• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

ఆస్పత్రి భవనం పైనుంచి దూకి రోగి ఆత్మహత్య

AP: గుంటూరు GGH ఆస్పత్రి భవనం పైనుంచి దూకి రోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెన్నంశెట్టి శ్రీనివాస్ అనే వ్యక్తి కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఈనెల 23న ఆస్పత్రిలో చేరాడు. కాలకృత్యాలు తీర్చుకునే గది వద్ద ఉన్న కిటికీ పైనుంచి దూకాడు. మృతుడి స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా ఉండి గ్రామం. మృతుడి భార్య కొన్నిరోజుల కిందట మరణించినట్లు సమాచారం. శ్రీనివాసులుకు ఇద్దరు కుమారులు ఉన్నట్లు సమాచారం.

May 30, 2026 / 08:10 AM IST

ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి

AP: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఆదోని మండలం పాండవగల్లు దగ్గర ఆటో, బైకు ఢీకొని ముగ్గురు మృతిచెందారు. ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న వీరేష్, మహీంద్రా మృతిచెందగా.. ఆటోలో ఉన్న కౌతాళంకు చెందిన విశ్వనాథ్ మృతిచెందాడు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

May 30, 2026 / 06:47 AM IST

బైక్-ఆటో ఢీ.. ముగ్గురు దుర్మరణం

AP: కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్లులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్-ఆటో ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మృతులను వీరేష్, మహేంద్ర, విశ్వనాథ్‌గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

May 29, 2026 / 10:13 PM IST

ఐటీ ఉద్యోగం వదిలి వ్యవసాయం.. చివరికి

వ్యవసాయంపై ఇష్టంతో బెంగళూరులో ఐటీ ఉద్యోగాన్ని వదిలి వచ్చిన ఒక మాజీ టెకీ పిడుగు పాటుకు బలయ్యాడు. కర్ణాటకు చెందిన రోషన్ బాలకృష్ణ ఇటీవల తన సొంత గ్రామానికి తిరిగి వచ్చి.. స్థానిక రైతులకు ఆధునిక వ్యవసాయ పరికరాలను పరిచయం చేసేందుకు తన స్నేహితుడితో కలిసి పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తోటలో మామిడి పండ్లు కోసేందుకు వెళ్లిన సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది.

May 29, 2026 / 04:34 PM IST

అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన లారీ

E.G: రాజమండ్రి నుంచి ప్రత్తిపాడు వైపు ఇసుక లోడుతో వెళ్తున్న బెంజ్ లారీ రామవరం సమీపంలో ప్రమాదానికి గురైంది. ప్రయాణ మధ్యలో లారీ టైర్ అకస్మాత్తుగా పేలిపోవడంతో వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనతో కొంతసేపు రహదారిపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

May 29, 2026 / 04:30 PM IST

BREAKING: వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం

AP: రాజమండ్రిలోని ఓ వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు సమాచారం. దుకాణం నుంచి రెండు అంతస్తులకు మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెస్తున్నారు. భారీగా వస్త్రాలు దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

May 29, 2026 / 12:27 PM IST

అడ్వొకేట్ మొయిజుద్దీన్ కేసులో కీలక పరిణామం 

TG: అడ్వొకేట్ మొయిజుద్దీన్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆలంఖాన్‌తో పాటు కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మొయిజుద్దీన్‌ను చంపేందుకు ఆలంఖాన్, కుమారుడు రూ.25 లక్షల సుపారీ ఇచ్చారు. రెండేళ్లుగా మొయిజుద్దీన్‌ను హత్య చేసేందుకు పదిసార్లు ప్రయత్నించినట్లు గుర్తించారు.

May 29, 2026 / 10:53 AM IST

ప్రేయసిని చంపిన ప్రియుడు

TG: నాగర్‌కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపూర్‌లో దారుణం జరిగింది. పార్వతమ్మను ప్రియుడు రాములు చంపేశాడు. అనంతరం మొక్కజొన్న కంకుల్లో మృతదేహం దహనం చేశాడు. గతంలో ప్రియుడితో కలిసి పార్వతమ్మ తన భర్తను హతమార్చింది. కాగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

May 29, 2026 / 09:47 AM IST

రిచ్ కిడ్స్ కేసు.. మరో నిందితుడు అరెస్ట్

TG: హైదరాబాద్ జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ కేసులో మరో యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జతిన్ అనే యువకుడిపై పోక్సో కేసు పెట్టారు. ప్రధాన నిందితుడు అర్జున్‌కు జతిన్ సహకరించినట్లు గుర్తించారు. మైనర్‌ను బ్లాక్ మెయిల్ చేసి 2 లక్షలు జతిన్ తీసుకున్నారు.

May 29, 2026 / 09:42 AM IST

ఈదురుగాలులకు తాటిచెట్టు పడి ఇద్దరు మృతి

AP: అర్ధరాత్రి వీచిన ఈదురుగాలులకు పలుచోట్ల విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. విజయవాడ వన్‌టౌన్‌లో తెగిపడిన విద్యుత్‌ తీగ తాకి హోంగార్డు మృతిచెందాడు. కోడూరు మండలం కుమ్మరపాలెంలో తాటిచెట్టు పడి ఇద్దరు మరణించారు. మృతులు మనోహర్ బాబు(30), శివరామకృష్ణ(26)గా గుర్తించారు. అవనిగడ్డ, మోపిదేవి, నాగాయలంక ప్రాంతాల్లో భారీగా మామిడికాయలు రాలాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

May 29, 2026 / 08:25 AM IST

ఏపీలో మరో ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా

AP: వైఎస్సార్ కడప జిల్లా గోపవరం మండలం పీపీ కుంట వద్ద రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. పొద్దుటూరుకు చెందిన బీసీవీ ఆర్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. డ్రైవర్‌తో సహా ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను బద్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విజయవాడ నుంచి కదిరికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

May 29, 2026 / 08:02 AM IST

బాలుడిపై హెడ్‌కానిస్టేబుల్ లైంగిక వేధింపులు

చెన్నైలో 16 ఏళ్ల బాలుడిని లైంగికంగా వేధించిన హెడ్‌కానిస్టేబుల్‌ వేలప్పన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్నేహితుడి ఇంట్లో మద్యం తాగి, మత్తులో బాలుడికి బలవంతంగా మద్యం తాగించి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ క్రమంలో బాలుడు ప్రతిఘటించి, TV రిమోట్‌తో దాడి చేసి, కానిస్టేబుల్‌ను గదిలో బంధించాడు. అనంతరం స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

May 29, 2026 / 12:15 AM IST

ఎవరెస్ట్‌పైనే తివారీ పార్థివదేహం

TG: ఎవరెస్ట్‌పై మృతిచెందిన హైదరాబాద్ పర్వతారోహకుడు అరుణ్ కుమార్ తివారీ మృతదేహాన్ని పర్వతంపైనే వదిలేయాలని ఆయన కుటుంబం నిర్ణయించింది. డెత్ జోన్ నుంచి మృతదేహాన్ని తేవడం ప్రమాదకరం, అత్యంత ఖర్చుతో కూడుకున్నదని నిర్వాహకులు తెలిపారు. దీంతో శివుని నివాసంలో ప్రాణాలు విడిచినందున అక్కడే వదిలేయాలనే కఠిన నిర్ణయం తీసుకున్నట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు.

May 28, 2026 / 12:21 AM IST

న్యాయవాది మొయిజుద్దీన్ హత్య కేసులో పురోగతి

TG: న్యాయవాది మొయిజుద్దీన్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హత్యకు ఉపయోగించిన స్కార్పియో కారును గుర్తించారు. హత్యకు సూత్రధారిగా భావిస్తున్న ముజాహిద్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా వక్ఫ్ భూముల వివాదంలో మొయిజుద్దీన్‌ను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్న విషయం తెలిసిందే.

May 27, 2026 / 11:31 AM IST

గూడెంకొత్తవీధిలో విరబూసిన బ్రహ్మకమలం

ASR: గూడెంకొత్తవీధి మండలం ఏబులంలో ఓ ఉపాధ్యాయురాలి ఇంటి పెరట్లో బ్రహ్మకమలం పువ్వులు విరబూసి అందరినీ ఆకట్టుకున్నాయి. గ్రామానికి చెందిన పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ రామలక్ష్మి కొంతకాలంగా బ్రహ్మకమలం మొక్కలను పెంచుతున్నారు. రెండు రోజుల క్రితం మొక్కలకు మొగ్గలు రావడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. నిన్న సాయంత్రం నుంచి ఒక్కొక్కటిగా మొగ్గలు వికసించడం ప్రారంభించాయి.

May 27, 2026 / 09:59 AM IST