AP: శ్రీకాకుళం జిల్లా మందస మం. పెద్దకేసుపురంలో విషాదం చోటుచేసుకుంది. జీడితోటలో పిడుగు పడి తల్లీకూతుర్లు ప్రాణాలు కోల్పోయారు. మృతులను కృష్ణవేణి, యోగేశ్వరిగా గుర్తించారు. కాగా అకాల వర్షాల నేపథ్యంలో వర్షం పడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
TG: హన్మకొండ జిల్లా గోపాలపురంలో కత్తిపోట్ల కలకలం రేగింది. రూ.3 లక్షల అప్పు విషయంలో కార్తీక్, రామ్ చరణ్ అనే ఇద్దరు స్నేహితుల మధ్య ఘర్షణ జరిగింది. మాటామాటా పెరిగి గొడవ పెద్దది కావడంతో రామ్ చరణ్‌పై కార్తీక్ కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలతో ఉన్న రామ్ చరణ్‌ని స్థానికులు MGM ఆస్పత్రికి తరలించారు. కత్తి దాడి అనంతరం పరారైన కార్తీక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
AP: కడప జిల్లా వేంపల్లి మండలంలో పెను ప్రమాదం తప్పింది. వీరన్నగట్టుపల్లె వద్ద విద్యుత్ తీగలు తగలడంతో ఓ బస్సులో మంటలు చెలరేగాయి. బస్సులోని 21 మంది ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై క్షేమంగా కిందికి దిగారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేశారు. అప్రోచ్ రోడ్డుకు మట్టి ఎత్తుగా వేయడంతో బస్సుకు విద్యుత్ లైన్ తాకినట్లుగా స్థానికులు తెలిపారు.
సత్యసాయి: జాతీయ సమైక్యత శిబిరానికి కదిరి STSN ప్రభుత్వ డిగ్రీ కళాశాల జంతుశాస్త్ర, NSS UNIT-1 విద్యార్థిని సారిక ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపల్ స్మిత తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు కర్ణాటక రాష్ట్రం మాండ్యలోని విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న జాతీయ సమైక్యత శిబిరంలో సారిక పాల్గొననున్నట్లు వెల్లడించారు.
TG: భూపాలపల్లి రేగొండలోని రేపాకలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని కుమారులు తండ్రిని చంపేశారు. చేరాలు భార్య హైదరాబాద్‌లో ఇద్దరు కుమారుల వద్ద ఉంటుంది. తండ్రి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకున్న కుమారులు.. ఇంటికి వచ్చేసారికి వారిద్దరూ కలిసి ఉండటంతో ఇద్దరిపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో చికిత్సపొందుతూ తండ్రి మృతి చెందాడు.
TG: నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండలం కల్లెడలో విషాదం నెలకొంది. పెళ్లైన నెల రోజులకే యువతి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. మార్చి 5న శ్రీకాంత్‌తో అఖిల వివాహం జరిగింది. ఇవాళ అత్తింట్లోనే అఖిల సూసైడ్ చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
AP: కోనసీమ జిల్లా బొబ్బర్లంక వద్ద గోదావరిలో గల్లంతైన మృతదేహాలు లభ్యమయ్యాయి. గోదావరిలో నిన్న ముగ్గురు గల్లంతయ్యారు. ఇవాళ ఉదయం సుల్తాన్ అహ్మద్(22), మహ్మద్ అల్ఫాద్(18) మృతదేహాలు లభ్యం కాగా, నిన్ననే బిలాల్(27) మృతదేహం లభ్యమైంది. మృతులు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి తుమ్మలోవకు చెందిన వారిగా సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
E.G: రాజమండ్రి నుంచి రావులపాలెం వెళ్తున్న బస్సులో మాయచేసి బంగారు హారం దొంగిలించిన ఘటన జరిగింది. చంటి బిడ్డకు పాలు కలపాలని చెప్పి బాధితురాలి దృష్టి మళ్లించి బ్యాగులోని 24 గ్రాముల హారం అపహరించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేసి ముగ్గురు మహిళలను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
TG: నిర్మల్ జిల్లాలో షార్ట్‌సర్క్యూట్‌తో ఫ్రిడ్జ్‌లో మంటలు చెలరేగాయి. మహాలక్ష్మీ వాడలోని రెండు పడకల ఇంట్లో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు వచ్చి ఇల్లు మొత్తం వ్యాపించాయి. దీంతో విజయ్ అనే వ్యక్తితో పాటు మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పర్యాటకులతో వెళ్తున్న టెంపో ట్రావెలర్ అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో మొత్తం 22 మంది ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
NLR: జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సంగం మండలం కోలగట్ల సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడటంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అనంతపురం డిపోకు చెందిన ఈ బస్సు నెల్లూరు వైపు ప్రయాణిస్తుండగా, ఎదురుగా వస్తున్న ఒక లారీని తప్పించబోయి నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 22 మంది ప్రయాణికులు ఉన్నారు.
TG: HYDలో DCM బీభత్సం సృష్టించింది. మాదాపూర్ మైండ్ స్పేస్ వద్ద స్కూటీని DCM ఢీకొట్టింది. స్కూటీపై ఉన్న దంపతులను కి.మీ. మేర DCM డ్రైవర్ ఈడ్చుకెళ్లాడు. కొంతదూరం వెళ్లాక స్కూటీ పైనుంచి భర్త పక్కకు పడిపోయాడు. ఈ క్రమంలో స్కూటీని ఈడ్చుకెళ్లడం స్థానికులు గమనించారు. దీంతో డ్రైవర్ పారిపోగా క్లీనర్‌కు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించగా.. దర్యాప్తు చేస్తున్నారు.
E.G: రంగంపేట మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లగా, ఇంట్లో ఒంటరిగా ఉన్న 13 ఏళ్ల బాలికపై పొరుగింటి వ్యక్తి పెనుముచ్చి మంగరాజు (45) లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం బయటపెడితే చంపేస్తానని బెదిరించాడు. బాధితురాలు తల్లిదండ్రులకు విషయం చెప్పగా, వారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
KKD: కొత్తపల్లి మండలం అమీనాబాద్ వెళ్లే రహదారిలో శనివారం సాయంత్రం రెండు ఆటోలు బలంగా ఢీకొన్నాయని స్థానికులు తెలిపారు. పెట్రోల్ బంకు సమీపంలో ఎదురెదురుగా వచ్చిన ఆటోలు ఢీకొనడంతో అవి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకుపోయాయని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
NLR: కందుకూరులో LIC అధికారులను బురిడీ కొట్టించి రూ.9 లక్షలు కాజేసిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు టౌన్ ఎస్సై శివ నాగరాజు శనివారం తెలిపారు. LIC ఏజంట్‌గా ఉన్న శ్రీనివాసులు నకిలీ డెత్ సర్టిఫికెట్లను సృష్టించి రూ.9 లక్షలు కాజేసిన వ్యవహారాన్ని ఆడిట్ అధికారులు గుర్తించారు. దాంతో శ్రీనివాసులును అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్సై వివరించారు.