MDK: రైతులు పంటల సాగులో ఆధునిక పద్ధతులు పాటించాలని మండల వ్యవసాయ అధికారి స్రవంతి సూచించారు. శుక్రవారం మండలంలోని కొనాయిపల్లిలో రైతు తప్పేట సాయిబాబా వెదజల్లే పద్ధతిలో వేసిన వారి నాటును పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. రైతులు విభిన్న పద్ధతులు పాటించడం వల్ల అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉందని అన్నారు.
నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం బండమీదిగూడెంలో నిన్న రాత్రి ఘోరం జరిగింది. గంజాయి మత్తులో ఓ కిరాతక కొడుకు కన్నతండ్రినే కడతేర్చాడు. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బుర్ర సత్తయ్య(60), తన కుమారుడు బాలకృష్ణ (34) మధ్య కుటుంబ విషయాల్లో తగాదా మొదలైంది.ఆగ్రహంతో మత్తులో ఉన్న బాలకృష్ణ తండ్రిని కర్రతో కొట్టడంతో సత్తయ్య మృతి చెందాడు.
SKLM: ప్రజా సమస్యలు పరిష్కారమే కూటమి ప్రభుత్వం లక్ష్యం టీడీపీ జిల్లా అధ్యక్షులు మొదలవలస రమేష్ అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే రవికుమార్ ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు ప్రజల నుంచి పలు సమస్యల పై దరఖాస్తు రూపంలో వినతులు స్వీకరించారు. వినతులను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
HYD: గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న HYDలో ‘పార్కింగ్’ సమస్య ఇప్పుడు సగటు జీవికి శాపంగా మారింది. నిబంధనల ప్రకారం ఉండాల్సిన వసతులు లేవు. ఉన్నచోట అక్రమ వసూళ్లు దడ పుట్టిస్తున్నాయి. అటు అధికారులు, ఇటు ప్రైవేట్ యాజమాన్యాల మధ్య సమన్వయ లోపం సామాన్యుడికి శాపంగా మారుతోంది. ఈ అక్రమాలను అరికట్టేందుకు GHMC స్పెషల్ డ్రైవ్ నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రబృందంతో ముచ్చటించిన ప్రభాస్ ప్రేమపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా నటి మానస వారణాసి ‘ప్రేమపై మీ అభిప్రాయం ఏంటి?’ అని అడగ్గా.. ప్రభాస్ సిగ్గుపడుతూ సమాధానమిచ్చాడు. ‘నాకు కూడా ప్రేమలో పడాలని ఉంది. ఆ అద్భుతమైన ఫీలింగ్‌ను అనుభవించాలని ఆతృతగా ఎదురుచూస్తున్నాను’ అని మనసులో మాట బయటపెట్టాడు. ప్రభాస్ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరలవు...
VSP: కలెక్టర్ ఆఫీస్ సమీపంలో స్పీడ్ బ్రేకర్ దాటుతుండగా శ్రీ వెంకటేశ్వర వాటర్ సప్లైకి చెందిన వాహనం ముందుభాగం తీవ్రంగా దెబ్బతిన్న ఘటన ఆందోళన కలిగించింది. స్పీడ్ బ్రేకర్ వద్దే వాహనం నుజ్జునుజ్జు కావడం చూసి ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికేట్లు సక్రమంగా ఉన్నాయా? తగిన తనిఖీలు జరుగుతున్నాయా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.
SRD: కాంప్లెక్స్ సమావేశాలు విద్యార్థుల ప్రగతికి నాంది కావాలని కొండాపూర్ ఎంఈవో దశరథ్ అన్నారు. శుక్రవారం మండలంలోని తొగర్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు నిర్వహించిన కాంప్లెక్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదిరి పాఠ్యాంశాలను అవగాహన చేసుకుని తరగతి గదుల్లో విద్యార్థులకు సులభమైన రీతిలో బోధించాలని సూచించారు. గుణాత్మక విద్యను అందించాలన్నారు.
AP: YCP అధినేత జగన్‌ను ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం కలిశారు. తాడేపల్లి నుంచి బెంగళూరు వెళ్లేందుకు జగన్ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న బ్రహ్మానందం.. జగన్‌ని చూసి పలకరించారు. ఈ సందర్భంగా ఇరువురు పరస్పరం యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు విషయాలపై చర్చించారు. ఇందుకు సంబంధించని ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.
KRNL: మాజీ MPP రాజవర్ధన్‌రెడ్డి రోడ్డు ప్రమాద మృతి కేసులో ఆయన కుటుంబానికి రూ. 2.25 కోట్లు నష్టపరిహారం 7.5% వడ్డీతో చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. 2022 ఏప్రిల్ 20న జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాలపాడు వద్ద జరిగిన ప్రమాదంలో ఆయన మరణించారు. పిటిషన్‌పై విచారణ అనంతరం లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థకు నష్టపరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది.
వనపర్తి జిల్లా నర్సింగయ్య పల్లి డిగ్రీ కాలేజ్ వద్ద శుక్రవారం ఉదయం రెండు బైకులు ఢీ కొని ప్రమాదం చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తిని సరైన సమయంలో అంబులెన్స్ అందుబాటు లేకపోవడంతో గతంలో గోపాల్పేట ఎస్సైగా విధులు నిర్వహించిన నరేష్ తన బైక్‌పై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. అక్కడ ఉన్న ప్రజలు శభాష్ పోలీస్ అని కొనియాడారు.
AKP: నర్సీపట్నం కాయగూరలు మార్కెట్లో కేజీ టమాటా ధర దారుణంగా పడిపోయింది. కేజీ కేవలం రూ.5 మాత్రమే ఉండడంతో దారుణంగా నష్టపోతున్నామని పలువురు రైతులు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని పేర్కొన్నారు. రైతు బజార్లో కనీసం కేజీ రూ.10లకు అమ్ముకునే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
CTR: పులిచెర్ల మండలం మంగళంపేటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి మహా సంప్రోక్షణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్వర్ణలత, అలాగే రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాల్గొన్నారు. వారు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ELR: బుట్టాయిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ మనేంద్ర రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. వ్యర్ధాల నిర్వహణ క్రమ పద్ధతిలో చేయాలని అన్నారు. ప్లాస్టిక్ వ్యర్ధాలను బాధ్యతారహితంగా పడేయకూడదని వాటి వాడకం తగ్గించాలని సూచించారు.
ASF: పెంచికల్ పేట్ మండలం బొంబాయి గూడ గ్రామంలో నూతనంగా నిర్మితమైన అభయాంజనేయ స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి MLA హరీష్ బాబు శుక్రవారం హాజరయ్యారు. వేద పండితులు బాచంపల్లి కమలాకర్ శర్మ ఆధ్వర్యంలోప్రతిష్టాపన జరిగింది. యాగశాలను సందర్శించిన MLAకు వేద పండితుల ఆశీర్వచనం అందజేశారు.