ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన కార్యాలయాన్ని భారత్‌కు మార్చుకుంది. ఫ్లిప్‌కార్ట్ ఇంటర్నెట్‌ను గ్రూప్ ప్రధాన సంస్థగా మార్చే అంతర్గత పునర్నిర్మాణ ప్రక్రియకు కేంద్రం నుంచి అనుమతి లభించింది. వాల్‌మార్ట్ నేతృత్వంలోని ఈ సంస్థ, పూర్తి స్థాయి దేశీయ కంపెనీగా తదుపరి దశ వృద్ధి కోసం ఎదురుచూస్తోంది.
AP: రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే AP PGECET-2026 గడువు రేపటితో ముగియనుంది. ఎంఈ/ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మ్.డి కోర్సుల్లో చేరాలనుకునేవారు అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్ 28-30 తేదీల్లో పరీక్ష నిర్వహించనుండగా.. 15 నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
TG: రాష్ట్రంలో ఒకటి నుంచి ఐదో తరగతుల విద్యార్థులు ఏకంగా 68% మంది ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నారు. ఇందులో మొత్తం 42,25,256 మంది విద్యార్థులుండగా.. వారిలో 33,67,150 మంది ప్రైవేటు పాఠశాలల్లో చేరారు. ఏకీకృత జిల్లా పాఠశాల విద్యా సమాచారం(యూడైస్) 2025-26 గణాంకాల ప్రకారం.. ఒకటో తరగతిలో 6.23 లక్షల మంది ప్రవేశాలు పొందగా.. 4.40 లక్ష మంది ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నారు.
TG: రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. తొలి రోజు పరీక్షకు 99.65 శాతం విద్యార్థులు హాజరయ్యారు. రెగ్యులర్ విద్యార్థులు మొత్తం 5,17,197మంది రిజిస్టర్ చేసుకోగా, 5,15,374 మంది పరీక్ష రాశారు. 1,823మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదని అధికారులు వెల్లడించారు.
విమాన ప్రయాణికులకు ఆకాశ ఎయిర్ షాక్ ఇచ్చింది. పెరిగిన జెట్ ఇంధన ధరల నేపథ్యంలో ప్రతి టికెట్‌పై రూ.199 నుంచి రూ.1300 వరకు సర్‌ఛార్జీ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే ఇండిగో, ఎయిరిండియా సంస్థలు ధరలను పెంచగా, తాజాగా ఆకాశ ఎయిర్ కూడా అదే బాటలో చేరింది. దీంతో విమాన ప్రయాణం సామాన్యులకు మరింత భారం కానుంది.
TG: యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం నెలకొంది. మోత్కూరులో పదో తరగతి విద్యార్థి తండ్రి చనిపోయాడు. కానీ పది పరీక్షల దృష్ట్యా తండ్రి మరణాన్ని దిగమింగి పదోతరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థి హర్షవర్దన్ హాజరయ్యాడు.
ఏఐతో టెక్ రంగంలో ఉద్యోగాలు పోతాయనే ఆందోళనలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. తాజాగా ఫేస్‌బుక్ మాతృక సంస్థ మెటా భారీ ఎత్తున లేఆఫ్‌లకు సిద్ధమైనట్లు సమాచారం. దాదాపు 16 వేల మందిని ఉద్యోగాల్లో నుంచి తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఏఐలో పెట్టబడులను పెంచుతున్న నేపథ్యంలో ఉద్యోగుల సంఖ్యలో కోత పెట్టాలని మెటా భావిస్తున్నట్లు సమాచారం.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటక్నాలజీలో 10 సైంటిస్ట్-C గెజిటెడ్ గ్రూపు-A పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ డేట్. PhD, MD పాసైన 35 ఏళ్ల లోపు వారు అప్లై చేసుకునేందుకు అర్హులు. పరీక్ష పీజు రూ.2000. SC/ST/PwBD/ESM/మహిళలకు ఫీజు లేదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఎంపికైనవారికి నెలకు రూ.67,000-2,08,700 జీతం ఉంటుంది.
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL)లో 5 మెడికల్ ప్రొఫెసనల్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది. 3 మెడికల్ ఆఫీసర్, 2 Sr.మెడికల్ ఆఫీసర్ పోస్టులు అందుబాటులో ఉండగా.. MBBS, MD ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం గలవారు అర్హులు. రాతపరీక్ష(బెంగళూరులో), ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను తీసుకుంటారు. పోస్టును బట్టి ఏడాదికి రూ.12-15 లక్షల CTC ఉంటుంది.
TG: కాసేపట్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు తమ హాల్ టికెట్లను తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి. సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, కాలిక్యులేటర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. ప్రశ్నాపత్రం ఇవ్వగానే అన్ని ప్రశ్నలను ఒకసారి చదవండి. మీకు బాగా తెలిసిన సమాధానాలను ముందుగా రాయండి. పరీక్షా సమయంలో ప్రశాంతంగా ఉండండి. ALL THE BEST
హాకీ వరల్డ్ కప్ టోర్నీకి ఇప్పటికే బెర్తు ఖరారు చేసుకున్న భారత్.. ఇవాళ టోర్నీ క్వాలిఫయర్ ఫైనల్‌లో ఇంగ్లండ్‌ను ఢీకొననుంది. నిన్నటి సెమీస్‌లో ఇటలీపై 1-0 విజయంతో భారత్, మరో సెమీస్‌లో 2-0తో స్కాట్లాండ్‌ను చిత్తుచేసి ఇంగ్లండ్ తుదిపోరుకు దూసుకొచ్చాయి. ఇక ఇవాళ్టి ఫైనల్ పోరు హైదరాబాద్ GMC బాలయోగి స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.
చైనా విద్యుత్తు కార్ల తయారీ సంస్థ బీవైడీ.. తన ప్రీమియం మోడల్ డెంజా Z9జీటీను ఐరోపాలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ కారును 5 నిమిషాల్లోనే 10 నుంచి 70 శాతం వరకు ఛార్జ్ చేయొచ్చని సంస్థ తెలిపింది. -30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నా 20-97 శాతం ఛార్జింగుకు 12 నిమిషాలే పడుతుందని చెప్పింది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 800 కి.మీ వరకు ప్రయాణించవచ్చని పేర్కొంది.
విమాన ప్రయాణికులకు ఇండిగో విమానయాన సంస్థ షాక్ ఇచ్చింది. పెరిగిన జెట్ ఇంధన ధరల ప్రభావంతో ఫ్యూయల్ సర్‌ఛార్జీని పెంచుతున్నట్లు ప్రకటించింది. రేపటి నుంచి అన్ని దేశీయ, అంతర్జాతీయ సర్వీసులపై ఈ అదనపు భారం పడనుంది. ఇప్పటికే ఎయిరిండియా సర్‌ఛార్జీ విధించగా, తాజాగా ఇండిగో కూడా అదే బాటలో పయనిస్తోంది. దీంతో విమాన ప్రయాణం మరింత భారం కానుంది.