• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

మార్చి 09: టీవీలలో సినిమాలు

స్టార్ మా: జాక్(9AM); జీతెలుగు: సాహో(9AM); ఈటీవీ: అక్క మొగుడు(9AM); జెమిని: అడవి రాముడు(9AM), శివమణి(3:30PM); స్టార్‌మా మూవీస్: సినిమా చూపిస్త మావ(7AM), చంద్రముఖి(9AM), S/O సత్యమూర్తి(12PM), మన్మథుడు(3PM), జులాయి(9PM); జీ సినిమాలు: అహ నా పెళ్లంట(7AM), సంతోషం(9AM), శివాజి(12PM), జయం మనదేరా(3PM).

March 9, 2026 / 04:15 AM IST

వ్యవసాయం చేసే భర్త కావాలి: స్టార్ నటి

ప్రముఖ నటి మీనాక్షి చౌదరి తన కాబోయే భర్త గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. ‘నాకు కాబోయే భర్తకు పెద్ద పెద్ద బిజినెస్లు ఉండాల్సిన అవసరం లేదు, కోట్లల్లో సంపాదించాల్సిన అవసరం లేదు. అతను వ్యవసాయం చేస్తే సరిపోతుంది. కానీ అతనికి 100 ఎకరాల భూమి ఉండాలి. వంట బాగా చేయాలి, ఇంటి పనులన్నీ చూసుకోవాలి. ఇలాంటి క్వాలిటీస్ ఉన్న వ్యక్తి నాకు భర్తగా రావాలి’ అని కోరుకుంటున్నట్లు వెల్లడించింది.

March 8, 2026 / 09:06 PM IST

మంచు లక్ష్మి కొత్త మూవీ.. ట్రైలర్ ఎప్పుడంటే?

నటి మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న సరికొత్త చిత్రం ‘లేచింది మహిళా లోకం’. అనన్య నాగళ్ల, హరి తేజ, శ్రద్ధా దాస్, హేమ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ చిత్ర బృందం ప్రేక్షకులకు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్‌ను మార్చి 9న ఉ.11:07 గంటలకు విడుదల చేయబోతున్నట్లు తెలిపారు.

March 8, 2026 / 08:00 PM IST

ఘోర ప్రమాదం.. ప్రముఖ యూట్యూబర్ మృతి

యూట్యూబర్, బిగ్‌బాస్-17 ఫేమ్ అనుగరాగ్ దొభాల్ ఆత్మహత్యా యత్నం చేశాడు. కుటుంబ కలహాలతో మనస్తాపనికి గురైన అతడు 150కి.మీ వేగంతో వెళ్లి కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలవడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ప్రమాదం జరిగే సమయంలో దాదాపు 80 వేల మంది ఇన్‌స్టా లైవ్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 8, 2026 / 07:28 PM IST

T20 WC: ఫైనల్‌లో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ టీజర్

నేడు T20 WCలో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ పోరు జ‌రుగబోతున్న విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్ అటు క్రికెట్ ప్రేమికుల్లో, ఇటు సినీ అభిమానుల్లో భారీ ఉత్కంఠను రేపుతోంది. ఈ మ్యాచ్ మధ్యలో బ్రేక్ సమయంలో పవన్ కళ్యాణ్ హీరోగా.. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ టీజర్‌ను ప్రదర్శించబోతున్న‌ట్లు తెలుస్తుంది.

March 8, 2026 / 06:14 PM IST

మహిళా దినోత్సవం.. ఉపాసన స్పెషల్ పోస్ట్

అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా మెగా కోడలు ఉపాసన ప్రత్యేక పోస్ట్ చేసింది. ‘ఈ రోజు నా లైఫ్‌ భిన్నదశల్లో నన్ను నేను అంగీకరించడం కోసమేనని తెలిపింది. ఇలా ఉండడం ఎల్లప్పుడూ సులభం కాదు.. కానీ నా  శ్రేయస్సు, నా కుటుంబం కోసం నా ఆరోగ్యాన్ని ప్రాధాన్యతగా చేసుకోవడంతోనే ప్రేరణ పొందానని’ ‘X’ వేదికగా వెల్లడించింది. అలాగే పలు ప్రత్యేక ఫొటోలను షేర్ చేసింది.

March 8, 2026 / 05:55 PM IST

‘AA23’.. అనిరుధ్ రెమ్యూనరేషన్ ఎంతంటే..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ చిత్రం ‘AA23’. అయితే, ఈ సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఒక్క మూవీ కోసమే అనిరుధ్ ఏకంగా రూ.25 కోట్లు పారితోషికంగా డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

March 8, 2026 / 05:34 PM IST

OTTలోకి ‘కపుల్ ఫ్రెండ్లీ’.. ఎప్పుడంటే?

యంగ్ హీరో సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ OTT విడుదలకు సిద్ధమైంది. FEB 14న విడుదలైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ పొందింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో మార్చి 13 నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలుగు, తమిళ్‌తో పాటు ఇతర దక్షిణాది భాషల్లో కూడా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

March 8, 2026 / 03:39 PM IST

టాలీవుడ్ యంగ్ హీరోకి నిశ్చితార్ధం..!

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్ధం చేసుకున్నాడు. HYDకి చెందిన ప్రముఖ న్యాయవాది కుమార్తె కావ్య రెడ్డితో సాయి శ్రీనివాస్ ఎంగేజ్‌మెంట్ జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఈ వేడుక జరిగినట్లు సమాచారం. దర్శకుడు బోయపాటి శ్రీను, హీరోయిన్ సంయుక్తా మేనన్ తదితరులు హాజరయ్యారు. త్వరలోనే పెళ్లి తేదిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

March 8, 2026 / 03:34 PM IST

నా కుమారులను అలా పెంచుతాను: ఎన్టీఆర్

మహిళలను ఎలా గౌరవించాలో పదేపదే గుర్తుచేస్తూ ఉండటం తనకు నచ్చదని హీరో జూ.ఎన్టీఆర్ అన్నాడు. పుట్టుకతోనే ప్రతి పురుషుడు మహిళల పట్ల గౌరవంతో పుట్టాల్సిన సమయం ఇదని అభిప్రాయపడ్డాడు. మనం మన పిల్లలకు మన ఇళ్ల నుంచే సరైన విద్యను అందించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించాడు. తన ఇద్దరు కుమారులు మహిళలను గౌరవిస్తూ పెరిగేలా తాను ఖచ్చితంగా చూసుకుంటానని వెల్లడించాడు.

March 8, 2026 / 02:57 PM IST

ప్రారంభానికి సిద్ధమైన ‘అల్లు సినిమాస్’!

అల్లు అరవింద్, అల్లు అర్జున్‌ల ప్రతిష్టాత్మక మల్టీప్లెక్స్ ‘అల్లు సినిమాస్’ ప్రారంభానికి ముస్తాబైంది. మార్చి 19న ఉగాది సందర్భంగా ‘ధురంధర్ 2’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాలతో ఇది గ్రాండ్‌గా ఓపెన్ కానున్నట్లు తెలుస్తోంది. అత్యాధునిక లేజర్ ప్రొజెక్షన్, డాల్బీ అట్మాస్ సౌండ్‌తో ప్రేక్షకులకు ప్రపంచస్థాయి అనుభూతిని ఇది అందించనుంది.

March 8, 2026 / 02:42 PM IST

టాక్ ఆఫ్ ది టౌన్‌గా కమల్ హాసన్ రెమ్యూనరేషన్!

‘కల్కి 2898 AD’ సినిమా కోసం కమల్ హాసన్ అందుకున్న పారితోషికం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. కేవలం 10 రోజుల కాల్‌షీట్స్ కేటాయించినందుకు గాను నిర్మాత అశ్వినీదత్ ఆయనకు రూ. 150 కోట్లు ఇచ్చినట్లు సమాచారం. అంటే రోజుకు దాదాపు రూ. 15 కోట్లు అన్నమాట. భారతీయ సినీ చరిత్రలో ఒక సీనియర్ హీరో ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకోవడం ఇదే మొదటిసారి అని సినీవర్గాలు చెబుతున్నాయి.

March 8, 2026 / 02:15 PM IST

‘ది బ్లాక్ గోల్డ్’ నుంచి స్పెషల్ పోస్టర్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సంయుక్త నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘ది బ్లాక్ గోల్డ్’ నుంచి స్పెషల్ పోస్టర్ విడుదలైంది. ఈ మూవీలో సంయుక్త ఫియర్ లెస్, పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. ఈ పోస్టర్‌కి ‘ఆయుధాల కంటే న్యాయాన్ని నమ్మే మహిళ’ అనే క్యాప్షన్ ఇచ్చారు. ఇక, యోగేష్ KMC తెరకెక్కిస్తున్న ఈ మూవీకి శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు.

March 8, 2026 / 02:00 PM IST

‘ఆదర్శ కుటుంబం’ ప్రమోషన్స్ ఎప్పుడంటే?

విక్టరీ వెంకటేష్‌తో దర్శకుడు త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాను 2026 అక్టోబర్ 2న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి.. వేసవి నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

March 8, 2026 / 01:15 PM IST

‘జన నాయగన్’ వివాదానికి తెరపడనుందా?

విజయ్ దళపతి ‘జన నాయగన్’ సెన్సార్ చిక్కులు త్వరలోనే వీడనున్నాయి. ఈ మూవీని మార్చి 9న మధ్యాహ్నం 2 గంటలకు సెన్సార్ రివిజన్ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా వీక్షించనున్నారట. వారు ఇచ్చే సర్టిఫికేట్, సూచించే కట్స్ ఆధారంగా విడుదలపై స్పష్టత రానుంది. సెన్సార్ పూర్తికాగానే మేకర్స్ రిలీజ్ డేట్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఈ అప్‌డేట్ ఆసక్తికరంగా మారింది.

March 8, 2026 / 12:28 PM IST