• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఉచిత కంప్యూటర్ శిక్షణ ప్రారంభం

ASR: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్కిల్ హబ్‌లో ఉచిత కంప్యూటర్ శిక్షణ ప్రారంభించనున్నట్లు స్కిల్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్ ప్రసన్న కుమార్ తెలిపారు. ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లమా పూర్తి చేసిన యువతకు ఈ కోర్సులు అందుబాటులో ఉంటాయని, ప్రతి కోర్సుకు 30 సీట్లు కేటాయించామని, అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు.

February 25, 2026 / 07:07 AM IST

ఈనెల 27 నుంచి వెంకన్న వార్షిక కళ్యాణ మహోత్సవాలు

AKP: అనకాపల్లి దేవుని గుమ్మంలో వేంచేసియున్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఈనెల 27వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ బి. శ్రీనివాసరావు, ఈవో చంద్రతేజ తెలిపారు. 27 ఉదయం ధ్వజారోహణ, రాత్రి కళ్యాణ మహోత్సవం, 28న అన్న సమారాధన జరుగుతుందన్నారు. మార్చి1న అర్ధ ఏకాహం, 2న గరుడ వాహనంపై పురవీధుల్లో స్వామివారి ఊరేగింపు ఉంటుందన్నారు.

February 25, 2026 / 07:07 AM IST

జిల్లాలో తాగునీటి కొరత లేకుండా చూడాలి: కలెక్టర్

NDL: నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి, ఎక్కడా తాగునీటి కొరత లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. ఆళ్లగడ్డ, చాగలమర్రి, సంజామల, ఆత్మకూరు మండలాల్లో చేతిపంపుల మరమ్మతుల కోసం పంపిన ప్రతిపాదనలను త్వరితగతిన ఆమోదించి పనులు పూర్తి చేయాలన్నారు. వేసవి కాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.

February 25, 2026 / 07:06 AM IST

ఈనెల 28న సైన్స్ టాయ్ మేకింగ్ వర్క్‌షాప్

TPT: ఫిబ్రవరి 28న తిరుపతిలో జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా సైన్స్ టాయ్ మేకింగ్ వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. ప్రవేశం ఉచితం, కానీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని అధికారులు తెలిపారు. నమోదు కోసం https://linktr.ee/rsctpt లింక్‌ను సందర్శించాలన్నారు.

February 25, 2026 / 07:05 AM IST

బళ్లారి చౌరస్తా బైపాస్ పనుల పరిశీలన

కర్నూలు బళ్లారి చౌరస్తా బైపాస్‌లో జరుగుతున్న పనులను నగరపాలక సంస్థ కమిషనర్ పీ. విశ్వనాథ్ మంగళవారం పరిశీలించారు. రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ బస్సుల రాకపోకలకు ఆటంకంగా ఉన్న మలుపు వద్ద రెండు షాపులను తొలగిస్తామని, పోలీస్ అనుమతి రాగానే పనులు పూర్తి చేసి ట్రాఫిక్ సమస్యలు తీరుస్తామని కమిషనర్ తెలిపారు.

February 25, 2026 / 07:00 AM IST

కొలతల్లో తేడా వస్తే చర్యలు తప్పవు: కమిషనర్

E.G: రాజమండ్రిలోని ప్రతి నిర్మాణానికి ఆస్తి పన్ను విధించాలని కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. మంగళవారం రెవెన్యూ అధికారులతో కలిసి ప్రసాద్ ఆదిత్య మాల్, మెక్ డొనాల్డ్స్, ప్రకాశ్ నగర్ భవనాలను తనిఖీ చేశారు. నిర్మాణ విస్తీర్ణానికి అనుగుణంగా పన్ను వసూలు జరుగుతోందా లేదా అన్నది కొలతలు వేసి తనిఖీ చేశారు. పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం చేయవద్దని అధికారులను ఆదేశించారు.

February 25, 2026 / 07:00 AM IST

రూ.18 వేల వేతనంతో ఉద్యోగాలు

ATP: దక్షిణ మధ్య రైల్వే గుంతకల్లు డివిజన్‌లో ఖాళీగా ఉన్న 16 పాయింట్స్‌మెన్ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఎండీ రజాక్ తెలిపారు. అర్హులైన మాజీ సైనికులు వచ్చే నెల 6లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన వారికి నెలకు రూ.18 వేల వేతనంతో పాటు ఇతర భత్యాలు చెల్లిస్తామని పేర్కొన్నారు.

February 25, 2026 / 07:00 AM IST

మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్

W.G: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం భీమవరం కలెక్టరేట్ నుంచి మెడికల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని విభాగాల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినా, రోగుల పట్ల అలసత్వం ప్రదర్శించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

February 25, 2026 / 07:00 AM IST

మానసిక ఉల్లాసానికి క్రీడలు తోడ్పడతాయి

NTR: విజయవాడలో నిర్వహించిన ఏపీ లెజిస్లేచర్స్ స్పోర్ట్స్ మీట్‌లో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనమండలి స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. నిత్యం ప్రజల మధ్య ఉండే ప్రజాప్రతినిధులకు, క్రీడలు ఒక ఆటవిడవుగా ఉంటూ మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయని తెలిపారు.

February 25, 2026 / 07:00 AM IST

అథ్లెటిక్స్ పోటీల్లో 3వ స్థానం సాధించిన సునంద

కృష్ణా: మచిలీపట్నానికి చెందిన సీహెచ్. సునంద ఇటీవల మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌లో జరిగిన 45వ జాతీయస్థాయి అథ్లెటిక్ పోటీలలో పాల్గొని, 3వ స్థానం దక్కించుకున్నారు. ఈ సందర్భంగా గాంధీ నగర్‌లో గల ఉదయపు నడక మిత్రమండలి భవనంలో జిల్లా కలెక్టర్ క్రీడాకారిణి సునందను అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని బుధవారం ఆకాంక్షించారు.

February 25, 2026 / 06:52 AM IST

జనగణన – 2027 శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన జేసీ

సత్యసాయి: బీడుపల్లిలోని సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాలలో జనగణన – 2027పై మూడు రోజుల రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఈ శిబిరాన్ని ప్రారంభించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు జరిగే ఈ శిక్షణలో ఆర్డీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.

February 25, 2026 / 06:48 AM IST

ఆలయ పునర్నిర్మాణానికి భారీ విరాళం

VSP: పరవాడలో పైడిమాంబ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి పరవాడ బీసీ కాలనీకి చెందిన పైలా రాధాకృష్ణ దంపతులు రూ.1,00116 విరాళాన్ని ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం చెక్కును గ్రామ సర్పంచ్ ఎస్. అప్పలనాయుడు, పైల శ్రీనివాసరావుకు అందజేశారు. ఈ  కార్యక్రమంలో మాజీ సర్పంచులు పి. అప్పారావు, చుక్క రాము నాయుడు పాల్గొన్నారు.

February 25, 2026 / 06:45 AM IST

‘స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యంగా పనిచేయాలి’

AKP: స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యంగా పని చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్ లో స్వర్ణాంధ్ర-2047 ప్రణాళికకు సంబంధించి విజన్ యాక్షన్ ప్లాన్ పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్వర్ణాంధ్ర విజన్ లో భాగంగా పీ-4 విధానం అమలు జరుగుతుందన్నారు. అభివృద్ధి దిశగా అధికారులు కృషి చేయాలన్నారు. ప్రజలను అన్ని విధాల అభివృద్ధిలో తీసుకురావాలన్నారు.

February 25, 2026 / 06:39 AM IST

నరసాపురంలో ఐదుగురిపై కేసు నమోదు

W.G: నరసాపురం మండలం యర్రంశెట్టివారిపాలెంలో కూనపురెడ్డి సంజీవ్‌రావుపై దాడి చేసిన ఐదుగురిపై రూరల్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. రూరల్ ఎస్సై టీవీ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 22న ఆదివారం కుటుంబ కలహాల నేపథ్యంలో సంజీవ్‌రావుపై ఆయన కోడలు నవ్యరాణి, ఆమె బంధువులు కోటిపల్లి అబ్బాయి, సురేష్, రామకృష్ణ మరి కొందరితో కలిసి దాడికి పాల్పడ్డారు.

February 25, 2026 / 06:36 AM IST

నేడు నందిపల్లెకు రానున్న YS జగన్

KDP: మాజీ సీఎం వైయస్ జగన్ నేడు వేంపల్లి మండలంలోని నంది పల్లెకు రానున్నారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన నందీశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటారు. ఇప్పటికే ఆయన పులివెందుల చేరుకున్నారు. జగన్ రాకతో అన్ని ఏర్పాట్లను ఆలయ నిర్వాహకులు సిద్ధం చేశారు. తెల్లవారుజాము నుంచే పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారు.

February 25, 2026 / 06:36 AM IST