• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పార్టీ నేత మృతదేహానికి నివాళులర్పించిన బొల్లం

SRPT: చిలుకూరు మండల కేంద్రానికి చెందిన బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ఓబులు మరణం పట్ల మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆదివారం ఓబులు భౌతికకాయానికి ఆయన నివాళులర్పించి, పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం శోకసప్త కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ ఒక నిబద్ధత కలిగిన నాయకుడిని కోల్పోయిందని పేర్కొన్నారు.

February 22, 2026 / 10:56 AM IST

‘నిషేధిత ప్లాస్టిక్ వినియోగిస్తే కఠిన చర్యలు’

ASF: సింగిల్ యూజ్‌డ్ ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా నిషేధమని, ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని కాగజ్ నగర్ మున్సిపల్ కమిషనర్ బీ.తిరుపతి ఆదివారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. ప్లాస్టిక్ కవర్లు, ఇతర నిషేధిత వస్తువులను విక్రయిస్తున్న వ్యాపారులను గుర్తించి సామగ్రి స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రజలు ప్లాస్టిక్‌కు బదులు పర్యావరణ హితమైన వస్తువులను వినియోగించాలన్నారు.

February 22, 2026 / 10:56 AM IST

కామారెడ్డిలో వార్.. ముగింపు కార్డు పడనుందా..?

KMR: సవాళ్లు, ప్రతి సవాళ్లతో కామారెడ్డి రణరంగంగా మారింది. అభివృద్ధి విషయంలో పోరాడాల్సిన వారే ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయ యుద్ధం ప్రారంభమైంది. సోమవారం కలెక్టర్ కార్యాలయానికి ఇరు పార్టీల అధినేతలు వెళ్లి సంబంధిత అంశాలపై చర్చించి నిజానిజాలు తేల్చుకుంటారా! ఈ అంశాలపై ముగింపు కార్డు వేస్తారా! అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

February 22, 2026 / 10:56 AM IST

‘ప్రజలపై మరింత విశ్వాసం పెంచాలి’

KMM: సత్తుపల్లి మున్సిపల్ ఛైర్మన్ రహానా బేగం కమల్ పాషా, వైస్ ఛైర్మన్ సుమలత వేణు, అలాగే సత్తుపల్లి మున్సిపల్ కౌన్సిలర్లను ఆదివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే రాగమయి సత్కరించారు. ప్రభుత్వంపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని మరింత రెట్టింపు చేసేలా పాలకవర్గం కృషి చేయాలని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే వారికి తేనెటీ విందు ఏర్పాటు చేశారు.

February 22, 2026 / 10:55 AM IST

‘మహాసభను జయప్రదం చేయండి’

BDK: ఫిబ్రవరి 27న హైదరాబాద్‌లో సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగే కమ్యూనిస్ట్ మహాసభను జయప్రదం చేయాలని మాజీ సర్పంచ్ శ్రీను తెలిపారు. ఇల్లందు మండలం పోచారం గ్రామంలో పోస్టర్‌ను ఆదివారం ఆవిష్కరించారు. భారతదేశం ఒక అర్ధ వలస, అర్ధ బుస్వామ్య వ్యవస్థ అని, దీనిని కూల్చివేసి నూతన వ్యవస్థ ఏర్పాటు చేయడం కోసం విప్లవ పందా మార్గంలో అందరం నడవాలని అన్నారు.

February 22, 2026 / 10:55 AM IST

బోరుకు మరమ్మతు చేయించిన వార్డు కౌన్సిలర్

నిర్మల్: ఖానాపూర్ పట్టణం గాంధీ నగర్ కాలనీలోని బోరు చెడిపోయి ప్రజలు నీటి కోసం ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న వార్డు కౌన్సిలర్ గొర్రె తిరుమల ఘటన స్థలానికి చేరుకుని దగ్గరుండి సిబ్బందితో బోరు రిపేర్ చేయించారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

February 22, 2026 / 10:53 AM IST

ఓపెనర్‌గా బాబర్ పనికిరాడు: మైక్ హెసన్

పాకిస్తాన్ క్రికెట్ టీమ్ హెడ్ కోచ్ మైక్ హెసన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచకప్‌లలో ఓపెనర్‌గా పవర్ ప్లే సమయంలో బాబర్ ఆజం స్ట్రైక్ రేట్ 100 కంటే తక్కువగా ఉందని, ఇది ఆధునిక T20 ఫార్మాట్‌కు సరిపోదని పేర్కొన్నాడు. ‘జట్టుకు ఏం అవసరమో బాబర్‌కు తెలుసు. పవర్ ప్లేలో వేగంగా పరుగులు చేయలేనప్పుడు, మిడిల్ ఓవర్లలో జట్టును ఆదుకోవడం మంచిదని భావించాం’ అని తెలిపాడు.

February 22, 2026 / 10:52 AM IST

స్వామివారి సేవలో ప్రముఖులు

CTR: కాణిపాకం వినాయక స్వామి దేవస్థానంలో ఆదివారం ప్రముఖులు ప్రత్యేక దర్శనం నిర్వహించారు.కేంద్ర మంత్రి రామ్మోహన్, మాజీ ఎంపీ గల్లా జయదేవ్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఈఓ పెంచల కిషోర్, ఛైర్మన్ మణి నాయుడు ఆలయ సంప్రదాయాల ప్రకారం వారికి ఘన స్వాగతం పలికి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

February 22, 2026 / 10:50 AM IST

మురళీకృష్ణుడి అవతారంలో లక్ష్మీ నరసింహుడు

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 11 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఆదివారం ఉదయం శ్రీ కృష్ణాలంకారములో లక్ష్మీనరసింహస్వామి దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటలకు పొన్న వాహన సేవ ఉండనుంది. స్వామివారి దర్శనానికి భక్తులు యాదగిరిగుట్టకు భారీగా తరలి వస్తున్నారు.

February 22, 2026 / 10:50 AM IST

కాంగ్రెస్ నేతలే దాడి చేశారు: కిషన్ రెడ్డి

TG: కామారెడ్డి ఎమ్మెల్యేపై కాంగ్రెస్ నేతలే దాడిచేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పోలీసులు కాంగ్రెస్, MIM పార్టీలకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. కామారెడ్డికి వెళ్లకుండా రాంచందర్ రావును హౌస్ అరెస్టు చేశారని, తమను ఎందుకు హౌస్ అరెస్టు చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి, బాన్సువాడ ఘటనల్లో ప్రభుత్వ తీరును ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

February 22, 2026 / 10:49 AM IST

రేపటి నుంచి ‘ప్రజావాణి’ పునఃప్రారంభం

ASF: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపివేసిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని రేపటి నుంచి తిరిగి ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె.హరిత తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలో యథావిధిగా వినతుల స్వీకరణ ఉంటుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

February 22, 2026 / 10:47 AM IST

‘భూ కబ్జాలు చేస్తే సహించేది లేదు’

KMM: భూ కబ్జాల పేరుతో పేదలను మోసం చేస్తే సహించేది లేదని RI ప్రసాద్ తెలిపారు. ఏదులాపురం కేంద్రీయ విద్యాలయం సమీపంలోని సుమారు రూ.2 కోట్ల విలువైన ప్రభుత్వ సీలింగ్ భూమి ఆక్రమణను రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. MRO రాంప్రసాద్ ఆదేశాల మేరకు ఆర్‌ఐ సిబ్బందితో కలిసి ఆదివారం జేసీబీతో అక్రమ పునాదులను తొలగించారు. అనంతరం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.

February 22, 2026 / 10:47 AM IST

ఈనెల 25న వాహనాలకు వేలం పాట

మహబూబాబాద్ ఎక్సైజ్ అండ్ ప్రోహిబిషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు ఈ నెల 25వ తేదీన ఉదయం 11 గంటలకు వేలంపాట నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ సీఐ చిరంజీవి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేలం పాటలో పాల్గొనాలనుకునే వారు 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని ఆసక్తి గల వారు వినియోగించుకోవాలని కోరారు.

February 22, 2026 / 10:46 AM IST

ఎన్టీఆర్, నీల్ మూవీ షూటింగ్ UPDATE

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న ‘డ్రాగన్’ మూవీ షూటింగ్ షెడ్యూల్‌లో మార్పులు జరిగాయి. జోర్డాన్‌లో మార్చి 6 వరకు జరగాల్సిన చిత్రీకరణ, స్థానిక జూనియర్ ఆర్టిస్టుల కొరత, లాజిస్టిక్ సమస్యల వల్ల ముందుగానే ముగిసిందట. దీంతో మిగిలిన చిన్నపాటి సీన్లను HYDలోని RFCలో వేసిన ప్రత్యేక సెట్స్‌లో పూర్తి చేయనున్నారట. FEB 25నే మేకర్స్ తిరిగి HYDకి రానున్నట్లు టాక్.

February 22, 2026 / 10:46 AM IST

అరగొండలో ఘనంగా శివాలయ కుంభాభిషేకం

CTR: అరగొండలోని పురాతన చరిత్ర కలిగిన శివాలయంలో ఆదివారం ఉదయం కుంభాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అపోలో అధినేత ప్రతాప్ సి రెడ్డి సుమారు రూ. 7 కోట్ల వ్యయంతో ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మహోత్సవంలో చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే కలికిరి మురళీ మోహన్ తదితరులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

February 22, 2026 / 10:42 AM IST