• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అంబేడ్కర్ సర్కిల్లో స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర

KRNL: ఆలూరు అంబేడ్కర్ సర్కిల్లో శనివారం స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం జరిగింది. టీడీపీ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి పాల్గొని పరిసరాల పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరించారు. స్వచ్ఛమైన గ్రామాలు, పట్టణాలే ఆరోగ్యకర సమాజానికి పునాది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పారిశుధ్య కార్మికులు, ప్రజలు పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు.

February 21, 2026 / 02:01 PM IST

పరిశుభ్రతే ప్రగతికి సోపానం: ఏఆర్ అదనపు ఎస్పీ

KDP: శనివారం కడప పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఆర్ అదనపు ఎస్పీ బి. రమణయ్య మాట్లాడుతూ.. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడమే ఆరోగ్యకర సమాజానికి పునాది అని నొక్కి చెప్పారు. అనంతరం పోలీసు సిబ్బందితో స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎ, ఆర్ఎస్ఐ, ఇతర ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.

February 21, 2026 / 02:01 PM IST

ఎల్లారమ్మ జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు: DM

VZM: జామి ఎల్లారమ్మ తీర్ధ యాత్రి నేపథ్యంలో ఈనెల 24 నుంచి 8 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఎస్‌.కోట RTC DM కే.సుదర్శనరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఈ బస్సులను సాధారణ పల్లె వెలుగు ఛార్జీలతో నడపనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రత్యేక బస్సులను కొత్తవలస-జామి, జామి-కొత్తవలసకు ఉదయం 5:30 గంటలు నుంచి నడపనున్నట్లు పేర్కొన్నారు.

February 21, 2026 / 02:00 PM IST

నేర సమీక్ష సమావేశం నిర్వహించిన సీఐ

ప్రకాశం: వై.పాలెం సర్కిల్ కార్యాలయంలో సీఐ ఆధ్వర్యంలో శనివారం నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్కిల్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల ప్రగతిని గురించి సీఐ సమీక్షించారు. ముఖ్యంగా సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఎస్సైలు పాల్గొన్నారు.

February 21, 2026 / 01:49 PM IST

హిందువులు మనోభావాలను దెబ్బతీయటమే వైసిపి లక్ష్యం

PPM: రాష్ట్రంలో హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా కనిపిస్తోందని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ఆక్షేపించారు. పార్వతీపురం టీడీపీ కార్యాలయంలో కూటమి నాయకులతో కలసి మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నాయకుల వైఖరి పై నిప్పులు చెరిగారు. శుక్రవారం మండలిలో ఆ పార్టీ ఎమ్మెల్సీలు వ్యవహరించిన తీరును రాష్ట్ర ప్రజలందరూ చీత్కరిస్తున్నారని అన్నారు.

February 21, 2026 / 01:42 PM IST

ప్రజాస్వామ్యంపై బీజేపీ దాడిని ఖండిద్దాం

VZM: ఢిల్లీ ఏఐ సమ్మిట్‌లో చైనా రోబోను స్వదేశీ తయారీగా చూపిస్తూ దేశ ప్రతిష్టను దిగజార్చిన వైనంపై శాంతియుతంగా నిరసన తెలిపిన యువజన కాంగ్రెస్ నాయకులపై, కార్యకర్తలపై బీజేపీ మూకలు దాడులకు దిగారు. ఇది అత్యంత హేయమైన చర్య అని విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ అన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ దాడిని తీవ్రంగా ఖండించారు.

February 21, 2026 / 01:41 PM IST

సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న హైకోర్టు జస్టిస్

శ్రీకాకుళం పట్టణంలో ఉన్న అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామిని ఏపీ హైకోర్టు జస్టిస్ హరినాథ్ శనివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, ఈవో ప్రసాద్ ఘన స్వాగతం పలికారు. తదుపరి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయించారు. ఆయనకు స్వామి వారి తీర్థ ప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు. ఆయన వెంట జిల్లా న్యాయమూర్తులు ఉన్నారు.

February 21, 2026 / 01:32 PM IST

‘ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి’

SKLM: ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి, వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ మార్చి 5న విజయవాడలో జరిగే మహా ధర్నాను విజయవంతం చేయాలని ఎపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు డి. ధనలక్ష్మి అన్నారు. శనివారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఆశాలకు కనీస వేతనం పెంచాలన్నారు.

February 21, 2026 / 01:29 PM IST

‘స్వచ్ఛ రథం’ ప్రారంభించిన ఎమ్మెల్యే

NDL: ప్యాపిలి మండల పరిష్యత్ కార్యాలయంలో శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి పాల్గొని ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ కోసం ప్రత్యేక స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు. ‘తుక్కు ఇవ్వండి సరకులు తీసుకోండి’ అనే నినాదంతో ఈ రథం ఇంటింటికీ వెళ్లి ప్లాస్టిక్ సేకరిస్తుందని తెలిపారు. నిత్యావసర సరుకుల గురించి వివరించారు.

February 21, 2026 / 01:29 PM IST

స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

PLD: పిడుగురాళ్లలో శనివారం నిర్వహించిన ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. స్వయంగా రోడ్లను శుభ్రం చేసిన ఆయన, పరిసరాలు బాగుంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు.

February 21, 2026 / 01:28 PM IST

‘టీడీపీ బలోపేతానికి కృషి చేస్తాం’

KRNL: టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అధ్యక్షతన శనివారం జిల్లాలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ పెద్దకడబూరు టీడీపీ మండల అధ్యక్షులు మల్లికార్జున, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి మొట్రు రామాంజనేయులు హాజరయ్యారు. పెద్దకడబూరు మండలంలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తామని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషి చేస్తామన్నారు.

February 21, 2026 / 01:28 PM IST

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన మంత్రి

BPT: సంతమాగులూరు మండలం పుట్టవారిపాలెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ జరిగింది. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని అద్దంకి, సంతమాగులూరు, బల్లికురవ మండలాలకు చెందిన 85 మంది లబ్ధిదారులకు రూ. 50,95,248 విలువైన చెక్కులను అందజేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పేర్కొన్నారు.

February 21, 2026 / 01:27 PM IST

పరిసరాల శుభ్రత కార్యక్రమం

KDP: జిల్లా ఎస్పీ విశ్వనాథ్ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ మూడవ శనివారం చేపట్టే ఈ కార్యక్రమంలో సి.ఐలు,ఎస్.ఐలు,సిబ్బంది పాల్గొని స్టేషన్లు,పరిసరాలను శుభ్రం చేశారు.చెత్త తొలగింపు,పిచ్చి మొక్కల నిర్మూలనతో పాటు స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు.

February 21, 2026 / 01:26 PM IST

బడి రుణం తీర్చుకున్నారు..!

W.G: అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా ఆకివీడు పులవర్తి లక్ష్మణస్వామి జడ్పీ హైస్కూల్లో శనివారం సౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించారు. 1984-85 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు రూ.80,000 వ్యయంతో దీనిని పాఠశాలకు కానుకగా ఇచ్చారు. ప్రధానోపాధ్యాయుడు పాఠనాయుడు విద్యార్థుల సమక్షంలో దీనిని ప్రారంభించి, పూర్వ విద్యార్థుల సేవా గుణాన్ని అభినందించారు.

February 21, 2026 / 01:25 PM IST

నందిగామలో స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం

ఎన్టీఆర్: నందిగామ పట్టణంలోని ఏడో వార్డులో శనివారం స్వచ్ఛంద – స్వర్ణాంధ్ర కార్యక్రమం భాగంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ అధికారులు, పారిశుధ్య కార్మికులతో కలిసి వీధిలో శుభ్రత, చెత్త తొలగింపు కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యమైనవని పేర్కొన్నారు.

February 21, 2026 / 01:24 PM IST