• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘లైసెన్సుల కోసం మధ్యవర్తులను ఆశ్రయించవద్దు’

కోనసీమ: లెర్నింగ్, డ్రైవింగ్ లైసెన్సుల కోసం మధ్యవర్తులను ఆశ్రయించవద్దని జిల్లా రవాణాధికారి డి.శ్రీనివాసరావు సూచించారు. అమలాపురం రవాణా శాఖ కార్యాలయంలో బుధవారం జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. అభ్యర్థులు నేరుగా కార్యాలయానికి రావాలని కోరారు. పరివాహన్ వెబ్‌సైట్లో స్లాట్ బుక్ చేసుకున్న వారికి ఎంవీఐ సమక్షంలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

February 25, 2026 / 03:01 PM IST

గుంటూరు జెడ్పీలో కేంద్ర అధికారి పర్యటన

GNTR: గుంటూరు జిల్లాలో కేంద్ర పంచాయతీరాజ్ అదనపు కార్యదర్శి సుశీల్ కుమార్ లోహాని బుధవారం పర్యటించారు. జెడ్పీ ఛైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా ఆయనకు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. అనంతరం పీఆర్ కమిషనర్ కృష్ణతేజతో కలిసి జెడ్పీ ఆవరణలో నిర్మిస్తున్న డీపీఆర్సీ భవనాన్ని ఆయన పరిశీలించారు. అక్కడ ఛైర్‌పర్సన్ క్రిస్టినాతో కలిసి ఆయన మొక్కను నాటారు.

February 25, 2026 / 03:01 PM IST

వైసీపీ జిల్లా అధికార ప్రతినిధిగా బాష నియామకం

అన్నమయ్య: రాయచోటికి చెందిన గాజుల హజీ బాషను వైసీపీ జిల్లా అధికార ప్రతినిధిగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా హజీ బాష మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాధరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

February 25, 2026 / 02:57 PM IST

టెన్త్ క్లాస్ విద్యార్థులకు పరీక్ష సామగ్రి పంపిణీ

TPT: గూడూరు మండల పరిధిలోని కొండ గుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, అయ్యవారి పాలెం పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం పరీక్ష సామగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్ర శేఖర్ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని ఎంచుకుని సాధించే దిశగా పయనం సాగించాలన్నారు.

February 25, 2026 / 02:55 PM IST

‘బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి’

SKLM: డయేరియా బాధితులకు మరింత మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ జెమ్స్ ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు. జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న డయేరియా బాధితులను బుధవారం ఆయన సందర్శించారు. అన్ని హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న వారిలో బుధవారం 13 మందిని డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు.

February 25, 2026 / 02:51 PM IST

రాష్ట్ర అధ్యక్షుడిని కలిసిన జిల్లా అధ్యక్షురాలు

KRNL: విజయవాడలో TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును జిల్లా TDP అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో పార్టీ పరిస్థితులు, సంస్థాగత బలోపేతం, స్థానిక సమస్యలు, రాబోయే కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. గ్రామ స్థాయి కమిటీలను చురుకుగా మార్చడం, నాయకులు–కార్యకర్తల సమన్వయాన్ని పెంపొందించడం వంటి అంశాలపై చర్చించారు.

February 25, 2026 / 02:47 PM IST

అనుమతులు తెచ్చింది TDPనే: మంత్రి బీసీ

NDL: భోగాపురం ఎయిర్ పోర్టుకు అనుమతులు తెచ్చింది TDPనే అని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. భోగాపురం విమానాశ్రయంపై మండలిలో ఇవాళ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సమాధానం చెప్పారు. విమానాశ్రయాన్ని కూటమి ప్రభుత్వం హైజాక్ చేసిందని YCP ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు పేర్కొన్నారు. ఓర్వకల్లు విమానాశ్రయాన్ని TDP ప్రభుత్వం నిర్మిస్తే వైసీపీ హైజాక్ చేసిందన్నారు.

February 25, 2026 / 02:42 PM IST

మాజీ ఎమ్మెల్యేతో మాజీ ఎమ్మెల్సీ భేటీ

W.G. నరసాపురం మాజీ ఎమ్మెల్యే, పశ్చిమగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షులు ముదునూరి ప్రసాదు రాజుని నరసాపురంలో బుధవారం మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు కలిశారు. తాజాగా మేక శేషుబాబుపై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ పార్టీ అధిష్టానం ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా పనిచేయాలని ఆయన కోరారు.

February 25, 2026 / 02:40 PM IST

అగ్ని ప్రమాదాలపై అవగాహన

AKP: మాడుగులలో అగ్నిమాపక అధికారి వీ. రాజేశ్వరరావు ఆధ్వర్యంలో బుధవారం పాఠశాల విద్యార్థులకు అగ్నిప్రమాదాలపై అవగాహన కల్పించారు. ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అగ్నిని నియంత్రించడం, తమతో పాటు ఇతరులను రక్షించడంపై డెమో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

February 25, 2026 / 02:40 PM IST

వినతులు స్వీకరించిన దెందులూరు ఎమ్మెల్యే

ELR: పెదవేగి(మం) దుగ్గిరాల టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బుధవారం పలు గ్రామాలకు చెందిన ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి వద్ద నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. అలాగే వాటిని పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తానని వారికి భరోసా ఇచ్చారు.

February 25, 2026 / 02:38 PM IST

అంగన్వాడీ భవనాలు మంజూరు చేయండి: పరిటాల సునీత

ATP: రాప్తాడు నియోజకవర్గంలో 55 నూతన అంగన్వాడీ భవనాలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే పరిటాల సునీత బుధవారం అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని కోరారు. అసంపూర్తిగా ఉన్న 32 భవనాలను పూర్తి చేయడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీల డిమాండ్లను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సభలో వివరించారు.

February 25, 2026 / 02:38 PM IST

షాపింగ్ మాల్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

VZM: శృంగవరపుకోట పోలీస్ స్టేషన్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ఓ షాపింగ్ మాల్‌ను ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్థానిక ప్రజలకు అందుబాటు ధరల్లో, అత్యాధునిక వస్త్ర శ్రేణిని, నగలను ఒకే చోట అందించేందుకు ఇలాంటి మాల్స్ రావడం శుభపరిణామమని పేర్కొన్నారు.

February 25, 2026 / 02:36 PM IST

ఈనెల 28వ తేదీన జాబ్ మేళా: కలెక్టర్

కృష్ణా: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు గన్నవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ 28వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ బాలాజీ బుధవారం తెలిపారు. జాబ్ మేళాలో వివిధ కంపెనీలు పాల్గొని, నిరుద్యోగులకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తాయని అన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

February 25, 2026 / 02:35 PM IST

ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో వైఎస్ జగన్

KDP: వేంపల్లి(మం) నందిపల్లెలోని నూతనంగా నిర్మించిన నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో బుధవారం మాజీ సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన రోడ్డు మార్గాన పులివెందులలోని తన నివాసానికి చేరుకొని మధ్యాహ్నం 2 గంటల వరకు తన నివాసంలో విశ్రాంతి తీసుకోనున్నారు.

February 25, 2026 / 02:31 PM IST

వ్యవసాయ సాగుపై రైతులకు అవగాహన

NLR: చేజర్ల మండలం ఏటూరు, వావిలేరులో మండల వ్యవసాయ అధికారి పీఎస్ హిమబిందు ఆధ్వర్యంలో బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదు ప్రయోజనాలను వివరించారు. గ్రామాల్లో సాగులో ఉన్న వరి పంట పొలాలను పరిశీలించి రైతులకు సలహాలు, సూచనలు అందించారు. సాయిల్ హెల్త్ కార్డు అవసరాన్ని రైతులకు తెలియజేశారు.

February 25, 2026 / 02:31 PM IST