• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రూ.10 కోట్లు చెల్లించాలంటూ స్టార్ హీరోకి బెదిరింపులు

బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి వరుస బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. తాజాగా ఆ ముఠాకు చెందిన వ్యక్తి రూ.10 కోట్లు డిమాండ్ చేస్తూ అతన్ని బెదిరించినట్లు తెలుస్తోంది. US నంబర్ నుంచి వాయిస్ నోట్ పంపినట్లు సమాచారం. దీనిపై ముంబై పోలీసులు విచారణ చేపట్టి, US ఏజెన్సీల సాయంతో నిందితుడిని గుర్తించే పనిలో ఉన్నారని మీడియా వర్గాలు తెలిపాయి.

February 20, 2026 / 10:16 AM IST

‘అధ్వానంగా ఉన్న రోడ్లు, వంతెనల మరమ్మతులకు చర్యలు తీసుకోవాలి’

E.G: కొవ్వూరు నియోజకవర్గంలో అధ్వానంగా ఉన్న రోడ్లకు, వంతెనల మరమ్మత్తులకు తగిన చర్యలు తీసుకోవాలని కొవ్వూరు MLA ముప్పిడి వెంకటేశ్వరరావు శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో కోరారు. గత వైసీపీ ప్రభుత్వ హాయంలో రహదారులకు మరమ్మత్తులు చేయలేదని విమర్శించారు. రానున్న గోదావరి పుష్కరాల నాటికి ప్రభుత్వం రహదారుల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు.

February 20, 2026 / 10:16 AM IST

విశేష అలంకరణలో బుగ్గ రామలింగేశ్వరస్వామి

ATP: తాడిపత్రిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు చివరి రోజు శుక్రవారం అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ముగింపు వేడుకల సందర్భంగా శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి వారు భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు స్వామివారిని పుష్పాలు, విశేష ఆభరణాలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు.

February 20, 2026 / 10:16 AM IST

వైసీపీ ఆందోళన.. శాసనమండలి వాయిదా

AP: వైసీపీ నేతల ఆందోళనలతో శాసనమండలి వాయిదా పడింది. హెరిటేజ్, ఇందాపూర్ డెయిరీలు తిరుమల శ్రీవారి సొమ్మును లూఠీ చేశాయని ఆరోపిస్తూ ఇవాళ కూడా వైసీపీ నేతలు మండలిలో నినాదాలు చేశారు. ర్యాలీగా నినాదాలు, ప్లకార్డులతో వారు మండలిలోకి రావడాన్ని మంత్రి పయ్యావుల కేశవ్ తప్పుబట్టారు. ‘వారికి దేవుడిపై నమ్మకం లేదు. బుద్ధుందా’ అంటూ ఫైరయ్యారు. ఈ క్రమంలో మండలి 10 నిమిషాల పాటు వాయిదా పడింది.

February 20, 2026 / 10:15 AM IST

‘గరుడాచలం మృతి RSS, BJPకి తీరని లోటు’

ASF: RSS, వనవాసి కళ్యాణ పరిషత్‌లో కీలక బాధ్యతలు నిర్వహించిన వాడపల్లి గరుడాచలం మృతి RSS, BJPకి తీరని లోటని MLA హరీష్ బాబు అన్నారు. శుక్రవారం కాగజ్ నగర్ పట్టణం ఆదర్శనగర్‌లో గరుడాచలం అనారోగ్యంతో మృతి చెందారని తెలిసి ఆయన నివాసంలో పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

February 20, 2026 / 10:15 AM IST

ముత్యంపేటలో అక్రమ కట్టడాల కూల్చివేత

KMR: దోమకొండ మండలం ముత్యంపేట గ్రామంలో ప్రభుత్వ పాఠశాలకు చెందిన భూమిపై అక్రమంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ను గురువారం సాయంత్రం అధికారులు కూల్చి వేశారు. ఓ నాయకుడు గ్రామంలో అక్రమ కట్టడాన్ని రాజకీయ పలుకుబడితో కట్టడంతో అధికారులు సైతం వెనుకంజ వేశారు.అయినప్పటికీ హైకో ర్టు అడ్వకేట్ ముందుకు వచ్చి పోలీసులు అధికారులతో కలిసి అక్రమ కట్టడాన్ని కూల్చివేయించారు.

February 20, 2026 / 10:15 AM IST

ద్రవిడ వర్సిటీకి పెరిగిన గ్రాంట్

CTR: కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయానికి TTD నుంచి అందుతున్న వార్షిక నిర్వహణ గ్రాంట్‌ను ప్రభుత్వం పెంచింది. ఇప్పటి వరకు రూ. 50 లక్షలు అందుతుండగా, 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి దాన్ని రూ. 1 కోటికి పెంచింది. TTD బోర్డు తీర్మానం మేరకు ఈ పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయంతో విశ్వవిద్యాలయ అభివృద్ధి, మౌలిక సదుపాయాల బలోపేతానికి తోడ్పాటు లభించనుంది.

February 20, 2026 / 10:14 AM IST

జిల్లాలో మర్చి 13 నుంచి రెవెన్యూ క్రీడలు

SKLM: జిల్లాలో వచ్చే నెల 13 నుంచి 15 వరకు రెవెన్యూ క్రీడలు నిర్వహించనున్నట్లు టెక్కలి ఆర్డీవో ఎం. కృష్ణమూర్తి తెలిపారు. సబ్‌కలెక్టర్ కార్యాలయంలో సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారు. డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులతో క్రీడలను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. మండలాల నుంచి ఎక్కువ మంది పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

February 20, 2026 / 10:12 AM IST

ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు

AP: ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. ముందుగా అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, కేంద్రమంత్రి జితిన్ ప్రసాదతో కలవనున్న ఆయన.. అనంతరం వారితోపాటు సమ్మిట్‌కు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పలువురు విదేశీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలో భేటీ అయి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరనున్నారు.

February 20, 2026 / 10:09 AM IST

బాలిక అదృశ్యం..కేసు నమోదు

KDP: పులివెందుల పట్టణానికి చెందిన బాలిక(17) అదృశ్యమైనట్లు బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసినట్లు SI తిమోతి తెలిపారు. SI వివరాల మేరకు.. బాలిక చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. రాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుమార్తె ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టాలని ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.

February 20, 2026 / 10:06 AM IST

‘విద్యార్థుల నుంచి కండోనేషన్ ఫీజు వసూలు చేస్తే చర్యలు’

PPM: ఇంటర్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు హాజరు తక్కువగా ఉందని కండోనేషన్ ఫీజు వసూలు చేయాలని చూస్తే వారిపై చర్యలు తప్పవనిమన్యం DIEO వై. నాగేశ్వరరావు హెచ్చరించారు. కండోనేషన్ ఫీజు ఉన్న విద్యార్థులు కూడా ప్రశాంతంగా పరీక్షలు రాసుకోవచ్చునన్నారు. ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షల్లో జిల్లావ్యాప్తంగా 33 కేంద్రాల్లో 17,530 మంది పరీక్షలు రాయనున్నారు.

February 20, 2026 / 10:06 AM IST

కత్తిపోట్ల కలకలం.. ఒకరి పరిస్థితి విషమం

TG: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కత్తిపోట్లు కలకలం సృష్టించాయి. కుటుంబకలహాల కారణంగా ముగ్గురిపై కత్తితో దాడి జరిగింది. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబీకులు సుమిత్ర, ప్రణయ్, కొమురమ్మపై రామ్‌దూత్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దీంతో వారికి తీవ్రంగా గాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

February 20, 2026 / 10:05 AM IST

కోకో పంటకు లభించని గిట్టుబాటు ధర

CTR: కోకో పంటలు గిట్టుబాటు ధర లభించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో సుమారు 9 వేల హెక్టార్లలో కోకో పంట సాగులో ఉంది. నాణ్యతను బట్టి కిలోకు గరిష్టంగా రూ. 380 మాత్రమే లభిస్తున్నట్లు రైతులు తెలుపుతున్నారు. గత ఏడాది రూ. 650 వరకు ధర లభించిందని చెప్పారు. పంట సాగుకు పెట్టుబడులు అధికం కావడం.. గిట్టుబాటు ధర లేకపోవడంతో నష్టపోతున్నట్లు వాపోయారు.

February 20, 2026 / 10:04 AM IST

ద్విచక్ర వాహనాలు ఢీ .. స్వల్ప గాయాలు

SKLM: నరసన్నపేట పట్టణం తంబకాయ కూడలు వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని శుక్రవారం ఉదయం ప్రమాదం సంభవించింది. తంబకాయ కూడలు వద్ద మలుపు ఉండడంతో ఎదురుగా వచ్చే వాహనం కనిపించకపోవడం వలన ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు తెలిపారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు.

February 20, 2026 / 10:00 AM IST

శక్తి యాప్ పై అవగాహన కార్యక్రమం

ప్రకాశం: ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో గురువారం ఎస్పీ హర్షవర్ధన్ ఆదేశాల మేరకు పోలీసులు శక్తి యాప్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళల రక్షణార్థం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఈ యాప్ ను ఉపయోగించి మహిళలు తమకు తామే రక్షణ కల్పించుకోవచ్చని పోలీసులు తెలిపారు. మహిళల స్మార్ట్ ఫోన్లలో శక్తి యాప్ డౌన్లోడ్ చేయించి, దాని ఉపయోగాలను వారికి వివరించారు.

February 20, 2026 / 10:00 AM IST