• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పెళ్లిపై విజయ్-రష్మిక ప్రకటన

తాము పెళ్లి చేసుకుంటున్నట్లు విజయ్ దేవరకొండ-రష్మిక మంధాన స్వయంగా ప్రకటించారు. అభిమానులను ఉద్దేశించి ఒకే తరహా నోట్‌ను ఇన్‌స్టా స్టోరీగా పోస్ట్ చేశారు. ‘ప్లాన్ చేయడానికి ముందే మీరు ప్రేమతో మాకు VIROSH అని పేరు పెట్టారు. మీ అభిమానానికి గుర్తుగా మా వేడుకను THE WEDDING OF VIROSH పేరిట నిర్వహించాలని అనుకుంటున్నాం. మీ ప్రేమకు ధన్యవాదాలు’ అని రాసుకొచ్చారు.

February 22, 2026 / 11:00 PM IST

అర్ష్‌దీప్ రికార్డ్‌కు వరుణ్ బ్రేక్

భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. అత్యధికంగా 18* వరుస T20ల్లో కనీసం ఓ వికెట్ పడగొట్టిన భారత ఆటగాడిగా అవతరించాడు. గతంలో ఈ రికార్డ్ అర్ష్‌దీప్(2024-25 మధ్యకాలంలో 17 T20లు) పేరిట ఉండేది. ఆశిష్ నెహ్రా(2016లో 13), వాషింగ్టన్ సుందర్(2024-25లో 11) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

February 22, 2026 / 10:59 PM IST

ఎన్నికల వరకే రాజకీయాలు: మంత్రి పొంగులేటి

TG: ప్రజలు నమ్మి ఓటేశారని, కుర్చీలకే పరిమితం కాకుండా బాధ్యతాయుతంగా పనిచేయాలని ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు సూచించారు. ఎన్నికల వరకే రాజకీయాలు పరిమితమని.. ఆ తర్వాత ఏ పార్టీ వారైనా ప్రజా ప్రభుత్వం తరఫున పేదవాళ్లకు సేవ చేయాల్సిందేనని స్పష్టంచేశారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కృషి చేయాలని పేర్కొన్నారు.

February 22, 2026 / 10:48 PM IST

BREAKING: భారత్‌కు తొలి ఓటమి

సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచు‌లో భారత్ ఘోరంగా ఓడింది. 188 పరుగుల లక్ష్యఛేదనలో దూబే(42) మినహా ఎవరూ ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీంతో 111 పరుగులకే పరిమితమై 76 రన్స్ తేడాతో ఓటమిపాలైంది. ప్రత్యర్థి బౌలర్లలో యాన్సెన్ 4, మహారాజ్ 3, బాష్ 2 వికెట్లు పడగొట్టారు. కాగా గత టోర్నీ మొదలు చివరి 14 T20 WC మ్యాచుల్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్‌కు ఇదే తొలి ఓటమి.

February 22, 2026 / 10:36 PM IST

షూటింగ్‌కి గన్‌తో వెళ్లిన జగపతి బాబు.. ఎందుకంటే?

‘జై బోలో తెలంగాణ’ మూవీ షూటింగ్ విశేషాలను జగపతి బాబు తాజాగా పంచుకున్నారు. ఉద్యమ సమయంలో వరంగల్‌లో షూటింగ్ ఉద్రిక్తంగా ఉండటంతో, తండ్రి వద్దన్నా మొండిగా వెళ్లానని చెప్పారు. రక్షణ కోసం తన వద్ద గన్ ఉంచుకున్నట్లు వెల్లడించి షాక్ ఇచ్చారు. ఆ సినిమా చేసినందుకు ఆంధ్రాలో కొందరు బాధపడినా, వరంగల్ ప్రజలు తనను ఎంతో గౌరవంగా చూసుకున్నారని ఆయన గుర్తు చేసుకున్నారు.

February 22, 2026 / 10:27 PM IST

IND vs SA: ఓటమి అంచున భారత్

T20 WC: సౌతాఫ్రికాతో జరుగుతున్న సూపర్-8 మ్యాచ్‌లో భారత్ ఓటమి అంచున నిలిచింది. ప్రొటీస్ విసిరిన 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగగా.. తొలి నుంచి బ్యాటర్లు తడబడ్డారు. ఈ క్రమంలో మహారాజ్ వేసిన 15 ఓవర్‌లో హార్దిక్(18), రింకూ(0), ఆర్ష్‌దీప్(10) వెంటవెంటనే వెనుదిరిగారు. 16 ఓవర్ల ఆట ముగిసే సరికి స్కోర్ 88/8 కాగా దూబే(19), వరుణ్(0) క్రీజులో ఉన్నారు.

February 22, 2026 / 10:16 PM IST

కుమ్మెర జాతర.. NHRCకి ఫిర్యాదు

TG: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన నాగర్‌కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో చోటుచేసుకున్న ఘటనపై ఓ సామాజిక కార్యకర్త జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. బాధితులకు న్యాయం చేయాలని మర్రిగూడ మండలం కమ్మగూడెం గ్రామానికి చెందిన వినోద్ హిందుస్థానీ ఫిర్యాదులో పేర్కొన్నారు. నిర్వాహకుల కుల దురహంకారం వల్లే జాతరలో ఈ విషాదం చోటు చేసుకుందని ఆయన ఆరోపించారు.

February 22, 2026 / 10:10 PM IST

మహిళలకు నారీ శక్తిపై అవగాహన

SKLM: పలాస మండలం మహాదేవిపురంలో ఆదివారం ఎస్సై నరసింహమూర్తి ఆధ్వర్యంలో నారీ శక్తి యాప్‌పై స్థానిక మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతి మహిళ తమ సెల్‌ఫోన్‌లో నారి శక్తి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన తెలిపారు. సైబర్ క్రైమ్, మైనర్ బాలికల వివాహాలపై కలిగే అనర్ధాలు గూర్చి వివరించారు.

February 22, 2026 / 10:01 PM IST

‘మార్పును అందిపుచ్చుకోవాలి..లేకుంటే మనుగడ లేదు’

AP: ఎంత కష్టపడితే అంత సంపాదించుకునే అవకాశం జీడీఎస్‌లో ఉందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. మార్పును అందిపుచ్చుకోలేని ఏ సంస్థా మనుగడ సాధించలేదన్నారు. పార్సిల్, ఈ కామర్స్ విభాగంలో తపాలాశాఖ పోటీపడాలని ఆకాంక్షించారు.

February 22, 2026 / 09:47 PM IST

ప్రతిష్టాత్మిక అవార్డు అందుకున్న మూసాపేట్ వాసి

HYD: కూకట్‌పల్లి మూసాపేట్ డివిజన్‌కు చెందిన కర్కనాగరాజుకు అత్యంత ప్రతిష్టాత్మికమైన వరల్డ్ అచివర్స్ అవార్డ్స్ 2026కు ఇటీవలే ఎంపికయారు. ఆదివారం న్యూఢిల్లీ జనక్ పూరి హోటల్ హయత్ సెంట్రిక్‌లో జరిగిన కార్యక్రమంలో భారత మాజీ క్రికెట్ ప్లేయర్ చేతన్ శర్మ చేతుల మీదుగా అవార్డ్‌ను అందుకున్నారు. సోషల్ సర్వీస్, ట్రేడ్ యూనియన్ లీడర్షిప్ కేటగియరీలో ఆయన ఎంపికయ్యారు.

February 22, 2026 / 09:43 PM IST

జనసేనలో పలువురి చేరిక

MDCL: కీసర(మం) దమ్మాయిగూడ డివిజన్ పరిధిలోని బండ్లగూడ ప్రాంతానికి చెందిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తల్లూరి ఆధ్వర్యంలో ఆదివారం సాంబశివరెడ్డితో పాటు ఆయన అనుచరులు, పలువురు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ కండువా కప్పి ఘనస్వాగతం పలికారు. జనసేన సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యువత ముందుకు రావాలన్నారు.

February 22, 2026 / 09:42 PM IST

దారుణం..యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు

కాశినాయన మండలం గంగనపల్లెకు చెందిన దిలీప్(24) అనే వ్యక్తిపై దుండగులు ఆదివారం పెట్రోల్ పోసి నిప్పంటించారు.గాయపడిన యువకుడిని స్థానికులు పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని విచారిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 22, 2026 / 09:41 PM IST

ఇఫ్తార్ విందులో పాల్గొన్న MLA గాంధీ

RR: యూత్ కాలనీలో నిర్వహించిన ‘దవాత్-ఏ-ఇఫ్తార్’ కార్యక్రమంలో పీఏసీ ఛైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి విందు ఆరగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ క్రమశిక్షణకు, మత సామరస్యానికి ప్రతీక అని, తెలంగాణలో “గంగా జమునా తెహజీబ్” సంస్కృతిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

February 22, 2026 / 09:39 PM IST

హుజూర్‌నగర్ 21వ వార్డులో క్షేత్రస్థాయి పరిశీలన

NLG: హుజూర్‌నగర్ మున్సిపాలిటీ 21వ వార్డులో చైర్మన్, వైస్ చైర్మన్, కమిషనర్ ఆధ్వర్యంలో అధికారులు క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. డ్రైనేజ్, వీధి దీపాలు, శానిటేషన్, వాటర్ సప్లై సమస్యలను పరిశీలించి ప్రజల అభ్యర్థనలు నమోదు చేశారు. అభివృద్ధి పనులు చేపడతామని, మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తామని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

February 22, 2026 / 09:38 PM IST

ప్రతిభను వెలికి తీయడానికే టాలెంట్టెస్ట్

BHNG: ఆలేరులో SFI మండల కమిటీ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా SFI జిల్లా కార్యదర్శి రాజు మాట్లాడుతూ.. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకే ఈ పోటీలని తెలిపారు. పదో తరగతి విద్యార్థులు మానసిక ఒత్తిడి లేకుండా వార్షిక పరీక్షలు రాయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో UTF నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

February 22, 2026 / 09:32 PM IST