• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

భూములను రీసర్వే నిర్వహించిన ఆర్డీవో

NLR: ఆత్మకూరు మండలం పమిడిపాడులో జరుగుతున్న రీసర్వే ప్రక్రియను ఆత్మకూరు ఆర్డీవో బి.పావని బుధవారం పరిశీలించారు. రెవెన్యూ సిబ్బంది గ్రామంలోని 810 ఎకరాల భూముల హద్దులను నూతనంగా నమోదు చేసే ప్రక్రియను చేపట్టారు. ఇక్కడ జరుగుతున్న భూ రీసర్వే విధానాన్ని ఆర్డీఓ పరిశీలించి భూముల వివరాలు వాటి యజమానుల వివరాలు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

February 26, 2026 / 06:36 AM IST

నేడు ప్రత్యేక విద్యుత్ అదాలత్

TPT: వాకాడు సబ్‌స్టేషన్ వద్ద ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహించనున్నట్లు ఈఈ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఛైర్‌పర్సన్ వి.శ్రీనివాస ఆంజనేయ మూర్తి (రిటైర్డ్ జడ్జి) హాజరుకానున్నారు. వాకాడు, కోట, చెందోడు, చిట్టమూరు సెక్షన్ల వినియోగదారులు తమ విద్యుత్ సమస్యలపై అధికారులకు రాతపూర్వక ఫిర్యాదులు అందిచవచ్చని సిబ్బంది తెలిపారు.

February 26, 2026 / 06:36 AM IST

టీడీపీ నాయకుడు సుబ్బారెడ్డి కన్నుమూత

E.G: అనపర్తి MLA నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మామ కొవ్వూరి సుబ్బారెడ్డి (76) తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయానికి MLA నివాళులర్పించారు. గతంలో కొంకుదురు గ్రామ సొసైటీ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన సుబ్బారెడ్డి.. వివాదరహితునిగా గుర్తింపు పొందారు. ఆయన మృతితో నియోజకవర్గంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

February 26, 2026 / 06:34 AM IST

టెన్త్ పరీక్షలకు 143 కేంద్రాలు ఏర్పాటు

ATP: జిల్లాలో మార్చి 16 నుంచి జరిగే పదో తరగతి పరీక్షల కోసం 143 కేంద్రాలను సిద్ధం చేశారు. 31,972 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆన్‌లైన్ విధానం ద్వారా 370 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, అధికారులను నియమించింది. అలాగే పరీక్ష కేంద్రాల వద్ద 144 చేస్తామని అధికారులు తెలిపారు.

February 26, 2026 / 06:33 AM IST

పన్నుల చెల్లింపుకు నగరంలో ప్రత్యేక కౌంటర్లు: కమిషనర్

KRNL: పన్నుల చెల్లింపులో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. ఆస్తి పన్ను, తాగునీటి కొళాయి ఛార్జీలు, ట్రేడ్ లైసెన్స్ రుసుముల కోసం నగరంలో ఆరు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఇవి ప్రతిరోజూ పనిచేస్తాయని, యూపీఐ ద్వారా కూడా చెల్లింపులు చేయవచ్చని కమిషనర్ వెల్లడించారు.

February 26, 2026 / 06:25 AM IST

యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి”

కృష్ణా: మొవ్వ మండలంలోని ZPH పాఠశాలలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, చట్టపరమైన దుష్ప్రభావాలపై విద్యార్థులకు ఎస్‌ఐ సి.హెచ్. సురేశ్ వివరించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు.

February 26, 2026 / 06:25 AM IST

‘సాంకేతిక పద్ధతులను ఉపయోగించుకోవాలి’

NTR: విజయవాడలోని హోటల్ వివాంతాలో ఏపీ రాష్ట్రానికి సంబంధించి భూగర్భ జలాల డేటా ఆక్సిఫర్ మ్యాపింగ్ ఫలితాల ప్రచారంపై వర్క్ షాప్ బుధవారం జరిగింది. ఈ సందర్భంగా సెంట్రల్ వాటర్ బోర్డ్ సభ్యుడు వరదరాజ్ మాట్లాడుతూ.. భూగర్భ జలాల వనరుల అంచనా, సువర్ణ నిర్వహణ వినియోగానికి కృత్రిమ మేధస్సు ఆధారిత సాంకేతిక పద్ధతులను విస్తారంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

February 26, 2026 / 06:21 AM IST

రేపు జాబ్ మేళా.. ఎక్కడంటే?

కడప YVUలో రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ ప్రిన్సిపల్ ప్రొ.టి.శ్రీనివాస్ తెలిపారు. AP నైపుణ్యాభివృద్ధి సంస్థ, YVU ప్లేస్మెంట్ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగ ఎంపికలు నిర్వహిస్తున్నామన్నారు. 13 కంపెనీలు విశ్వవిద్యాలయానికి వస్తున్నాయన్నారు. టెన్త్ నుంచి పీజీ చదివిన వారు అర్హులన్నారు. పూర్తి సమాచారం కోసం 6300125455, 94405 16153 నంబర్లలో సంప్రదించాలన్నారు.

February 26, 2026 / 06:20 AM IST

‘నేటి నుంచి రెవెన్యూ క్లినిక్‌లు ప్రారంభం’

PPM: జిల్లా వ్యాప్తంగా ఇవాళ నుంచి గ్రామస్థాయిలో రెవెన్యూ క్లినిక్‌‌‌లు ప్రారంభం కావాలని కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకర రెడ్డి బుధవారం అధికారులను ఆదేశించారు.కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ.. ఇకపై ప్రతీ గురువారం VROలు ఆయా గ్రామాల్లో రెవిన్యూ క్లీనిక్‌ నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ప్రజల రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు.

February 26, 2026 / 06:20 AM IST

ఘనంగా భగవాన్ మెహర్ బాబా జయంతి

అనకాపల్లి మండలం కొత్తూరులో భగవాన్ అవతార్ మెహర్ బాబా 132వ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. మెహర్ బాబా మందిరంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. మెహర్ బాబా భక్తురాలు మాజీ ఎంపీపీ గంగుపాం జలజ మాట్లాడుతూ.. ప్రేమ, సేవలతో లోక శాంతిని పొందవచ్చునని భగవాన్ అవుతారు మెహర్ బాబా సూచించారని పేర్కొన్నారు.

February 26, 2026 / 06:20 AM IST

క్రీడోత్సవాల్లో ప్రతిభ చూపిన ఎమ్మెల్యే

W.G: ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ ఆధ్వర్యంలో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బుధవారం నిర్వహించిన క్రీడోత్సవాల్లో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాసరావు క్రికెట్ టీంలో తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొన్నారు. అనంతరం షటిల్ బ్యాడ్మింటన్ సింగిల్స్ ఆడి తన ప్రతిభను చూపారు.

February 26, 2026 / 06:20 AM IST

ఫ్రూట్ కవర్స్ ద్వారా నాణ్యమైన దిగుబడి సాధ్యం: HO

TPT: మామిడి పంట పూత నుంచి పిందెకు మారుతున్నందున, నిమ్మకాయ లేదా కోడి గుడ్డు పరిమాణంలో ఉన్నప్పుడే ఫ్రూట్ కవర్లు కట్టాలని పుత్తూరు హార్టికల్చర్ అధికారి వెంకట సౌజన్య సూచించారు. దీంతో బూడిద తెగులు, ఆకుమచ్చలు, అధిక ఉష్ణోగ్రత నుంచి కాయలను రక్షించుకోవచ్చన్నారు. 7.20 లక్షల ఫ్రూట్ కవర్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

February 26, 2026 / 06:12 AM IST

‘అక్షరాంధ్ర ఫ్రీ ఫైనల్ పరీక్షకు శతశాతం హాజరు ఉండాలి’

VZM: ఈనెల 28న జరిగే అక్షరాంధ్ర ప్రీఫైనల్‌ పరీక్షకు, మార్చి 15న నిర్వహించే ఫైనల్‌ పరీక్షకు నమోదు చేసుకున్న వారంతా తప్పనిసరిగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రాం సుందర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం అధికారులతో టెలీ కాన్ఫిరెన్స్‌ నిర్వహించారు. పరీక్షా కేంద్రాల గుర్తింపు, ఇన్విజిలేటర్ల నియామకం, మూల్యాంకన ఏర్పాట్లు పక్కాగా చేయాలని సూచించారు.

February 26, 2026 / 06:12 AM IST

సమస్యలపై మంత్రికి వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే

KKD: మంత్రి గుమ్మడి సంధ్యారాణిని బుధవారం సచివాలయంలో ప్రత్తిపాడు MLA వరుపుల సత్యప్రభమర్యాద పూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో అంగన్వాడీ భవనాలు మంజూరు చేయాలని కోరారు. సబ్ ప్లాన్ పరిధిలోని గిరిజన గ్రామాలు వెనుకబడి ఉన్నాయని, అక్కడ నూతన పాఠశాలలు, రోడ్ల నిర్మాణం చేపట్టాలని విన్నవించారు

February 26, 2026 / 06:12 AM IST

భీమిలిలో మద్యం బాటిల్స్ పట్టివేత

VSP: భీమిలిలోని బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న ఒక వ్యక్తిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం సాయంత్రం జేవీ అగ్రహారం వద్ద మద్యం అమ్ముతున్న వ్యక్తి నుంచి 32 క్వార్టర్ బాటిల్స్ స్వాధీనం చేసుకొని అమ్మకాలు చేస్తున్న నిర్వహణని భీమిలి పోలీసులకు అప్పగించినట్లు సిటీ టాస్క్‌‌‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. అనధికార మద్యం విక్రయాలపై సమాచారం ఇవ్వాలన్నారు.

February 26, 2026 / 06:11 AM IST