ELR: ఉపాధి కూలీలు తప్పనిసరిగా ఈ కేవైసీ నమోదు చేసుకోవాలని గణపవరం MPDO సత్యనారాయణ అన్నారు. గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. నకిలీ హాజరును అరికట్టడానికి, నిజమైన కూలీలకు పారదర్శకంగా వేతనాలు అందించడానికి ముఖ గుర్తింపు నమోదు చేసు కోవాలన్నారు. పని ప్రదేశంలో ఉదయం, మధ్యాహ్నం ఫేస్ అథెంటికేషన్ (ఫొటో) అవసరం అన్నారు.
JGL: మెట్‌పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ గురువారం పరిశీలించారు. ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించి, లబ్ధిదారులతో మాట్లాడారు. ఇటుకలు, ఇసుక, సిమెంట్ ధరలు, నాణ్యత వివరాలను తెలుసుకుని, నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనులు చేయాలని సూచించారు.
E.G: సీఎం చంద్రబాబు జిల్లాల పనితీరును నేరుగా పర్యవేక్షిస్తున్నారని కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. అధికారులు మరింత బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో పనిచేయాలని ఆదేశించారు. పౌర సేవలు, సంక్షేమ పథకాల అమలు, ఫిర్యాదుల పరిష్కారంపై క్రమం తప్పకుండా విశ్లేషణ జరుగుతోందన్నారు. ఒక టీంగా పనిచేసి ప్రజలకు మెరుగైన ఫలితాలు అందించాలని యంత్రాంగాన్ని కోరారు.
కర్నూలు: గడపగడపకు సీపీఐ విరాళాల సేకరణ కార్యక్రమం రెండో రోజు కొనసాగింది. మూడు బృందాలుగా విడిపోయిన నాయకులు, కార్యకర్తలు ప్రజలను కలుసుకుని విరాళాలు సేకరించారు. నగర కార్యదర్శి పి. రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నగరాల్లో ఇంటి స్థలం లేని ప్రతి పేద కుటుంబానికి 2 సెంట్ల స్థలం ఇచ్చి, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
CTR: జిల్లా సమగ్ర అభివృద్ధిలో బ్యాంకుల పాత్ర కీలకమని, ఆ దిశగా బ్యాంకర్లు పనిచేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లో డీసీసీ, డీఎల్ఆర్‌సీ లీడ్ బ్యాంక్ వారితో సమావేశం నిర్వహించారు. ప్రాథమిక రంగమైన వ్యవసాయ రంగంలో రైతులకు పంట పెట్టుబడిగా అవసరమైన పంట రుణాల మంజూరులో సహకరించాలన్నారు.
టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు ఫీల్డింగ్‌పై బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘నిజాయితీగా చెప్పాలంటే.. కొన్నిసార్లు మేం ఫీల్డింగ్‌లో అనవసరంగా 15-20 పరుగులు ప్రత్యర్థి జట్టుకు ఇస్తున్నాం. ఇది మేం ఒప్పుకోవాల్సిన విషయం. అందుకే ఈ విభాగంపై నిరంతరం కష్టపడుతున్నాం. ఫీల్డింగ్‌లో ఆటగాళ్లు మరింత మెరుగ్గా రాణించాలని కోరుతున్నాం’ అని పేర్కొన్నాడు.
MNCL: శ్రీరాంపూర్ ఏరియా RK-న్యూటెక్ సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని CITU ఆధ్వర్యంలో గనిలోని కార్మికుల సంతకాల సేకరణ చేపట్టారు. గురువారం గని మేనేజర్ శ్రీనివాస్ కు వినతిపత్రం అందజేశారు. నాయకులు మాట్లాడుతూ.. కోల్ కట్టర్స్, సపోర్ట్ మేన్‌లకు నాణ్యమైన బిట్లు ఇవ్వాలన్నారు. షార్ట్ ఫైరర్‌కు రెగ్యులేషన్ ప్రకారం కేబుల్ అందించాలన్నారు.
KMM: అమెరికా సామ్రాజ్యవాద కాంక్షతో వివిధ దేశాలపై దాడులు కొనసాగించడం తప్పుడు చర్య అని CPM జిల్లా నాయకులు నున్న నాగేశ్వరరావు అన్నారు. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ దాడులకు నిరసనగా గురువారం ఖమ్మంలో సీపీఎం ఆధ్వర్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వందలాది మంది ప్రజలను హత్య చేయడం వంటి దుర్మార్గపు చర్యలను ఆపాలని పేర్కొన్నారు.
పెద్దపల్లి జిల్లాలో ఇవాళ జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం గణితం, జంతు శాస్త్రం, చరిత్ర పరీక్షలకు 96% మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కల్పన తెలిపారు. 4306 మంది హాజరు కావలసి ఉండగా, 4176 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. 130 మంది గైర్హాజరు కావడం జరిగిందన్నారు. పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు తెలిపారు.
NLG: 99 రోజుల ప్రజా పాలన ప్రగతి-ప్రణాళిక కార్యాచరణపై చిట్యాల మున్సిపల్ ఆఫీస్‌లో ఛైర్ పర్సన్ పందిరి గీత అధ్యక్షతన గురువారం సమీక్ష నిర్వహించారు. వార్డుల్లో పారిశుధ్యం, నీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణను మెరుగుపరచాలని, పెండింగ్ ఫైళ్లను క్లియర్ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం శుక్రవారం ఉ. 7:30లకు 12వ వార్డులో ప్రారంభమవుతుందని కమిషనర్ శ్రీను తెలిపారు.
KMR: బిక్కనూర్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకం దేశానికే ఆదర్శమని, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ బద్దం ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. గురువారం మండలంలోని ఇసన్నపల్లి గ్రామంలో ఇందిరమ్మ పథకం కింద నిర్మించిన ఇంటి నిర్మాణాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేకల రాములు ఉన్నారు.
నెల్లూరు: రాష్ట్ర బడ్జెట్‌లో మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా కోసం కూటమి ప్రభుత్వం రూ. 14 వేల 539 కోట్లు కేటాయించి పట్టణాభివృద్ధికి బాటలు వేసిందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు.
కృష్ణా: వీరవిల్లిలో ఓ విద్యార్థి ఉపాధ్యాయుడిపై దాడి చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఘటనపై DEO సుబ్బారావు స్పందించారు. గురువారం పాఠశాలను సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడారు. పిల్లల్లో క్రమశిక్షణ లోపమని ఈ ఘటన స్పష్టంగా తెలియజేస్తుందని చెప్పారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి విద్యార్థి భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని విచారణ చేయనున్నట్లు చెప్పారు.
TPT: YSRCP విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి గురువారం రామచంద్రాపురం మండలంలో పర్యటించారు. నెత్తకుప్పంలో మండల వైస్ ఎంపీపీ లావణ్య చంద్రబాబుల కుమార్తె దివ్య వివాహ నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరైయ్యరు. అనారోగ్యంతో ఉన్న రూపసుందర్‌ను పరామర్శించడంతో పాటు, ఇటీవల మృతిచెందిన పార్టీ నాయకుడు మధుసూదన్‌రావు కుటుంబ సభ్యులను ఓదార్చారు.
T20 WCలో గత 4 ఎడిషన్లుగా రెండో సెమీఫైనల్ గెలిచిన జట్టే ఛాంపియన్‌గా నిలుస్తూ వస్తోంది. 2016లో WI, 2021లో AUS, 2022లో ENG, 2024లో భారత్.. ఇలా రెండో సెమీఫైనల్లో విజేతలుగా నిలిచిన జట్లే ఫైనల్లోనూ గెలిచి ట్రోఫీని ముద్దాడాయి. ప్రస్తుతం T20 WCలో IND-ENG మధ్య రెండో సెమీస్ జరుగుతోంది. ఈ రికార్డులను బట్టి చూస్తే, ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టే ప్రపంచ విజేతగా నిలిచే అవకాశం ఉంది.