• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘తేనెటీగల పెంపకంపై శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియొగం చేసుకోండి’

KRNL: బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో ఆచార్య ఎన్డీరంగా విశ్వవిద్యాలయం, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి సమన్వయంతో జాతీయ తేనెటీగల మండలి ఆధ్వర్యంలో శాస్త్రీయ తేనేటీగల పెంపకంపై 7 రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కేవీకే సమన్వయకర్త డాక్టర్ కె. రాఘవేంద్రచౌదరి తెలిపారు. ఈనెల 25 నుంచి మార్చి 3వ తేదీ వరకు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయన్నారు.

February 23, 2026 / 07:39 AM IST

ఆధార్ లేక చదువుకు దూరమవుతున్న చిన్నారులు

ASR: జీకే వీధి మండలం పేట్రాయి గ్రామంలో ఐదు గిరిజన కుటుంబాలకు చెందిన 7 గురు పిల్లలకు నేటికి ఆధార్ కార్డులు లేవు. పాఠశాలల్లో ప్రవేశానికి ఆధార్ తప్పనిసరి కావడంతో వీరికి చదువు దూరమవుతోంది. గిరిజన బిడ్డల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణమే స్పందించి వారికి ఆధార్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

February 23, 2026 / 07:38 AM IST

ఏక్ మామిడిలో వీధిలైట్లు లేక ప్రజల ఇబ్బంది

VKB: ఏక మామిడిలో వీధిలైట్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. సాయంత్రం అయిందంటే ఇంట్లో నుంచి బయటకు రావాలంటే లైట్లు లేక అపరిచితులును గుర్తించలేకపోతున్నామని వాపోయారు. వేసని సమీపిస్తున్న వేళ విష సర్పాల సంచారం పెరిగిందని, వాటి నుంచి రక్షించుకోవాలంటే వీధి లైట్లు ఉండాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.

February 23, 2026 / 07:38 AM IST

నల్లమలలో మళ్లీ వజ్రాల వేట

NDL: నంద్యాల-గిద్దలూరు నల్లమల అటవీ ప్రాంతంలో ప్రజలు వజ్రాల కోసం అన్వేషణను పునఃప్రారంభించారు. సర్వ నరసింహ స్వామి ఆలయం సమీపంలోని వాగు, వజ్రాల వంక వద్ద రాయలసీమతో పాటు ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఆశావహులు ఉదయం నుంచి సాయంత్రం వరకు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ అన్వేషణతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది.

February 23, 2026 / 07:35 AM IST

నేడు సంతు సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు

MBNR: నవాబ్ పేట మండల కేంద్రంలోని మార్కెట్ సమీపంలో సంతు సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు తులసీరామ్ తెలిపారు. మండల పరిధిలోని ఎస్టీ సామాజిక సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం పిలుపునిచ్చారు. ఉత్సవానికి ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవుతారని పేర్కొన్నారు.

February 23, 2026 / 07:35 AM IST

‘నేడు మదనపల్లిలో PGRS అర్జీల స్వీకరణ’

అన్నమయ్య: మదనపల్లె కలెక్టరేట్లో సోమవారం PGRS ద్వారా అర్జీలను స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తమ సమస్యలను కలెక్టరేట్లోని PGRS ద్వారా అందజేయవచ్చునని చెప్పారు.

February 23, 2026 / 07:35 AM IST

బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి : జాజుల

NGKL: కుమ్మెర మల్లన్న జాతరలో అగ్రకుల వారు జరిపిన దాడిలో మరణించిన చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని డీఎస్పీ కార్యాలయం ఎదుట ఆదివారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. నిందితులను అరెస్ట్ చేయాలని, బాధిత కుటుంబానికి రక్షణ కల్పించి, నష్టపరిహారం ఇవ్వాలన్నారు. బాధితులపై FIR నమోదు చేయడం దుర్మార్గమని ఆగ్రహించారు.

February 23, 2026 / 07:33 AM IST

ఘోర రోడ్డు ప్రమాదం.. వాగులో పడిపోయిన బస్సు

ADB: ఉట్నూర్ మండలంలో సోమవారం ఉదయం షాంపూర్ వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వాగులో పడింది. ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులను స్థానికులు వెంటనే రక్షించి 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ అజాగ్రత్తా లేదా సాంకేతిక లోపమా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ​ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

February 23, 2026 / 07:33 AM IST

మణిపురి సినిమాకు అరుదైన గౌరవం

అంతర్జాతీయ వేదికగా మణిపురీ సినిమా ‘బూంగ్’కు బాఫ్టా అవార్డు దక్కింది. బెస్ట్ చిల్డ్రన్స్- ఫ్యామిలీ ఫిల్మ్ కేటగిరీలో పురస్కారం లభించింది. ఇది ఈశాన్య భారత సినిమాకు దక్కిన అరుదైన గౌరవం. బూంగ్ చిత్రానికి లక్ష్మీప్రియా దేవి దర్శకత్వం వహించారు. మణిపూర్‌లోని సరిహద్దు పట్టణం మోరె నుంచి తన తండ్రిని వెతుక్కుంటూ మయన్మార్‌లోకి బాలుడు వెళ్లే కథతో తెరకెక్కింది.

February 23, 2026 / 07:32 AM IST

లింగమంతుల గుట్ట జాతరకు సర్వం సిద్ధం

NLG: ప్రతి రెండేళ్లకోసారి వైభవంగా జరిగే నిడమనూరు (M) ఎర్రబెల్లి లింగమంతుల జాతరకు గుట్ట ముస్తాబైంది. అభివృద్ధి పనులు పూర్తికావడంతో లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వస్తారని ఆలయ ఛైర్మన్ వెంకన్న, సర్పంచ్ మధు తెలిపారు.

February 23, 2026 / 07:32 AM IST

ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు

TG: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 15 శాతం ఓట్ల కోసం ఎంఐఎంకు ఎందుకు మద్ధతిస్తున్నారని మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి డేంజర్ సీఎం అని ఆరోపించారు. శ్రీధర్‌బాబు పేరును శ్రీధర్‌బాబాగా మార్చుకోవాలని హితవు పలికారు. అదేవిధంగా భట్టి పేరును భట్టి అక్రమ్‌గా మార్చుకోవాలని సూచించారు.

February 23, 2026 / 07:32 AM IST

మాజీ మంత్రి జోగి రమేష్‌ని కలిసిన మాజీ శాసనసభాపతి

NTR: ఇబ్రహీంపట్నంలో టీడీపీ శ్రేణులు పెట్రోల్ బాంబులతో దాడి చేసిన మాజీ మంత్రి జోగి రమేష్ నివాసాన్ని మాజీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ ఘటన గురించి వివరాలు తెలుసుకుని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

February 23, 2026 / 07:31 AM IST

దళిత్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షుడిగా రాజయ్య

PDPL: ఆల్ ఇండియా దళిత్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షుడిగా ముత్తారం మండలం సర్వారం గ్రామానికి చెందిన గౌరిశెట్టి రాజయ్య నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షులు రత్నం శైలేందర్ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. తన నియామకానికి సహకరించిన జాతీయ అధ్యక్షులు డా.చిన్న రాముకు కృతజ్ఞతలు తెలిపారు. రిజర్వేషన్లు అందని వెనుకబడిన వర్గాల కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

February 23, 2026 / 07:30 AM IST

దోషులను కఠినంగా శిక్షించాలి: మంద నరేష్

WGL: నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో కులం పేరుతో రజక కుటుంబంపై జరిగిన దారుణ దాడిని ABSF జిల్లా అధ్యక్షుడు మంద నరేష్ ఖండించారు. ఆదివారం రాత్రి WGLలోని కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద ABSF ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన చేపట్టారు. రెండు నెలల పసికందును కాళ్లతో తన్ని హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

February 23, 2026 / 07:29 AM IST

సీసీఐ పత్తి కొనుగోళ్లకు గడువు పొడగింపు

ADB: ఆదిలాబాద్ జిల్లాలో సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లను ఈ నెల 27 వరకు పొడిగించినట్లు జిల్లా మార్కెటింగ్ అధికారి గజానంద్ తెలిపారు. రైతులు కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుకింగ్ చేసుకుని, సమీపంలోని సీసీఐ కొనుగోలు కేంద్రాలు, జిన్నింగ్ మిల్లుల్లో తమ పత్తిని విక్రయించుకోవాలని సూచించారు. అవకాశాన్ని జిల్లా రైతాంగం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

February 23, 2026 / 07:28 AM IST