• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘మత్స్యకారులకు న్యాయం చేయాలి’

BPT: ఈపూరుపాలెం వద్ద ధ్వంసమైన సముద్ర ముఖద్వారాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పరిశీలించారు. పర్యాటక అభివృద్ధి పేరుతో మత్స్యకారుల పొట్టకొట్టడం దారుణమన్నారు. సముద్ర తీరాన్ని ధ్వంసం చేసిన శ్రీ భ్రమర ఇన్‌ఫ్రా యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. దొంగ పట్టాలను రద్దు చేసి, అక్రమ రిసార్టులను కూల్చివేయాలని డిమాండ్ చేశారు.

February 24, 2026 / 08:05 PM IST

ఇద్దరు బాలురను తల్లిదండ్రులకు అప్పగింత

CTR: కుప్పం రెసిడెన్షియల్ పాఠశాల నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలురను కుప్పం రూరల్ పోలీసులు 6 గంటల్లోనే గుర్తించి వారి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు. జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ దూడి, పోలీసు బృందం యొక్క వేగవంతమైన, సమర్థవంతమైన ప్రయత్నాలను అభినందించారు. తల్లిదండ్రులు సకాలంలో చర్య తీసుకున్నందుకు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

February 24, 2026 / 08:03 PM IST

‘పీఎంశ్రీ పథకంతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి’

ATP: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి పీఎంశ్రీ పథకం ఎంతో దోహదపడుతుందని కేంద్ర ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ సచ్చిదానంద ప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్‌లో జేసీ విష్ణుచరణ్‌తో కలిసి పీఎంశ్రీ పాఠశాలల పనితీరుపై ఆయన సమీక్షించారు. అనంతరం ఆత్మకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు.

February 24, 2026 / 08:00 PM IST

ధూళిపాళ్ల తల్లి ఇంట్లో చోరీ కేసును ఛేదించిన పోలీసులు

GNTR: పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి నివాసంలో జరిగిన చోరీ కేసును పోలీసులు వారం రోజుల్లోనే ఛేదించారు. ఐదుగురు నిందితులను మంగళవారం అరెస్ట్ చేసి, రూ.69.25 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు రాకేష్‌పై ఇప్పటికే 35 కేసులు ఉన్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. సీసీ ఫుటేజ్, వేలిముద్రల ఆధారంగా నిందితులను పట్టుకున్నారు.

February 24, 2026 / 08:00 PM IST

రాజమండ్రి ప్రజలకు ముఖ్య గమనిక

E.G: గత రెండురోజులుగా రాజమండ్రి లాలాచెరువులో పాల కల్తీ వ్యవహారం అందరినీ ఒక్కసారిగా కుదిపేసింది. పాల వ్యాపారి గణేష్ ఫోటోని స్థానికులు సోషల్ మీడియాలో విడుదల చేయడంతో మంగళవారం ఈ ఫోటో చక్కర్లు కొట్టింది. సదరు వ్యక్తి వద్ద ఎవరైనా పాలు కొంటే వెళ్లి టెస్ట్‌లు చేయించుకోవాలని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. మరి మీరు ఈ వ్యక్తి వద్ద పాలు కొన్నారా? కామెంట్ చేయండి.

February 24, 2026 / 08:00 PM IST

రైతులకు జవాబుదారీగా ఉండాలి: పరిటాల శ్రీరామ్

సత్యసాయి: తాడిమర్రి పీఏసీఎస్ ప్రెసిడెంట్‌గా శ్రీనివాస్ రెడ్డి, బత్తలపల్లి పీఏసీఎస్ డైరెక్టర్లుగా రవీంద్ర, నాగార్జున రెడ్డి నియమితులైన సందర్భంగా పరిటాల శ్రీరామ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ రైతులకు జవాబుదారీగా పనిచేయాలని శ్రీరామ్ సూచించారు. అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణాలు మంజూరు చేయాలని సూచించారు.

February 24, 2026 / 08:00 PM IST

ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు

PLD: రొంపిచర్ల మండలం వి.రెడ్డిపాలెం ఏపీ మోడల్ స్కూల్‌లో 6వ తరగతి ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతున్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి ప్రిన్సిపాల్ డా.రవినాయక్ ప్రకటన చేశారు. 5వ తరగతి చదువుతున్న వారు దీనికి అర్హులు. ఫీజు ఓసీ, బీసీలకు రూ.200, ఎస్సీ, ఎస్టీలకు రూ.125. దరఖాస్తుకు ఈ నెల 31 ఆఖరు తేదీ. ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్ష ఉంటుంది.

February 24, 2026 / 08:00 PM IST

‘జీడిపిక్కలకు మద్దతు ధర ప్రకటించాలి’

AKP: వీ.మాడుగుల(మం) జాలంపల్లి పంచాయతీలో మంగళవారం గిరిజనులు ఆందోళన చేపట్టారు. జీడి పిక్కలకు కేజీ రూ.200 మద్దతు ధర ప్రకటించి, రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. 80 కేజీల బస్తాకు రూ.18,000 ఇవ్వాలని కోరారు. జీడి కార్పొరేషన్ ఏర్పాటు, పంట రుణాలు, భీమా, ప్రాసెసింగ్ యూనిట్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

February 24, 2026 / 08:00 PM IST

‘టీడీపీలోకి చేరికలు అన్నీ భూటకమే’

కోనసీమ: మండపేట మండలం ఇప్పలపాడు గ్రామంలో వైసీపీ నుంచి టీడీపీ లోకి చేరికలు హాస్యాస్పదంగా ఉన్నాయని జిల్లా వైసీపీ పార్టీ ఉపాధ్యక్షులు పిల్లా వీరబాబు పేర్కొన్నారు. గోరంత దానిని కొండంతగా తెలుగుదేశం పార్టీ నాయకులు చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పనపాడు గ్రామంలో వంద మందికి పైగా వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరినట్లు చేస్తున్న ప్రచారం బూటకమన్నారు.

February 24, 2026 / 08:00 PM IST

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసిన ఎమ్మెల్యే

ప్రకాశం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను సచివాలయంలో మంగళవారం ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల చర్ల జనార్ధన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఒంగోలు నియోజకవర్గం మరియు ప్రకాశం జిల్లా అభివృద్ధి కోసం అవసరమైన నిధులు మంజూరు చేయాలని ఆయన వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం స్పందిస్తూ, ప్రకాశం జిల్లా అభివృద్ధికి తనవంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం.

February 24, 2026 / 08:00 PM IST

అతిసారం కట్టడికి కలెక్టర్ ప్రత్యేక చొరవ

శ్రీకాకుళంలోని పలు ప్రాంతాల్లో అతిసారం కేసులు నేపథ్యంలో జిల్లా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ నేతృత్వంలో వైద్య, మున్సిపల్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో ఇంటింటి సర్వే నిర్వహించారు. 24 గంటల అంబులెన్స్ సదుపాయం, ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 52 కేసులు నమోదైనట్లు తెలిపారు.

February 24, 2026 / 07:55 PM IST

విజిబుల్ పోలీసింగ్.. ప్రజల్లో చట్టాల అవగాహన

CTR: జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు, సిబ్బంది విస్తృత స్థాయిలో “విజిబుల్ పోలీసింగ్” కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని ప్రధాన కూడళ్లలో, సెంటర్లలో, మార్కెట్ ప్రాంతాల్లో, పోలీసులు ప్రజలతో మమేకమై రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం వంటి అంశాలపై ప్రత్యేకంగా సూచనలు ఇచ్చారు.

February 24, 2026 / 07:53 PM IST

ఇంటర్ సెకండియర్ పరీక్ష.. ఎంత మంది గైర్హాజరు అంటే..!

KDP: ఇవాళ ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలకు 97 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. మంగళవారం జిల్లాలో 62 కేంద్రాల్లో 15,159 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా.. 14,777 మంది విద్యార్థులు హాజరయ్యారు. 382 మంది గైర్హాజరయ్యారు. ఇందులో 14,011 మంది జనరల్ విద్యార్థుల్లో 13,691 మంది హాజరవ్వగా.. 320 మంది గైర్హాజరయ్యారు.

February 24, 2026 / 07:46 PM IST

RUB నిర్మాణాలకు భూసేకరణ వేగవంతం చేయాలి: జేసీ

W.G: భీమవరం కలెక్టరేట్ నుంచి మంగళవారం రైల్వే కన్స్ట్రక్షన్ అధికారులు, వివిధ శాఖల ప్రతినిధులతో జేసీ రాహుల్ కుమార్ రెడ్డి గూగుల్ మీట్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాలో అనుమతులు లభించిన నవాబ్ పాలెం (378), పత్తిపాడు (376), ఆరుగొలను (379) లెవల్ క్రాసింగ్ గేట్ల వద్ద రైల్వే అండర్ బ్రిడ్జిల (RUB) నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.

February 24, 2026 / 07:44 PM IST

టీడీపీ పార్టీకి రాజీనామా చేసిన మాజీ సర్పంచ్

KRNL: కౌతాళం మండలం కుంబలనూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బొంబాయి ముత్తన్న టీడీపీకి సభ్యత్వానికి స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్లు ఇవాళ ప్రకటించారు. పార్టీ అధిష్టానం ఉరుకుంద శ్రీ లక్ష్మీనరసింహ ఈరన్న స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

February 24, 2026 / 07:43 PM IST