ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్ పాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ తన కార్ల ధరలను పెంచనుంది. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్‌తో నడిచే తమ వాహన శ్రేణిపై 0.5 శాతం మేర ధరలను పెంచుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. మోడల్, వేరియంట్ ఆధారంగా ఏప్రిల్ 1 నుంచి పెంచిన ధరలు అమలులోకి వస్తాయని తెలిపింది. ఇప్పటికే కమర్షియల్ వాహన ధరలను రకాన్ని బట్టి 1.5 శాతం పెంచిన విషయం తెలిసిందే.
గల్ఫ్ దేశాల్లో యుద్ధ ప్రభావం భారత్‌లోని పెట్రోల్, డీజిల్ ధరలపై పడింది. ఇప్పటికే పవర్ పెట్రోల్ రూ.2.30 పెరగగా.. తాజాగా ఇండస్ట్రియల్ డీజిల్ ధర లీటర్‌పై ఏకంగా రూ.22 పెరిగింది. దీంతో ఇప్పటివరకు రూ.87.57గా ఉన్న ఇండస్ట్రియల్ డీజిల్.. ధర పెరగడంతో రూ.109.56కి చేరింది. అయితే సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలో ఎలాంటి మార్పు లేదు.
కస్టమర్లకు ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో షాక్ ఇచ్చింది. ఒక్కో ఆర్డర్‌కు ఫ్లాట్‌ఫామ్ ఫీజును రూ.2.40 మేర పెంచింది. దాంతో ఇప్పటి వరకు రూ.12.50లు ఉన్న ఫీజు రూ.14.90కి చేరింది.
దేశవ్యాప్తంగా పవర్ పెట్రోల్ ధరలు పెరిగాయి. ప్రీమియం పెట్రోల్‌పై లీటర్‌కు రూ.2.30 చమరు సంస్థలు పెంచాయి. దీంతో లీటర్ పవర్ పెట్రోల్ ధర రూ.115కు చేరింది. అలాగే సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు యథాతధంగా కొనసాగుతున్నాయి. గల్ఫ్ దేశాల్లో యుద్ధం కారణంగా చమురు దిగుమతులు తగ్గడంతో ఆయా సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.
AP: ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ ఎల్లుండి నుంచి జరగనున్నట్లు విజయనగరం RIO తవిటినాయుడు వెల్లడించారు. ముందుగా రేపటి నుంచే వాల్యుయేషన్ జరుగుతుందని ప్రకటించారు. అయితే ఎల్లుండి రంజాన్ పండుగ సందర్భంగా స్పాట్ వాల్యుయేషన్‌ను వాయిదా వేశారు. తొలిరోజు లాంగ్వేజెస్, మ్యాథ్స్, హిస్టరీ, ఎకనామిక్స్, స్పెల్-1 ఒకేషనల్ పేపర్ల మూల్యాంకనం జరగనుంది.
TG: హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న వారికి కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. HRA మినహాయింపు పరిమితిని 50 శాతానికి పెంచింది. పాత ఐటీ చట్టం-1961 స్థానంలో.. కొత్త ఐటీ చట్టాన్ని ప్రభుత్వం అమల్లోకి తెస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఏప్రిల్ 1 నుంచి రాబోయే కొత్త నిబంధనలను నోటిఫై చేసింది. 2027 జులైలో ఫైల్ చేయబోయే రిటర్నుల సమయంలో ఇది వర్తిస్తుంది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు ఇవాళ పతనమయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఏకంగా రూ.5,000 తగ్గి, ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,60,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా దాదాపు ఇవే ధరలు అమల్లో ఉన్నాయి. తగ్గిన వెండి ధర కొనుగోలుదారులకు కాస్త ఊరటనిచ్చింది. వెండి ఆభరణాలు లేదా కాయిన్స్ కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి సమయమని నిపుణులు చెబుతున్నారు.
సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 19 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 23తో ముగియనుంది. జనరల్ మేనేజర్, మేనేజర్, సీనియర్ ఇంజినీర్, సీనియర్ కన్సల్టెంట్ తదితర పోస్టులు ఉండగా.. రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్య్వూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
అంతర్జాతీయ మార్కెట్లో భారత రూపాయి విలువ రికార్డు స్థాయికి పడిపోయింది. ఇవాళ్టి ట్రేడింగ్‌లో డాలర్‌తో పోలిస్తే రూపాయి 19 పైసలు క్షీణించి, చరిత్రలో తొలిసారిగా రూ.93.08కి చేరింది. ముడి చమురు ధరల పెరుగుదల, గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావంతో రూపాయిపై ఒత్తిడి పెరుగుతోంది. రూపాయి బలహీనపడటం వల్ల దిగుమతులు ప్రియమై, ద్రవ్యోల్బణం పెరిగే ముప్పు పొంచి ఉంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 795 పాయింట్లు లాభపడి 75,156.58 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 251 పాయింట్ల లాభంతో 23,289.05 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.92.92గా ఉంది.
రిలయన్స్ జియో ఆకర్షణీయమైన వార్షిక ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. రూ.3,599 రీఛార్జ్‌తో ఏడాది పాటు టెలికాం సేవలు, రూ.35,100 విలువైన గూగుల్ జెమిని ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తుంది. ఈ ప్లాన్ కింద 365 రోజుల వాలిడిటీ లభిస్తుంది. ప్రతిరోజూ 2.5GB హైస్పీడ్ డేటా, దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు ఉచితంగా పొందవచ్చు.
నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్(NBCC) 60 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. మేనేజర్, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్, ఇంజినీర్ తదితర పోస్టులు ఉండగా.. డిప్లొమా, డిగ్రీ/MBA/MSW/PG/CS ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం గలవారు ఏప్రిల్ 5 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి నెలకు రూ.27000-2,40,000 చెల్లిస్తారు. పరీక్ష ఫీజు రూ.1000. SC/ST/దివ్యాంగులకు మినహాయింపు కలదు.
ఈ ఏడాది జనవరిలో మొత్తం టెలికాం సబ్‌స్క్రైబర్ల సంఖ్య 78.6 లక్షలు పెరిగి 131.4 కోట్లకు చేరిందని ట్రాయ్ డేటా విడుదల చేసింది. ఇందులో వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్ల వాటానే 75.7 లక్షలు పెరిగి 126.6 కోట్లకు చేరింది. ఎయిర్‌టెల్ 44 లక్షల మంది కొత్త కస్టమర్లను సాధించగా, ఆ తర్వాత స్థానంలో 24.4 లక్షలతో జియో నిలిచింది. BSNL 2.71 లక్షల మంది వినియోగదారులను చేర్చుకుంది.
విశాఖలోని హోమీ భాభా క్యాన్సర్ హస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్(HBCH&RC)లో 14 పోస్టులకు అప్లికేషన్ ప్రక్రియ ఇవాళ సాయంత్రం 5:30 గంటలకు ముగియనుంది. పోస్టును అనుసరించి BSc, PG, MD, DNB, DMలో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం గలవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. పరీక్ష ఫీజు రూ.300. SC/ST/PwBD/ESM/మహిళలకు ఫీజు లేదు.
AP: రంజాన్ పండుగ తేదీ మార్పుతో మార్చి 21న సెలవు ప్రకటించారు. దీంతో ఆ రోజు జరగాల్సిన పదో తరగతి ఇంగ్లీష్ పరీక్షను ఏప్రిల్ 2వ తేదీకి (ఉ.9:30 – 12:45) వాయిదా వేశారు. అదేవిధంగా ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షను కూడా మార్చి 21 నుంచి 25వ తేదీకి మార్చారు. విద్యార్థులు ఈ మార్పును గమనించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.