• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అక్షర ఆంధ్రాలో వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యం: కలెక్టర్

GNTR: జిల్లాలో ‘అక్షర ఆంధ్రా’ కార్యక్రమం కింద అభ్యర్థులందరూ వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. బుధవారం విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. జిల్లాలో 90,426 మంది అభ్యాసకులు నమోదు చేసుకోగా, 9,043 మంది వాలంటీర్లు వీరికి విద్యాబోధన చేస్తున్నారని వివరించారు.

February 25, 2026 / 08:30 PM IST

వైసీపీ ఐటీ వింగ్ సెక్రటరీగా అఖిల్

AKP: వైసీపీ రాష్ట్ర ఐటీ వింగ్ సెక్రటరీగా అనకాపల్లికి చెందిన బర్రే స్వరూప్ అఖిల్‌ను నియమించారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు అందినట్లు అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ తెలిపారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు, భరత్‌కు అఖిల్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు.

February 25, 2026 / 08:29 PM IST

‘జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదును జయప్రదం చేయాలి’

E.G: రేపటి నుంచి ప్రారంభం కానున్న జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని గోపాలపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ దొడ్డికర్ల సువర్ణ రాజు పిలుపునిచ్చారు. బుధవారం దేవరపల్లిలో జనసేన వాలంటీర్లతో సమావేశమై మాట్లాడారు. సభ్యత్వంలో కలిగే ప్రయోజనాలను ప్రతి ఒక్కరికి వివరించి అందరూ ఉద్యమి సభ్యత్వం తీసుకునే విధంగా కృషి చేయాలన్నారు.

February 25, 2026 / 08:26 PM IST

నూతన డైనింగ్ హాల్‌ను ప్రారంభించిన కలెక్టర్

CTR: బైరెడ్డిపల్లి మండలం, కమ్మనపల్లి గ్రామంలోని ప్రభుత్వ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రభుత్వం తరఫున రూ.7 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన డైనింగ్ హాలును కలెక్టర్ సుమిత్ కుమార్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకోవాలన్నారు.

February 25, 2026 / 08:22 PM IST

లైఫ్ సర్టిఫికెట్ లేకుంటే పెన్షన్ కట్

VSP: జిల్లా పెన్షనర్లు తమ వార్షిక ధ్రువీకరణ సమర్పించేందుకు ఈనెల 28వ తేదీయే ఆఖరి గడువని జిల్లా ట్రెజరీ అధికారి కే. మోహన్ రావు ప్రకటించారు. గడువు దాటితే పెన్షన్ నిలిచిపోయే ప్రమాదం ఉందని, జిల్లాలో ఇంకా 2,476 మంది సర్టిఫికెట్లు అందజేయాల్సి ఉందని ఆయన తెలిపారు.

February 25, 2026 / 08:14 PM IST

‘కేవిటి కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చాలి’

SKLM: వజ్రపుకొత్తూరు మండలం నువ్వులరేవు గ్రామంలో ఉన్న కేవీటీల కులాన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు న్యాయం చేయాలని పలాస జిల్లా సాధన కమిటీ కన్వీనర్ దువ్వాడ శ్రీధర్ బాబా బుధవారం ఒక ప్రకటనలో కోరారు. కేవీటీలకు రాష్ట్రం బీసీగా గుర్తింపు నిచ్చారు. అయితే కేంద్రం ఓబీసీ జాబితాలో చేర్చలేదని తెలిపారు. కేవిటి కులాన్ని కేంద్ర ఓ.బి.సి జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు.

February 25, 2026 / 08:12 PM IST

చేనేతను ఆదరించండి: రామయ్య

KDP: చేనేత రంగాన్ని ప్రోత్సహించి నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపాలని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య అన్నారు. బుధవారం సిద్దవటం(మం) ఉప్పరపల్లిలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం యంత్రం నేసిన వస్త్రాల పోటీలో చేనేత రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని తెలిపారు. ప్రభుత్వం చేనేత కార్మికులకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని కోరారు.

February 25, 2026 / 08:11 PM IST

ఏడుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్

సత్యసాయి: అమడగూరు మండలం కొట్టువారిపల్లి వద్ద పోలీసులు బుధవారం నిర్వహించిన మెరుపు దాడుల్లో ఏడుగురు పేకాటరాయులు పట్టుబడ్డారు. ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో డ్రోన్ కెమెరా సాయంతో నిఘా ఉంచి ఈ ఆపరేషన్ చేపట్టారు. నిందితుల నుంచి రూ. 2.54 లక్షల నగదు, ఒక కారు, రెండు ద్విచక్ర వాహనాలు, ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

February 25, 2026 / 08:10 PM IST

రైస్ మిల్లును తనిఖీ చేసిన జేసీ రాహుల్

W.G: పాలకోడేరు(మం) శృంగవృక్షంలో శివ సాయిలక్ష్మి రైస్ మిల్లును బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. రిజిస్టరు “ఎ” లో నమోదు చేసిన ధాన్యానికి, రైస్ మిల్లులో భౌతికంగా ఉన్న ధాన్యానికి ఏమైనా తేడాలు ఉన్నయా అని పరిశీలించారు. రైస్ మిల్లర్లు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పనిచేయాలని సూచించారు.

February 25, 2026 / 08:09 PM IST

యమున నది పుష్కరాలకు ప్రత్యేక రైలు సర్వీస్

తూ.గో: వేసవి సెలవుల దృష్ట్యా IRCTC ప్రత్యేక ప్యాకేజీతో పాటు భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లను నడుపుతోందని ఏరియా మేనేజర్ ఎం రాజా వెల్లడించారు. బుధవారం రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఆయన మాట్లాడారు. జూన్ 3న సికింద్రాబాద్ నుంచి అయోధ్య, కాశీ, యమున పుష్కరాలను కవర్ చేస్తూ ప్రత్యేక రైలు వెళ్లనుందని తెలిపారు. యాత్రికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

February 25, 2026 / 08:07 PM IST

జిల్లా స్థాయిలో మాధవరాయుడుపాలెం విద్యార్థులు ప్రతిభ

E.G: రాజమండ్రి SKVT కళాశాలలో జరిగిన జిల్లా స్థాయి లాంగ్వేజ్ ఫెస్టివల్ పోటీల్లో మాధవరాయుడుపాలెం హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ చాటారు. పద్య పఠనంలో 5వ తరగతి విద్యార్థిని తాండ్ర రేణుశ్రీ ప్రథమ స్థానం, తెలుగు వక్తృత్వంలో 9వ తరగతి విద్యార్థిని కె.జాహ్నవి ద్వితీయ స్థానం సాధించారు. బుధవారం విజేతలకు DEO కె.వాసుదేవరావు ధ్రువపత్రాలు అందజేసి అభినందించారు.

February 25, 2026 / 08:06 PM IST

పంతలచింత గ్రామంలో కార్డన్ సెర్చ్

ASR: గంజాయి సాగు, రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అరకు సీఐ ఎల్.హిమగిరి, డుంబ్రిగుడ ఎస్సై సురేష్ హెచ్చరించారు. బుధవారం డుంబ్రిగుడ మండలంలోని పోతంగి పంచాయతీ పంతలచింత గ్రామంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో భాగంగా తమ సిబ్బంది, డాగ్ స్క్వాడ్ సిబ్బందితో కలిసి ఇంటింటికీ తిరిగి తనిఖీలు నిర్వహించారు. అనంతరం, గ్రామస్తులతో సమావేశమయ్యారు.

February 25, 2026 / 08:06 PM IST

జిల్లా పరిషత్ హై స్కూల్‌ను సందర్శించిన డీఈవో

NTR: కంచికచర్ల మండల పరిధిలోని పెండ్యాల జిల్లా పరిషత్ హై స్కూల్‌ను DEO చంద్రకళ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె పాఠశాల బోధన విధానం, సదుపాయాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. పదవ తరగతి విద్యార్థులు 100 డేస్ ప్రణాళికను కచ్చితంగా పాటించాలని సూచించారు. సమయపాలనతో చదువుకు ప్రాధాన్యత ఇచ్చి పది ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపాలన్నారు.

February 25, 2026 / 08:05 PM IST

అమర జవాన్ సైదా నాయక్ విగ్రహ ఆవిష్కరణ

PLD: మాచవరం మండలం చెన్నాయపాలెం గ్రామంలో ఆర్మీ జవాన్‌ బాణావత్ సైదా నాయక్ విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరించారు. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాచవరం ఎస్సై కె పవన్ కుమార్ పాల్గొన్నారు. అమర జవాన్ కుటుంబ సభ్యులు గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన యువకులు, ప్రజలు భారీగా పాల్గొన్నారు.

February 25, 2026 / 08:03 PM IST

ఈనెల 28 నుంచి శనగ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

BPT: శనగ రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. నియోజకవర్గవ్యాప్తంగా ఈ నెల 28 నుంచి శనగ కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. క్వింటా శనగలకు రూ. 5,875 మద్దతు ధర కల్పిస్తున్నామని, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.

February 25, 2026 / 08:03 PM IST