• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

విషాదం… ఇటుకలు అందిస్తూ జారిపడి వ్యక్తి మృతి

కోనసీమ: ముమ్మిడివరం మండలం గేదెల్లంకలో పితాని బాలకృష్ణ (51) అనే వ్యక్తి భవనం పైనుంచి జారిపడి ప్రాణాలు కోల్పోయారు. ఇంటి నిర్మాణ పనుల్లో భాగంగా పిట్టగోడపై ఇటుకలు అందిస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎస్సై జ్వాలాసాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 27, 2026 / 11:40 AM IST

సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన SP

కృష్ణా: కంకిపాడులో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో SP విద్యాసాగర్ నాయుడు, సంయుక్త కలెక్టర్ గురువారం సాయంత్రం శుక్రవారం ఏర్పాట్లును పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరు పరిశీలించి, సీఎం ప్రయాణించే ప్రాంతంలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. అదనపు SP సత్యనారాయణ, జిల్లా అగ్నిమాపక అధికారి ఏసురత్నం, DSPలు శ్రీనివాసరావు, CI పాల్గొన్నారు.

February 27, 2026 / 11:37 AM IST

గాజువాకలో లారీ డ్రైవర్ ఆత్మహత్య

VSP: గాజువాక బెల్ కంపెనీ ఎదురుగా ఉన్న మైదానంలో లారీ డ్రైవర్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. తమిళనాడుకు చెందిన విజ్జి అనే లారీ డ్రైవర్ బెల్ కంపెనీకి లోడ్‌తో వచ్చారు.. సమీపంలో ఉన్న మైదానంలో ఆయన ఉరివేసుకున్నారు. అయితే ఆత్మహత్యలు గల కారణాలు ఏంటి అన్నది ఇంకా తెలియ రాలేదు.

February 27, 2026 / 11:35 AM IST

అవనిగడ్డలో RTC బస్సు ఢీ కొని ఇన్నోవా కారు దగ్దం

NTR: అవనిగడ్డ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న అవనిగడ్డ డిపో RTC బస్సును, మచిలీపట్నం నుంచి వస్తున్న ఇన్నోవా కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ప్రమాదంలో కారు ముందుభాగం పూర్తిగా ధ్వసమైంది. ఢీకొన్న సమయంలో బస్సులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను నియంత్రించారు.

February 27, 2026 / 11:34 AM IST

వైసీపీ నేతలు వీర్రాజుకు క్షమాపణ చెప్పాలి: బాబ్జి

కోనసీమ: శాసనమండలిలో BJP ఫ్లోర్ లీడర్ సోము వీర్రాజును YCP నేతలు అడ్డుకోవడం శోచనీయమని కొత్తపేటకు చెందిన TDP జిల్లా ఉపాధ్యక్షులు ముత్యాల బాబ్జి ఆరోపించారు. తక్షణం వైసీపీ నేతలు వీర్రాజుకు క్షమాపణ చెప్పాలన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పధకంపై చర్చ సందర్భంగా వీర్రాజు మాట్లాడుతుండగా అడ్డుకునేందుకు మైకు లాక్కొనడానికి ప్రయత్నించడం అప్రజాస్వామికమని విమర్శించారు.

February 27, 2026 / 11:30 AM IST

విశాఖలో నేటి కాయగూరల ధరలు..!

విశాఖ రైతు బజార్లలో కాయగూరల ధరలు శుక్రవారం (కేజీ/రూ.లలో) ఇలా ఉన్నాయి. ఉల్లిపాయ రూ.18, టమాటా రూ.10, బంగాళాదుంప రూ.13, వంకాయ రూ.22/24, క్యారెట్ రూ.24, మిర్చి రూ.56, కాకరకాయ రూ.34, మునగకాడలు రూ.80, దొండ రూ.30, కాలి ఫ్లవర్ రూ.14, ఆనపకాయ రూ.10, బీరకాయ రూ.32, బీన్స్ పిక్కలు రూ.240, పెన్సిల్ బీన్స్ రూ.38, క్యాప్సికం రూ.44లుగా ఉన్నాయి.

February 27, 2026 / 11:26 AM IST

శావల్యాపురం రహదారిపై కోతుల స్వైరవిహారం

PLD: శావల్యాపురం – కారుమంచి రహదారిపై కోతుల బెడద తీవ్రమైంది. చెరువుకట్ట వద్ద వాహనదారులపైకి కోతులు దూకుతుండటంతో ప్రయాణికులు, రైతులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. వాహనాల వెంట కోతులు పడుతూ ప్రమాదాలకు కారణమవుతున్నాయని, అధికారులు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని శుక్రవారం గ్రామస్థులు కోరుతున్నారు.

February 27, 2026 / 11:23 AM IST

తెనాలిలో భారీ పోలీసు బందోబస్తు

GNTR: ఆయేషా మీరా శరీర అవశేషాలను తిరిగి ఖననం చేయనున్న నేపథ్యంలో తెనాలిలోని ఈద్గా వద్ద పోలీసులు భద్రతను పెంచారు. విజయవాడ సీబీఐ కోర్టు నుంచి అవశేషాలను స్వీకరించిన తల్లిదండ్రులు, నేడు మధ్యాహ్నం తెనాలి చెంచుపేటలోని ఖబరస్థాన్‌కు చేరుకుంటారు. ముస్లిం మత పెద్దల సమక్షంలో ఈ అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రజా సంఘాలు ‘చలో తెనాలి’ పిలుపునిచ్చాయి.

February 27, 2026 / 11:21 AM IST

కర్నూలులో రేపు మాజీ సైనికుల ర్యాలీ

కర్నూలులో 10వ రక్షణ దళాల వెటరన్స్ డే సందర్భంగా శనివారం ర్యాలీ నిర్వహించనున్నట్లు రక్షణ శాఖ పౌర సంబంధాల అధికారి శివ హరి నాయక్ తెలిపారు. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో టీజీ లక్ష్మి కళ్యాణ మండపం నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుంది. మాజీ సైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

February 27, 2026 / 11:21 AM IST

ధర్మవరంలో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు

సత్యసాయి: మంత్రి సత్యకుమార్ యాదవ్ చొరవతో ధర్మవరం మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు వేగవంతమైంది. మార్కెట్ యార్డ్ ప్రాంగణంలోని 9.84 ఎకరాల భూమిని 25 ఏళ్ల లీజుకు ఇస్తూ అనుమతులు లభించాయి. కేంద్ర టెక్స్ టైల్స్ మంత్రిత్వ శాఖ మద్దతుతో తొలి విడతగా రూ. 298.03 లక్షలు విడుదలయ్యాయి. ఈ ప్రాజెక్టు ద్వారా డిజైన్ స్టూడియో, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించనున్నారు.

February 27, 2026 / 11:20 AM IST

రేపు కసాపురం ఆలయంలో బాలాలయం ప్రతిష్టాపన

ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయంలో ఈనెల 28న ఉదయం బాలాలయ ప్రతిష్టాపన నిర్వహించినట్లు ఆలయ ఈవో విజయ రాజు శుక్రవారం తెలిపారు. దేవస్థానంలో నూతన ధర్మాలయం మండపాలను పునః ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. గర్భాలయ నిర్మాణం పూర్తయ్యే వరకు బాలాలయంలోని స్వామివారికి పూజలు జరుగుతాయన్నారు.

February 27, 2026 / 11:20 AM IST

ఎర్రగుంట్లలో రూ. 2 కోట్లు పట్టివేత

కడప జిల్లా ఎర్రగుంట్లలో దాదాపు రూ.2 కోట్లకు పైగా నగదు తీసుకెళ్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమాచారం ప్రకారం అతను ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన బంగారు వ్యాపారస్థుడని తెలుస్తోంది. నగదు మూలం ఏమిటి, సంబంధిత బిల్లులు చూపించాలని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

February 27, 2026 / 11:19 AM IST

బేతంచర్ల లో ఆటో బోల్తా 10 గాయాలు

NDL: బేతంచర్ల మండలం సీతారామపురం మెట్ట వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. సంజీవ నగర్ కాలనీకి చెందిన కూలీలు చామంతి పూలు కోయడానికి ఆటోలో వెళ్తుండగా ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. డ్రైవర్ మధుకు తీవ్ర గాయాలు అవడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూల్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

February 27, 2026 / 11:19 AM IST

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వైసీపీ నేతలు

SKLM: పోలాకి మండలం చెల్లాయివలస గ్రామానికి చెందిన మట్ట రామయ్య ఇటీవల స్వర్గస్తులయ్యారు. వారి కుటుంబ సభ్యులను యువనేత, జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య శుక్రవారం పరామర్శించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాల వేస్తూ.. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయనతో పాటు మండల వైసీపీ అధ్యక్షులు కృష్ణారావు, రాష్ట్ర యువజన కార్యదర్శి రాఘవరావు, తదితరులు ఉన్నారు.

February 27, 2026 / 11:18 AM IST

‘పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం సొంతం’

W.G: పెనుమంట్ర మండలం బ్రాహ్మణచెరువులో శుక్రవారం ‘ఫ్రైడే -డ్రై డే’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏఎన్ఎం లక్ష్మి, ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి నిల్వ ఉన్న నీటిని తొలగించి, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. దోమల వ్యాప్తి ద్వారా వచ్చే డెంగీ, మలేరియా వంటి విషజ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

February 27, 2026 / 11:17 AM IST