• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నాలుగు కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు

TPT: వెంకటగిరి పట్టణంలోని 4 కేంద్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు 23వ తేదీ సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలకు అన్ని విధాల చర్యలను విద్యాశాఖాధికారులు తీసుకున్నారు. వెంకటగిరి, బాలాయపల్లి మండలాల్లో మొత్తం జూనియర్ ఇంటర్మీడియట్ కళాశాలలు 6 ఉన్నాయి. వెంకటగిరిలో మూడు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. సుమారు 1300 మంది విద్యార్థులు హాజరవుతారు.

February 22, 2026 / 11:04 AM IST

రహదారి గుంతలమయం.. వాహనదారులకు నరకయాతన

PDPL: రామగుండం కార్పొరేషన్ పరిధి 47వ డివిజన్ మార్కండేయ కాలనీలోని కృష్ణుడి ఆలయం సమీప ప్రధాన రహదారి గుంతలతో దెబ్బతింది. వాహనదారులు తరచుగా వాహన మరమ్మతులతో ఆర్థిక నష్టానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలలుగా మ్యాన్‌హోల్ లీకేజీ కారణంగా మురుగునీరు నిల్వ ఉండటంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

February 22, 2026 / 11:04 AM IST

సీసీ కెమెరాల నిఘాతో ఇంటర్మీడియట్ పరీక్షలు

CTR: పాలసముద్రం ప్రభుత్వ జూ.కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసి సీసీ కెమెరాల నిఘా, 144 సెక్షన్ పెట్టామని ప్రిన్సిపల్ హేమలత తెలిపారు. రేపటి నుంచి 196 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్టు పెర్కొన్నారు. పరీక్షల గదుల్లో గాలి, వెలుతురు, తాగునీరు, మూత్ర శాలల పారిశుద్ద్యం ఏర్పాట్లు చేశామన్నారు.

February 22, 2026 / 11:04 AM IST

పట్టణ అభివృద్ధికి కృషి: MLA కందుల

ప్రకాశం: మార్కాపురం పట్టణంలోని పలు వార్డులలో రూ. 43 లక్షల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని, ప్రజలకు అవసరమయ్యే వనరులు సమకూర్చే దిశగా పనిచేస్తామన్నారు.

February 22, 2026 / 11:03 AM IST

‘గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలి’

KMM: సత్తుపల్లి పట్టణంలో పాకలగూడెం గ్రామ నూతన సర్పంచ్ సునీత TGIDC ఛైర్మన్ మువ్వా విజయబాబును ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో నూతనంగా ఏర్పడిన పాలకవర్గం కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి పనులు ప్రతి ఒక్కరికి చేరవేయాలని సర్పంచ్‌కు సూచించారు. గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలని తెలిపారు.

February 22, 2026 / 11:02 AM IST

టార్గెట్ ఫిక్స్ అయింది .. ఇక పనుల జాతరే..!

NLG: జిల్లా కేంద్రం ‘వీబీ జీ రామ్ జీ’ పథకంలో భాగంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 15 లక్షల కుటుంబాలకు 125 రోజుల పని దినాలు కల్పించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. నల్లగొండ జిల్లాలో 7.44 లక్షల జాబ్ కార్డు ఉండగా ఇందుకోసం రూ.1.16 కోట్ల పని దినాలను అంచనా వేశారు. అవినీతిని అరికట్టేందుకు ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు.

February 22, 2026 / 11:02 AM IST

నూతన పాలకవర్గానికి మంత్రి అభినందనలు

RR: చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆధ్వర్యంలో మొయినాబాద్ మున్సిపాలిటీ నూతన పాలకవర్గం సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిశారు. ఇటీవల మోయినాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో ఎమ్మెల్యే కాలె యాదయ్యకు, నూతన పాలకవర్గానికి మంత్రి అభినందనలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించి మున్సిపాలిటీ అభివృద్ధి దిశగా ముందుకు పోవాలన్నారు.

February 22, 2026 / 11:01 AM IST

బుచ్చిలో హ్యాపీ సండే కార్యక్రమం

NLR: బుచ్చి పట్టణంలోని బెజవాడ గోపాల్ రెడ్డి పార్క్‌లో నగర కమిషర్ బాలకృష్ణ ఆధ్వర్యలో హ్యాపీ సండే కార్యక్రమం జరిగింది. విద్యార్థుల ఆటలు, డాన్స్‌లు వేయగా మెప్మా ఆర్‌పీలు పాటలతో సందడి చేశారు. వారం రోజుల నుంచి పని ఒత్తిడితో జీవిస్తూ ఆదివారం నాడు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల మనసు ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ప్రతి నెలలో ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.

February 22, 2026 / 11:01 AM IST

‘పాత రుసుముల ప్రకారమే ట్రేడ్ లైసెన్స్ ఫీజులు చెల్లించాలి’

E.G: పాత రుసుములు ప్రకారమే ట్రేడ్ లైసెన్స్ ఫీజులు చెల్లించాలని నిడదవోలు పట్టణ ప్రజల సంక్షేమ సంఘం అధ్యక్షులు జువ్వల రాంబాబు వ్యాపారస్తులకు ఆదివారం పిలుపునిచ్చారు. ట్రేడ్ లైసెన్స్ ఫీజులు వెంటనే చెల్లించాలని లేనిపక్షంలో భారీ పెనాల్టీ పడుతుందని సిబ్బంది హెచ్చరిస్తున్నారని తెలిపారు. ఫీజులు తగ్గింపు అధికార పక్షం, ప్రతిపక్షం ఆమోదంతోనే జరిగిందన్నారు.

February 22, 2026 / 11:00 AM IST

రేపు శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవం

ATP: గుత్తికొండలోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రేపు స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుందని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు అంజి ఆదివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రేపు ఉదయం 11:30 గంటలకు శ్రీ భూనీలా సమేత నరసింహ స్వామి కళ్యాణోత్సవం జరుగుతుందన్నారు. పట్టణ ప్రజలు పూజా కార్యక్రమంలో పాల్గొనాలన్నారు.

February 22, 2026 / 11:00 AM IST

మక్తల్ రహదారి ప్రమాదకర పరిస్థితి..!

NRPT: మక్తల్ మండలంలోని జక్లేర్ నుంచి రామసముద్రం వరకు రహదారిలో మలుపుతిరిగే ప్రాంతంలో గుంతలు ఏర్పడడంతో స్థానికులు, వాహనదారులు భయపడుతున్నారు. రాత్రి సమయాల్లో ఘోర ప్రమాదాలు జరిగే అవకాశాన్ని వాపోతున్నారు. అధికారులు వెంటనే రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

February 22, 2026 / 11:00 AM IST

విఘ్నేశ్వరుని నిత్యాన్నదాన పథకానికి విరాళం అందజేత

కోనసీమ: అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో నిర్వహించే నిత్య అన్నదాన పథకానికి అమలాపురం వాస్తవ్యులు ఎంఎన్ సోమనాథ శాస్త్రి కుటుంబ సభ్యులు రూ. లక్ష విరాళాన్ని ఆదివారం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు ముందుగా స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అదేవిధంగా ఆలయ అర్చకులు దాత కుటుంబ సభ్యులకు స్వామి వారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు.

February 22, 2026 / 11:00 AM IST

‘కమ్యూనిటీ హాల్ కోసం స్థలం కేటాయించండి’

SKLM: ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు ని ఆయన కార్యాలయంలో ఆదివారం ఎచ్చెర్ల కి చెందిన శ్రీ సాయి కళింగ వైశ్య సంక్షేమ సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు సంఘం ప్రతినిధులు తమ సమాజ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు కమ్యూనిటీ హాలు కోసం ప్రభుత్వ స్థలం కేటాయించాలని వినతిపత్రం అందజేశారు.

February 22, 2026 / 11:00 AM IST

బసవనపల్లిలో సిమెంట్ రోడ్డు పనుల ప్రారంభం

సత్యసాయి: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆశీస్సులతో మాజీ మున్సిపల్ గ్రీన్ పార్క్ నాగరాజు ఆధ్వర్యంలో లేపాక్షి మండలం కంచిసముద్రం పంచాయతీ బసవనపల్లి గ్రామంలో సిమెంట్ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. బసవనపల్లి నుంచి పెద్ద చెరువు కింద నుంచి కంచిసముద్రం వెళ్లే దారికి పూజలు చేసి పనులు మొదలుపెట్టారు.

February 22, 2026 / 11:00 AM IST

భారీగా పడిపోయిన ధరలు

AP: పార్వతీపురం మన్యం జిల్లాలో టమోటా ధరలు భారీగా పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 28 కిలోల టమోటా కేసును వ్యాపారులు రూ.120 నుంచి రూ.150కే కొనుగోలు చేస్తున్నారు. ఖర్చులతో పోలిస్తే ఈ ధరలు చాలా తక్కువగా ఉండటంతో పెట్టుబడులు కూడా రావడం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాలూరు మండలంలో సుమారు 300 ఎకరాల వరకు టమోటా పంటను సాగు చేస్తున్నారు.

February 22, 2026 / 10:58 AM IST