ATP: జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా శ్రీదేవి గురువారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆమె జిల్లా కలెక్టర్ ఆనంద్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా అమలు చేస్తున్న పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. కార్యాలయ సిబ్బంది కొత్త పీడీకి అభినందనలు తెలియజేశారు.
NTR: తిరువూరులోని శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఉదయం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు చేశారు. అనంతరం స్వామివారి కళ్యాణ వేడుకలు వైభవంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. దేవాలయ కమిటీ సభ్యులు భక్తులకు అన్నప్రసాదం వితరణ చేశారు.
NDL: ప్యాపిలిలోని CPI కార్యాలయంలో గురువారం పట్టణ కార్యదర్శి వెంకటేశ్, మండల కార్యదర్శి మహేశ్ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. వారు గ్రామాల్లో అక్రమంగా నడుస్తున్న బెల్ట్ షాపులను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు. పేద కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా నష్టపోతున్నారని, అధికారులు ఈ అక్రమ వ్యాపారాన్ని అరికట్టాలని సీపీఐ నాయకులు కోరారు.
సత్యసాయి: కదిరి ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి మార్చి 13 వరకు జరగనున్నాయి. 28న కల్యాణోత్సవం, మార్చి 10న ప్రధాన ఘట్టమైన తేరు నిర్వహించనున్నారు. ప్రహ్లాద సమేతుడై కొలువుదీరిన స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలిరానున్నారు. మార్చి 13న పుష్పయాగంతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి.
అన్నమయ్య: గాలివీడు(మం) గుండ్లచెరువు గ్రామ కస్పాలో రూ.31 లక్షల వ్యయంతో నిర్మించనున్న రామాలయానికి భూమి పూజ నిర్వహించారు. వేద పండితుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోందని పేర్కొన్నారు.
KDP: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని రాజంపేట TDP ఇంఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు పేర్కొన్నారు. గురువారం సిద్ధవటం(మం) మూలపల్లెలో నూతనంగా నిర్మించిన 4 ‘గోకులం’ షెడ్లను ఆయన ప్రారంభించారు. పశువుల ఆరోగ్యం, పాల దిగుబడి పెంచేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గోకులం షెడ్ల నిర్మాణాన్ని చేపట్టిందని చమర్తి కొనియాడారు.
కృష్ణా: గుడివాడలో జనసేన కార్యాలయంలో జనసేన ఉద్యమ సభ్యత్వ నమోదు పోస్టర్‌ను జిల్లా కార్యదర్శి గంగాధర్ గురువారం ఆవిష్కరించారు. జనసేన ఇన్ ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించారని అన్నారు. సభ్యత్వ నమోదు కోసం ఆధార్ కార్డ్, నామిని ఆధార్ కార్డ్, ఒక ఫోటో రూ. 400 తీసుకురావాలని కోరారు.
E.G: కొవ్వూరులో హోటల్స్ & వీధి వ్యాపారస్తులు తప్పనిసరిగా జన్యున్ ఆయిల్ మాత్రమే వాడాలని, ప్రతి దుకాణానికి ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని మున్సిపల్ ఛైర్ పర్సన్ భావన రత్నకుమారి గురువారం సూచించారు. వంటశాలల్లో కల్తీ నూనె వాడినట్లు గుర్తిస్తే ఎలాంటి ఉపేక్ష ఉండదని స్పష్టం చేశారు. ఆహార భద్రత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.
KRNL: ఆలూరు పరిధిలో హత్య, దొంగతనాల కేసులను సాంకేతిక పరిజ్ఞానంతో ఛేదించిన ఎస్సై మన్మధ విజయ్‌ను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గురువారం అభినందించారు. విధుల్లో అంకితాభావం ప్రదర్శించినందుకు ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. తోటి పోలీసు అధికారులు ఆయనకు అభినందనలు తెలిపారు.
కృష్ణా: మచిలీపట్నంలో బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఫణి కుమార్ నివాసంలో ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయని మచిలీపట్నం కార్పొరేషన్ కౌన్సిల్‌పై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టాభి స్మారక భవనం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
BPT: చీరాల తుఫాను వల్ల నియోజకవర్గంలో భారీ నష్టం వాటిల్లిందని MLA కొండయ్య అసెంబ్లీ సమావేశాల్లో పేర్కొన్నారు. ఎనిమిది కిలోమీటర్ల మేర ఆరు చోట్ల గండ్లు పడ్డాయని, ప్రస్తుతం తాత్కాలిక కల్వర్టులతో నెట్టుకొస్తున్నామని తెలిపారు. శాశ్వత కల్వర్టుల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినా నిధులు మంజూరు కాలేదని, ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు విడుదల చేయాలని కోరారు.
ప్రకాశం: పామూరు పట్టణ వైసీపీ ప్రచార కమిటీ అధ్యక్షునిగా యాట వీరస్వామిను వైసీపీ అధిష్టానం నియమించారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన కనిగిరి వైసీపీ ఇన్‌ఛార్జ్ దద్దల నారాయణ యాదవ్‌కు, కృతజ్ఞతలు తెలిపారు. వీరాస్వామి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరించే విధంగా కృషి చేస్తానన్నారు.
NLR: నెల్లూరులోని మనుమసిద్దినగర్ వద్ద రోడ్డుపై ఇసుక ఇబ్బందికరంగా ఉంది. ఈ ప్రాంతంలో డ్రైనేజ్ పనుల నిర్మాణానికి రోడ్డు పక్కన ఇసుక తోలారు. నిత్యం వందలాది వాహనాలతో రద్దీగా ఉండే రహదారిపై ఇసుక కనపడక వాహనాలు ప్రమాదానికి గురవుతున్నాయి. అభివృద్ధి పనుల పేరుతో రోడ్లకు అడ్డంగా పనులు చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. అధికారులు వీటిని అరికట్టాలని కోరుతున్నారు.
పోలవరం జిల్లాలో పులి సంచారం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. గత కొద్ది రోజులుగా వివిధ గ్రామాల్లో పులి కనిపిస్తున్నట్లు సమాచారం రావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గురువారం తెల్లవారుజామున రంపచోడవరం మండలంలోని పెద్దకొండ గ్రామ పరిసర ప్రాంతంలో రెండు ఆవులపై పెద్దపులి దాడి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.
PLD: నరసరావుపేటలో ఒంటరిగా కనిపించిన బాలుడి వివరాలు ‘HIT TV’లో వార్తగా రావడంతో తక్షణ స్పందన లభించింది. తమ బిడ్డ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఉన్నాడనే సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. సీఐ ఫిరోజ్ సమక్షంలో బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించగా, తమ బిడ్డ ఆచూకీ తెలిపిన పోలీసులకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.