TG: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU)కి మరోసారి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలను విశ్లేషించే క్యూఎస్(క్వాక్వారెల్లి సైమండ్స్) సంస్థ విడుదల చేసిన ‘వరల్డ్ యూనివర్సిటీ బై సబ్జెక్ట్’ 2026 సంచికలో HCUలో నిర్వహిస్తున్న 7 సబ్జెక్టులకు ర్యాంకులు లభించాయి. 2026 గణాంకాల ప్రకారం దేశంలోని 99 సంస్థల్లోని 529 సబ్జెక్టులకు క్యూఎస్ ర్యాంకులు లభించాయి.
పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.వేల కోట్ల మేర మోసగించిన కేసులో ప్రధాన నిందితుడైన నీరవ మోదీకి యూకే కోర్టు షాక్ ఇచ్చింది. తనను భారత్‌కు అప్పగించాలన్న ఆదేశాలను సవాలు చేస్తూ వేసిన రివిజన్ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ కేసులో మళ్లీ విచారణ చేపట్టే పరిస్థితులు కనిపించడం లేదని తెలిపింది. దీంతో అతడిని భారత్‌కు తీసుకొచ్చేందుకు మార్గం సుగమమైంది.
యుద్ధ మేఘాలు తొలగిపోతున్నాయన్న సంకేతాలతో భారత స్టాక్ మార్కెట్లు నిన్న రికార్డు స్థాయిలో రాణించాయి. కేవలం 2 రోజుల్లోనే ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ.15.80 లక్షల కోట్లు పెరిగింది. బుధవారం సెన్సెక్స్ 1,205 పాయింట్లు, నిఫ్టీ 394 పాయింట్లు ఎగబాకాయి. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం, అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులు దీనికి ప్రధాన కారణం. శ్రీరామ నవమి సందర్భంగా ఇవాళ మార్కెట్లకు సెలవు.
దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో భారీగా కొలువుల భర్తీకి RRB రంగం సిద్ధంచేసింది. 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు ప్రకటన ఇచ్చింది. జోన్ల వారీగా సికింద్రాబాద్(SCR)లో 674 పోస్టులు ఉండగా.. ఆసక్తి, అర్హత గలవారు మే 15-జూన్ 14 మధ్య అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ ఆధారంగా ఏజ్‌లో సడలింపు కలదు. సైట్: https://www.rrbapply.gov.in/
AP: రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు & ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 284 పోస్టులను భర్తీ చేయనున్నట్లు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఏపీ ప్రకటించింది. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో MD/MS లేదా DNB ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా ఏపీ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ శాంసంగ్.. A37 5జీ పేరిట స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత శాంసంగ్ వన్ యూఐ 8.5, 6.7 అంగుళాల FHD+ సూపర్ అమోలెడ్+ డిస్ ప్లే, 120Hz, వెనక వైపు 50MP+ 08 MP+ 05MP కెమెరా, 12 MP సెల్ఫీ కెమెరా, 5,000mah బ్యాటరీ, IP68 రేటింగ్‌తో వస్తుంది. 8GB+128GB వేరియంట్ ధరను రూ.41,999గా కంపెనీ నిర్ణయించింది.
ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం స్విగ్గీ తన సేవలను సులభతరం చేయనుంది. ఈ మేరకు సర్వం ఏఐ అసిస్టెంట్ ‘ఇండస్’ ద్వారా వాయిస్ కమాండ్స్‌తో ఆర్డర్ పెట్టుకోవచ్చు. స్విగ్గీ, క్విక్ కామర్స్ విభాగమైన ఇన్‌స్టామార్ట్, డైనవుట్ యాప్‌లలో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. హిందీ, తెలుగు, బెంగాళీ వంటి 11 స్థానిక భాషల్లో వాయిస్ మోడల్స్‌ను ట్రైన్ చేశారు.
ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ శాంసంగ్.. A57 5జీ పేరిట స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత శాంసంగ్ వన్ యూఐ 8.5, 6.7 అంగుళాల FHD+ సూపర్ అమోలెడ్+ డిస్ ప్లే, 120Hz, వెనక వైపు 50MP+ 12 MP+ 05MP కెమెరా, 12 MP సెల్ఫీ కెమెరా, 5,000mah బ్యాటరీ, IP68 రేటింగ్‌తో వస్తుంది. 8GB+256GB వేరియంట్ ధరను రూ.56,999గా కంపెనీ నిర్ణయించింది.
యుద్ధం నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయాలా? వద్దా? అనే ప్రశ్నపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బంగారం పెరుగుదలని ‘హెడ్‌లైన్ రిస్క్ వోలాటిలిటీ’గా నిపుణులు నవీన్ అభివర్ణించారు. భౌగోళిక ఉద్రిక్తతలు సాధారణంగా బంగారాన్ని పెంచుతాయని.. కానీ ఈసారి లిక్విడిటీ ఒత్తిడి కారణంగా పెట్టుబడిదారులు బంగారం అమ్మి నగదు సమకూర్చుకుంటున్నారని డాక్టర్ రెనిషా అభిప్రాయపడ్డారు.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్ ఫ్లస్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫిసర్ రాబిన్ లియూ తన పదవికి రాజీనామా చేశారు. అంతర్జాతీయ స్థాయిలో కంపెనీ తన వ్యాపారాన్ని విస్తరించాలని భావిస్తున్న తరణంలో ఈ పరిణామం గమనార్హం. ఈ సందర్భంగా కంపెనీకి రాబిన్ చేసిన సేవలను వన్ ప్లస్ కొనియాడింది. ఆయన రాజీనామాతో కంపెనీ కార్యకలాపాలు నిలిచిపోతాయని వస్తున్న వార్తలను వన్ ఫ్లస్ ఖండించింది.
TGPSC నిర్వహిస్తున్న వన్ టైమ్ రిజిస్ట్రేషన్(OTR) అప్‌డేట్ చేసుకునే గడువును మరోసారి పెంచుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇవాళ్టితో ఈ గడువు ముగియనుండగా.. అభ్యర్థులు సౌకర్యార్థం ఏప్రిల్ 10 వరకు పెంచుతూ ప్రకటన విడుదల చేశారు. ఇదే చివరి అవకాశమని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో అప్లై చేసుకునే ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే OTR నమోదు తప్పనిసరి.
బెట్టింగ్ యాప్ కేసులో కీలక ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఈ కేసులో కీలక నిందితుడైన సౌరభ్ చంద్రశేఖర్‌కు సంబంధించిన దాదాపు రూ.1700 కోట్ల ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ వెల్లడించింది. ఇందులో అనేక విల్లాలు, ఖరీదైన నివాసాలు ఉన్నట్లు తెలిపింది. అటాచ్ చేసిన వాటిల్లో దుబాయ్‌లోని ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫాలో ఉన్న ఓ విల్లా కూడా ఉన్నట్లు పేర్కొంది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నిర్వహిస్తున్న వన్ టైమ్ రిజిస్ట్రేషన్(OTR) అప్‌డేట్ చేసుకునేందుకు ఈరోజే చివరి తేదీ. అభ్యర్థులంతా ఈరోజు రాత్రిలోగా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఇందులో, మీ వివరాలను, డాక్యుమెంట్స్‌ను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. భవిష్యత్తులో వచ్చే లేదా అప్లై చేసుకునే ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే OTR నమోదు తప్పనిసరి.
పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం వేసవి షెడ్యూల్ విమాన సర్వీసులపై ఉంటుందని ఇండిగో అంచనా వేస్తోంది. అంతర్జాతీయ సర్వీసుల్లో మార్పులు తప్పవని తెలిపింది. విమాన ఇంధనం ధరతో పాటు ఇతర వ్యయాలు కూడా అధికమై, టికెట్ల ధరలను పెంచితే గిరాకీ తగ్గొచ్చని పేర్కొంది. కాగా, ఏప్రిల్‌లో దేశీయంగా రోజుకు 2,000 వరకు సర్వీసులను ఇండిగో నిర్వహించనుంది.
ఫిన్‌టెక్ కంపెనీ క్రెడ్ తన యాప్‌లో కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్, IOS యూజర్లకు ఫేస్ లేదా ఫింగర్ ప్రింట్ వినియోగించి రూ.5 వేలు వరకు చెల్లింపులు చేసుకునే వెసులుబాటు కల్పించింది. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులు, యుటిలిటీ పేమెంట్స్, మర్చంట్ లావాదేవీలు, వ్యక్తులకు నగదు పంపించేంటప్పుడు ఈ బయోమెట్రిక్ సదుపాయం పనిచేస్తుందని క్రెడ్ వెల్లడించింది.