• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

బిడ్డ సాకుతో హారం మాయం: ముగ్గురి అరెస్ట్

E.G: రాజమండ్రి నుంచి రావులపాలెం వెళ్తున్న బస్సులో మాయచేసి బంగారు హారం దొంగిలించిన ఘటన జరిగింది. చంటి బిడ్డకు పాలు కలపాలని చెప్పి బాధితురాలి దృష్టి మళ్లించి బ్యాగులోని 24 గ్రాముల హారం అపహరించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేసి ముగ్గురు మహిళలను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

April 5, 2026 / 10:00 AM IST

ఫ్రిడ్జ్‌లో మంటలు.. ఇద్దరు మృతి

TG: నిర్మల్ జిల్లాలో షార్ట్‌సర్క్యూట్‌తో ఫ్రిడ్జ్‌లో మంటలు చెలరేగాయి. మహాలక్ష్మీ వాడలోని రెండు పడకల ఇంట్లో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు వచ్చి ఇల్లు మొత్తం వ్యాపించాయి. దీంతో విజయ్ అనే వ్యక్తితో పాటు మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు.

April 5, 2026 / 09:53 AM IST

లోయలో పడిన వాహనం.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పర్యాటకులతో వెళ్తున్న టెంపో ట్రావెలర్ అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో మొత్తం 22 మంది ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

April 5, 2026 / 09:49 AM IST

అదుపు తప్పి బస్సు బోల్తా

NLR: జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సంగం మండలం కోలగట్ల సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడటంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అనంతపురం డిపోకు చెందిన ఈ బస్సు నెల్లూరు వైపు ప్రయాణిస్తుండగా, ఎదురుగా వస్తున్న ఒక లారీని తప్పించబోయి నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 22 మంది ప్రయాణికులు ఉన్నారు.

April 5, 2026 / 09:01 AM IST

డీసీఎం బీభత్సం.. క్లీనర్‌కు దేహశుద్ది చేసిన స్థానికులు

TG: HYDలో DCM బీభత్సం సృష్టించింది. మాదాపూర్ మైండ్ స్పేస్ వద్ద స్కూటీని DCM ఢీకొట్టింది. స్కూటీపై ఉన్న దంపతులను కి.మీ. మేర DCM డ్రైవర్ ఈడ్చుకెళ్లాడు. కొంతదూరం వెళ్లాక స్కూటీ పైనుంచి భర్త పక్కకు పడిపోయాడు. ఈ క్రమంలో స్కూటీని ఈడ్చుకెళ్లడం స్థానికులు గమనించారు. దీంతో డ్రైవర్ పారిపోగా క్లీనర్‌కు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించగా.. దర్యాప్తు చేస్తున్నారు.

April 5, 2026 / 08:58 AM IST

ఘోరం.. 13 ఏళ్ల బాలికపై అత్యాచారం

E.G: రంగంపేట మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లగా, ఇంట్లో ఒంటరిగా ఉన్న 13 ఏళ్ల బాలికపై పొరుగింటి వ్యక్తి పెనుముచ్చి మంగరాజు (45) లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం బయటపెడితే చంపేస్తానని బెదిరించాడు. బాధితురాలు తల్లిదండ్రులకు విషయం చెప్పగా, వారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

April 5, 2026 / 07:33 AM IST

రెండు ఆటోలు డీ.. ఇద్దరికి గాయాలు

KKD: కొత్తపల్లి మండలం అమీనాబాద్ వెళ్లే రహదారిలో శనివారం సాయంత్రం రెండు ఆటోలు బలంగా ఢీకొన్నాయని స్థానికులు తెలిపారు. పెట్రోల్ బంకు సమీపంలో ఎదురెదురుగా వచ్చిన ఆటోలు ఢీకొనడంతో అవి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకుపోయాయని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

April 5, 2026 / 07:30 AM IST

రూ.9 లక్షలు బురిడి.. నిందితుడు అరెస్ట్

NLR: కందుకూరులో LIC అధికారులను బురిడీ కొట్టించి రూ.9 లక్షలు కాజేసిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు టౌన్ ఎస్సై శివ నాగరాజు శనివారం తెలిపారు. LIC ఏజంట్‌గా ఉన్న శ్రీనివాసులు నకిలీ డెత్ సర్టిఫికెట్లను సృష్టించి రూ.9 లక్షలు కాజేసిన వ్యవహారాన్ని ఆడిట్ అధికారులు గుర్తించారు. దాంతో శ్రీనివాసులును అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్సై వివరించారు.

April 5, 2026 / 06:15 AM IST

చోరీ కేసు.. నిందితుడు అరెస్ట్

E.G: జిల్లాలోని రాజానగర మండలం కానవరంలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. గత నెల 25న కోరాడ శివలక్ష్మి ఇంట్లో 82 గ్రాముల బంగారం, 45 తులాల వెండిని అపహరించిన నిందితుడు జామీ వీరగణేశ్‌ను శనివారం కాకినాడలో అరెస్ట్ చేసినట్లు ఇన్ఛార్జ్ DSP బి.రామకృష్ణ తెలిపారు. క్లూస్ టీం ఆధారాలతో నిందితుడిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. 

April 5, 2026 / 06:05 AM IST

ఏడేళ్ల కొడుకును చిత్రహింసలు పెట్టిన తండ్రి

AP: కాకినాడ జిల్లా ఒమ్మంగిలో దారుణం చోటుచేసుకుంది. ఆటో సీటు చింపాడని పక్కింటి వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఓ తండ్రి తన ఏడేళ్ల కుమారుడిని ఇనుప చువ్వలతో కొట్టి, దారుణంగా వాతలు పెట్టాడు. ఊరి నుంచి వచ్చిన తన సోదరి చూసేటప్పటికి బాలుడు అపస్మారక స్థితిలో ఉండటంతో చుట్టుపక్కల వారిని పిలిచింది. చలించిపోయిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కాగా, బాలుడు చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాడు.

April 4, 2026 / 09:12 PM IST

బొలెరో ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

KKD: సామర్లకోట బ్రౌన్ పేట సెంటర్ సమీపంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పేకేటి బ్రహ్మం అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పిఠాపురం రహదారిలోని పెట్రోల్ బంకు వద్ద పశువులకు మేత పట్టుకుని వెళుతుండగా, బొలెరో వ్యాన్ ఆయనను ఢీకొట్టింది. స్థానికులు వెంటనే స్పందించి , ఆయనను సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

April 4, 2026 / 08:00 PM IST

విషాదం.. ముగ్గురు విద్యార్థులు గల్లంతు

AP: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బొబ్బర్లంక వద్ద గోదావరి నదిలో స్నానానికి దిగి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. వీరిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. మరో ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్థులు రాజమండ్రి జాంపేటకు చెందిన వారిగా గుర్తించారు.

April 4, 2026 / 06:07 PM IST

భారీ పేలుడు.. నలుగురు మృతి

దాద్రానగర్ హవేలీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సిల్వాస్సాలోని డెమానీ రోడ్డులో ఉన్న ఒక నైట్రోజన్ గ్యాస్ రీఫిల్లింగ్ గోడౌన్‌లో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ధాటికి గోడౌన్ పైకప్పు ఎగిరిపోవడమే కాకుండా, సిలిండర్ల ముక్కలు, ఇతర శిథిలాలు సమీపంలోని రహదారిపై పడ్డాయి. ఈ పేలుడు శబ్దంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

April 4, 2026 / 03:22 PM IST

దేశంలో దాడులకు కుట్ర..ఉగ్రముఠా అరెస్ట్

దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులకు కుట్ర పన్నిన ఉగ్రముఠాను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్తాన్ నిఘా సంస్థ ISIతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. లక్నో, గాజియాబాద్ తదితర ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించి పెద్ద ఎత్తున దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. విదేశాల నుంచి నిధులు పొందుతున్న ఓ సంస్థ వీరికి సహకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

April 4, 2026 / 03:02 PM IST

ఆర్టీసీ బస్సు ఢీకొని విద్యార్థిని మృతి

TG: హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్ 5లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు ముగ్గురు ప్రైవేట్ స్కూల్ విద్యార్థినులను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక విద్యార్థిని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

April 4, 2026 / 02:38 PM IST