• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ధన్వాడ విద్యార్థి రాష్ట్రస్థాయి విజయాలు

NRPT: సమగ్ర శిక్షా తెలంగాణ ఆధ్వర్యంలో దోమలగూడలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ధన్వాడ జడ్పీహెచ్ఎస్ విద్యార్థి ఆంజనేయులు అద్భుత ప్రతిభ చూపించారు. 33 జిల్లాల విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీల్లో సత్తా చాటిన ఆంజనేయును హెచ్ఎం ప్రదీప్ కుమార్, స్పెషల్ ఎడ్యుకేటర్ రాకేశ్ శెట్టి, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

March 3, 2026 / 01:08 PM IST

అత్త వేలు కొరికిన అల్లుడుపై కేసు నమోదు

WGL: సంగెం మండలం మచ్ఛాపూర్ గ్రామంలో మంగళవారం కుటుంబ కలహం నేపథ్యంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బానోత్ వినోద్ కుమార్ అనే వ్యక్తి తన అత్త ఇంటికి వెళ్లి గొడవకు దిగాడు. దీంతో మామ రవి అల్లుడు వినోద్‌ను రాయితో కొట్టి గాయపరిచాడు. అడ్డుపడిన అత్త చేతిని అల్లుడు కొరికాడు. బాధితుల ఫిర్యాదు మేరకు SI వంశీకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

March 3, 2026 / 01:07 PM IST

మహిళా మూర్తులకు స్త్రీ శక్తి పురస్కారాలు

VZM: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన మహిళా మూర్తులకు స్త్రీ శక్తి ఉమెన్ పవర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ పురస్కారాలను అందజేశారు. విశ్వ సాహితీ కళావేదిక విజయవాడలో బాలోత్సవ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన భోగరాజు సూర్యలక్ష్మీ, జ్యోతిష్య, మహాలక్ష్మీ, దాసరి పద్మ స్త్రీ శక్తి పురస్కారాలను అందుకున్నారు.

March 3, 2026 / 01:06 PM IST

వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన

NZB: అడవులు, వన్యప్రాణులు దేశానికి విలువైన జాతీయ సంపదని సిరికొండ రేంజ్ అధికారి కే. నర్సింగ్ రావు పేర్కొన్నారు. సిరికొండ ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అడవులను రక్షించుకోవడం ద్వారానే వన్యప్రాణులను కాపాడుకోగలమని, పర్యావరణ సమతుల్యతకు ఇవి ఎంతో ముఖ్యమని వివరించారు.

March 3, 2026 / 01:06 PM IST

చంద్ర గ్రహణం వేళ భోజనం వద్దు..ఎందుకంటే?

చంద్ర గ్రహణ సమయంలో వెలుతురు తగ్గడం వల్ల వాతావరణంలో మార్పులు వస్తాయి. సహజమైన కాంతి లేకపోవడంతో వండిన ఆహారంలో హానికారక బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెంది, ఆహారం కలుషితమయ్యే అవకాశం ఉంది. అలాగే, కాంతి మార్పుల ప్రభావం మన శరీర జీర్ణక్రియపై పడి, ఆహారం త్వరగా అరగదు. అందుకే ఇన్ఫెక్షన్లు, జీర్ణ సమస్యలు రాకుండా ఉండేందుకు ఆ సమయంలో భోజనానికి దూరంగా ఉండాలని శాస్త్రీయ కోణంలో చెబుతుంటారు.

March 3, 2026 / 01:06 PM IST

బొబ్బిలిలో వృథాగా పోతున్న తాగునీరు

VZM: బొబ్బిలి పట్టణంలోని శ్వేతా షాపింగ్ కాంప్లెక్స్ వద్ద పైపులైన్ లీకుతో తాగునీరు వృథాగా పోతోంది. వేసవి కావడంతో తాగునీరు కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటి కొరతతో 3 రోజులకు ఒకసారి తాగునీరు సరఫరా చేస్తున్నారు. లీకులతో తాగునీరు వృథాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

March 3, 2026 / 01:03 PM IST

‘వృషకర్మ’ గ్లింప్స్‌కు టైం, వేదిక ఫిక్స్

అక్కినేని నాగచైతన్య, దర్శకుడు కార్తీక్‌ దండు కాంబోలో ‘వృషకర్మ’ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్‌కు టైం, వేదిక ఖరారైంది. మార్చి 5న ఉదయం 10 గంటలకు HYDలోని ప్రసాద్ PCX  స్క్రీన్ వేదికగా విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక మీనాక్షి చౌదరి ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

March 3, 2026 / 01:03 PM IST

‘చెరువుల లీజు వెంటనే చెల్లించాలి’

NGKL: జిల్లాలోని మత్స్య సహకార సంఘాల పరిధిలోని చెరువులు, కుంటల లీజు మొత్తాన్ని వెంటనే చెల్లించాలని DFCS ఛైర్మన్ వాకిటి ఆంజనేయులు ఓ ప్రకటనలో కోరారు. 2026-27 సంవత్సరానికి సంబంధించి ఆయా సొసైటీలు సకాలంలో లీజు రకాన్ని చెల్లించి ప్రభుత్వానికి సహకరించాలని ఆయన సూచించారు.

March 3, 2026 / 01:02 PM IST

బోధనలో మూతపడ్డ ప్రముఖ ఆలయాలు

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ప్రముఖ ఆలయాలు శ్రీ చక్రేశ్వర శివ మందిరము, శ్రీ మారుతి మందిరము మంగళ వారం మూతపడ్డాయి చంద్ర గ్రహణం ఉన్నందున ఉదయ పూజలు నిర్వహించి నైవేద్యం పెట్టి హారతి చేసి 7గంటలకు ఆలయాలను మూసివేశారు. ఈ సందర్భంగా ఆలయాల అర్చకులు గణేష్ శర్మ, ప్రవీణ్ శర్మలు మాట్లాడుతూ.. గ్రహణం వీడిన తర్వాత రాత్రి 7:30లకు సంప్రోక్షణ నిర్వహిస్తామన్నారు.

March 3, 2026 / 01:01 PM IST

గ్రహణం వేళ రంగనాథుని ఆలయం మూసివేత

WNP: చంద్రగ్రహణం కారణంగా దక్షిణ కాశీగా పేరొందిన శ్రీరంగనాయక స్వామి ఆలయ ద్వారాలను మంగళవారం మూసివేశారు. గ్రహణం ముగిశాక సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి, ప్రస్తుతం జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలను యథావిధిగా ఘనంగా కొనసాగిస్తామని ఆలయ పూజారులు, అధికారులు వెల్లడించారు.

March 3, 2026 / 01:01 PM IST

గుండెపోటుతో యువ కార్పెంటర్ మృతి

MBNR: మిడ్జిల్ మండలం దోనూర్ గ్రామానికి చెందిన కమ్మరి ప్రసాద్ చారి (28) జడ్చర్లలో కార్పెంటర్ పని చేస్తూ గుండెపోటుతో మృతి చెందాడు. పనిలో ఉండగా అకస్మాత్తుగా కుప్పకూలిన అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు విడిచాడు.హోలీ పండుగ పూట యువకుడి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

March 3, 2026 / 01:01 PM IST

అంగన్వాడి కేంద్రాల్లో హోలీ వేడుకలు

MDK: తూప్రాన్ మండలంలోని అంగన్వాడి కేంద్రాల్లో హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం అంగన్వాడీ టీచర్లు చిన్నారులతో కలిసి హోలీ వేడుకలను నిర్వహించారు. అంగన్వాడి కేంద్రంలోని చిన్నారులు రంగులు పూసుకుని ఆనందాలు పంచుకున్నారు. పట్టణంలోని అంగన్వాడీ కేంద్రం -7లో టీచర్ ఇందిరా ఆధ్వర్యంలో హోలీ వేడుకలు జరుపుకొని రంగులు పూసుకుని ఆనందాలు పంచుకున్నారు.

March 3, 2026 / 01:01 PM IST

రూ.6 లక్షల నిధులతో రోడ్డు మధ్యలో డివైడర్ల పనులు

ATP: గుత్తి సుందరీకరణలో భాగంగా గాంధీ చౌక్ నుంచి రాజీవ్ గాంధీ సర్కిల్ వరకు రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ల ఎత్తును పెంచుతూ నిర్మాణ పనులను చేపట్టారు. కమిషనర్ జబ్బర్ మియా మాట్లాడుతూ.. ఈ నిర్మాణ పనులకు రూ.6 లక్షలు నిధులను కేటాయించమన్నారు. ప్రస్తుతం పనులు శరవేగంగా జరుగుతున్నాయని, పనులు పూర్తయిన వెంటనే డివైడర్ల మధ్యలో మొక్కలను ఏర్పాటు చేస్తామన్నారు.

March 3, 2026 / 01:01 PM IST

టీటీడీ నాయకుని పరామర్శించిన ఎమ్మెల్యే

ప్రకాశం: కనిగిరి మండలం బడుగులేరు గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ సీనియర్ నాయకులు మన్నం సుబ్బయ్యను ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పరామర్శించారు. సుబ్బయ్య ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని కుటుంబ సభ్యులకు సూచించారు. పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

March 3, 2026 / 01:00 PM IST

శెట్టిపల్లిలో శ్రీ రాముల ఆలయ నిర్మాణానికి విరాళం

సత్యసాయి: పెనుకొండ మండలం శెట్టిపల్లిలో శ్రీ రాముల ఆలయ నిర్మాణంలో ఉంది. మంగళవారం దేవాలయ నిర్మాణానికి పెనుకొండ ఎంపీపీ గీతా రామ్మోహన్ రెడ్డి రూ.25,000 విరాళంగా అందజేశారు. గ్రామంలో భక్తుల సహకారంతో కొనసాగుతున్న దేవాలయ నిర్మాణానికి తన వంతు సహాయం అందించడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. దేవాలయం నిర్మాణం త్వరగా పూర్తి కావాలని ఆకాంక్షించారు.

March 3, 2026 / 01:00 PM IST