• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

జగన్ ముఖ్యమంత్రి కావాలని పాదయాత్ర

E.G: మాజీ సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావాలంటూ క్రైస్తవ సోదరులు రాష్ట్ర ఇంటెలెక్చువల్ విభాగం కార్యదర్శి కొడమంచిలి హరీష్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టిన సంగతి విదితమే. రావులపాలెంలో వైసీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఆదివారం నాటికీ గుణదల వరకు సాగనుంది. కూటమి పాలంలో ప్రజలు విసుగు చెందారని రాబోయేది మరల YS జగన్ అని సుధాకర్ అన్నారు.

February 22, 2026 / 06:20 PM IST

భీమవరంలో ఉగాది వేడుకల బ్రోచర్ ఆవిష్కరణ

WG: మన సంస్కృతి సాంప్రదాయాలు చెరగని ముద్రలని, ఉగాది సంక్రాంతి, దసరా లాంటి పండుగలు మన సంప్రదాయ పండుగలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఈ మేరకు ఆదివారం మార్చి 19న శ్రీభీమేశ్వర స్వామి దేవస్థానంలో జరిగే ఉగాది పురస్కార వేడుకల బ్రోచర్‌ను ఎమ్మెల్యే భీమవరం కార్యాలయంలో ఆవిష్కరించి మాట్లాడారు.

February 22, 2026 / 06:18 PM IST

రేపు చిత్తూరులో పోలీస్ పబ్లిక్ గ్రీవెన్స్

చిత్తూరు జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో “పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్” కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ కార్యాలయం తెలిపింది. రేపు ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులను పోలీస్ ఉన్నతాధికారులకు నేరుగా తెలియజేసే అవకాశం ఉంటుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

February 22, 2026 / 06:16 PM IST

కార్యకర్తను పరామర్శించిన ప్రభుత్వ విప్

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జోన్-1 కోఆర్డినేటర్‌గా ఉన్న నాగేశ్వరరావు హార్ట్ స్ట్రోక్‌కు గురై మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

February 22, 2026 / 06:15 PM IST

మున్సిపల్ కమిషనర్‌కు సన్మానం

NDL:  డోన్ మున్సిపల్‌లో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ మున్సిపల్ కార్మికులు, సీఐటీయు నాయకులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా ఆదివారం సన్మానించారు. గతంలో తప్పుగా రిటైర్మెంట్ లిస్ట్‌లో వచ్చిన కార్మికురాలు వెంకటలక్ష్మీ ఉద్యోగంలో తిరిగి చేరడం, కార్మికుల సమస్యలకు కమిషనర్ తక్షణ స్పందనకు ధన్యవాదాలు తెలిపారు.

February 22, 2026 / 06:15 PM IST

రుషికొండ బీచ్‌లో మెగా క్లీనింగ్‌

విశాఖలోని రుషికొండ బీచ్ వద్ద ఆదివారం మెగా బీచ్ క్లీనింగ్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని పలు పాఠశాలల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్లూఫ్లాగ్, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ స్వచ్ఛత కార్యక్రమంలో సుమారు 400 మంది భాగస్వామ్యమై బీచ్ పరిసరాల్లో ఉన్న వ్యర్థాలను తొలగించారు.

February 22, 2026 / 06:11 PM IST

‘పెండింగ్ కేసులు పరిష్కరించాలి’

ASR: అరకులోయ పోలీస్ స్టేషన్‌ను ఆదివారం పాడేరు డీఎస్పీ అభిషేక్ సందర్శించి, రికార్డులను పరిశీలించారు. ఈ మేరకు పెండింగ్ కేసులను పూర్తి చేయాలని డీఎస్పీ ఆదేశించారు. గంజాయి సాగు, రవాణా నియంత్రణకు చర్యలు చేపట్టాలని, రహదారి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఐ ఎల్ హిమగిరి, ఎస్సై జీ గోపాలరావులను ఆదేశించారు. వాహన తనిఖీలు పటిష్టంగా చేపట్టాలని అన్నారు.

February 22, 2026 / 06:10 PM IST

జిల్లాలో ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

అనంతపురం జిల్లాలో రేపటి నుంచి ప్రారంభంకానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు 64 కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి వెంకటరమణ నాయక్ తెలిపారు. విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని, సామాజిక మాధ్యమాల్లో వచ్చే పుకార్లను నమ్మవద్దని సూచించారు. సందేహాల నివృత్తి కోసం 08554 277626 నంబర్‌తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.

February 22, 2026 / 06:10 PM IST

వేదనారాయణ స్వామి సేవలో ఎమ్మెల్యే

TPT: నాగలాపురంలోని శ్రీ వేదవల్లి సమేత వేదనారాయణ స్వామివారిని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో నిర్వహించిన మహా కుంభాభిషేక వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు కుంభాభిషేక మంత్రజలంతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.

February 22, 2026 / 06:09 PM IST

అంగన్వాడీల సమస్యలపై రిలే నిరాహార దీక్షలు

KRNL: అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ఈనెల 23-27 వరకు రాష్ట్రవ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు సీఐటీయూ మండల ప్రధాన కార్యదర్శి రవిచంద్ర ఇవాళ తెలిపారు. వేతనాల పెంపు,మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చడం,పని భారం తగ్గించడం,అదనపు యాపుల తొలగింపు,లేబర్ కోడ్ల రద్దు వంటి డిమాండ్లపై బడ్జెట్ సమావేశాల్లో చర్చించి న్యాయం చేయాలిన్నారు.

February 22, 2026 / 06:08 PM IST

పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి: ఎమ్మెల్యే

కాకినాడ తీర ప్రాంతాన్ని రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందే పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తనవంతు కృషి ఎప్పుడూ కొనసాగుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. శనివారం కాకినాడ స్థానిక బీచ్‌లో ఎస్కేర్ గోకార్టింగ్ ఆధ్వర్యంలో బీచ్ సందర్శకుల కోసం ప్రత్యేక ఆకర్షణగా హెలికాప్టర్ సేవలను ప్రారంభించారు.

February 22, 2026 / 06:03 PM IST

గరుడాచలం నాయుడు సేవలు చిరస్మరణీయం

BPT: బాపట్లలో పేరం గరుడాచలం నాయుడు సేవలను ప్రముఖులు కొనియాడారు. ఆదివారం తూర్పు సత్రం వద్ద ఆయనకు నివాళులర్పించారు. పేదల కోసం ఆస్తినంతా దానం చేసిన ఆయన జీవితం ఆదర్శనీయమన్నారు. చీలు రోడ్ సెంటర్‌లో ఆయన విగ్రహం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే నరేంద్ర వర్మను, తులసి రామచంద్ర ప్రభు, ఉగ్గిరాల సీతారామయ్య అభినందించారు. ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తామని తెలిపారు.

February 22, 2026 / 06:02 PM IST

ఒకే రోజు 26 మందికి పదోన్నతులు

NLR: సమర్థవంతంగా పని చేస్తూ జిల్లాను ప్రగతి పథంలో నిలపాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న 26 మందికి వివిధ హోదాలలో పదోన్నతులు కల్పిస్తూ ప్రొసీడింగ్‌ను కలెక్టర్ అందించారు. సీనియర్ అసిస్టెంట్ నుంచి ఆర్ఎస్ఐలుగా 8మంది, గ్రేడ్-1 గ్రామ రెవెన్యూ అధికారుల నుంచి సీనియర్ అసిస్టెంట్ హోదా కల్పిస్తూ 18 మందికి ఉత్తర్వులు జారీ చేశారు.

February 22, 2026 / 06:00 PM IST

శానిటేషన్ బ్లాక్‌ను ప్రారంభించిన మంత్రి దుర్గేశ్

E.G: నిడదవోలు బాలికల ఉన్నత పాఠశాలలో నెస్లే సంస్థ CSR నిధులతో నిర్మించిన శానిటేషన్ బ్లాక్‌ను మంత్రి కందుల ప్రారంభించారు. విద్యార్థినుల ఆరోగ్యం, పరిశుభ్రత, భద్రతకు మౌలిక వసతులు కీలకమని ఆయన పేర్కొన్నారు. పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెబుతూ.. నెస్లే సంస్థ సామాజిక బాధ్యతను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

February 22, 2026 / 06:00 PM IST

‘మద్యం అమ్మకాలపై నియంత్రణ పాటించాలి’

SKLM: గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు నియంత్రించాలని పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు మండల పరిషత్ సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఆదివారం పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం పలువురు మద్యం దుకాణాల్లో సిండికేట్లు ఇష్టారాజ్యముగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశానికి ఎక్సైజ్ అధికారులు ఎవరూ హాజరు కాకపోవడంతో సభ్యులు అసహనం వ్యక్తపరిచారు.

February 22, 2026 / 05:57 PM IST