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మెరుగైన వసతులు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు.

February 25, 2026 / 06:51 AM IST

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత..!

NLG: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యంను మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని గుర్తు తెలియని వ్యక్తి సుమారు 8 క్వింటాల రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుండగా.. పట్టణంలోని కబరాస్తాన వద్ద పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.

February 25, 2026 / 06:49 AM IST

జనగణన – 2027 శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన జేసీ

సత్యసాయి: బీడుపల్లిలోని సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాలలో జనగణన – 2027పై మూడు రోజుల రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఈ శిబిరాన్ని ప్రారంభించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు జరిగే ఈ శిక్షణలో ఆర్డీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.

February 25, 2026 / 06:48 AM IST

నేడు ” విక్షిత్ భారత్ యూత్ పార్లమెంట్” పోటీలు

MBNR: భారత ప్రభుత్వం యువజన సర్వీసులు క్రీడల మంత్రిత్వ శాఖ (మై భారత్), పీయూ సంయుక్తంగా “విక్షిత్ భారత్ యూత్ పార్లమెంట్” పోటీలు బుధవారం పీయూలోని లైబ్రరీ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు యువజన అధికారి కోట నాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. ముఖ్య అతిథిగా వీసీ జీఎన్.శ్రీనివాస్ హాజరవుతున్నారని, అన్ని కళాశాలల విద్యార్థులు పాల్గొనాలని తెలిపారు.

February 25, 2026 / 06:46 AM IST