• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రెడ్డిపాలెంలో వాహన తనిఖీలు చేపట్టిన ఎస్సై

BPT: చందోలు ఎస్సై శివకుమార్ నేతృత్వంలో పిట్టలవానిపాలెం మండలం రెడ్డిపాలెం వద్ద ఆదివారం వాహన తనిఖీలు చేపట్టారు. రహదారి నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని ఆయన సూచించారు. డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ వాడటం, మద్యం సేవించడం వంటివి చేయకూడదని, కార్లలో అనుమతి లేని వస్తువులను రవాణా చేయరాదని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.

March 2, 2026 / 06:55 AM IST

నేటి మంత్రి పర్యటన వివరాలు

కోనసీమ: రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ పర్యటన వివరాలను మంత్రి సిబ్బంది వెల్లడించారు. ఉదయం 9 గంటలకు రామచంద్రపురం పార్టీ కార్యాలయంలో నందు ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. 9:30 గంటలకు రామచంద్రపురం పార్టీ కార్యాలయంలో నందు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణి చేస్తారు. 10:30 గంటలకు రామచంద్రపురంలో రోడ్లు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.

March 2, 2026 / 06:55 AM IST

మహిళలకు ఉచిత మాస్టర్ టైలర్ శిక్షణ

అన్నమయ్య: రైల్వే కోడూరులో గ్లోబల్ సర్వీస్ ట్రస్ట్, నారీ నైపుణ్యం ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో మహిళలకు మాస్టర్ టైలర్ కోర్సులో ఉచిత శిక్షణ అందిస్తోంది. ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ శిక్షణలో టూల్ కిట్, ఇండస్ట్రియల్ కుట్టు మిషన్ ఉచితంగా ఇవ్వబడతాయని ట్రస్ట్ ఛైర్మన్ పార్థసారథి తెలిపారు. ఆసక్తి గల మహిళలు మార్చి 4వ తేదీ ఉదయం 10 గంటలలోపు కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

March 2, 2026 / 06:54 AM IST

చల్లపల్లిలో రోశయ్య విగ్రహావిష్కరణ

కృష్ణా: కొణిజేటి రోశయ్య జీవితం ఆదర్శప్రాయమని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు చిన్ని రామ సత్యనారాయణ అన్నారు. చల్లపల్లి మండలం లక్ష్మీపురంలో ఆదివారం రోశయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఉమ్మడి రాష్ట్ర ఆర్థిక మంత్రి, ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని ఆయన కొనియాడారు.

March 2, 2026 / 06:51 AM IST

ఎమ్మెల్యే రవికుమార్ నేటి పర్యటన వివరాలు

SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు పొందూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆదునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు పొందూరు MPDO కార్యాలయం వద్ద గ్రామ పంచాయితీలకు “ట్రై సైకిల్స్” పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయం ఆదివారం ప్రకటనలో తెలిపారు.

March 2, 2026 / 06:48 AM IST

‘అంగన్వాడీల సంక్షేమానికి కూటమి కట్టుబడి ఉంది’

W.G: అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, చిరు ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఎప్పుడు లేని విధంగా చరిత్రలోనే తొలిసారిగా రెండుసార్లు అంగన్వాడీలకు వేతనాలు పెంచిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని చెప్పారు.

March 2, 2026 / 06:43 AM IST

పెనుమూరులో 5న మెగా ఉద్యోగ మేళా

CTR: పెనుమూరులోని స్థానిక ఎస్వీ డిగ్రీ కళాశాలలో ఈనెల 5న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల కరస్పాండెంట్ సురేంద్రరెడ్డి తెలిపారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఐటీఐ, బీఫామ్ పూర్తి చేసి 18-35 ఏళ్లలోపు ఉన్న వారు పాల్గొనవచ్చని తెలిపారు. నిరుద్యోగ యువతి, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.

March 2, 2026 / 06:40 AM IST

‘పది ఫలితాల్లో జిల్లా మొదటి స్థానంలో నిలవాలి’

AKP: ఈ ఏడాది అనకాపల్లి జిల్లా పదవ తరగతి ఫలితాల్లో మొదటి స్థానంలో నిలవాలని డీఈఓ అప్పారావు నాయుడు అన్నారు. నక్కపల్లి మండలం వేంపాడు జడ్పీ హైస్కూల్‌లో ఆదివారం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించి వందరోజుల ప్రణాళిక అమలు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు సూచనలు చేశారు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని అన్నారు.

March 2, 2026 / 06:39 AM IST

మృత్యువుతో పోరాడి ఓడిన దిలీప్

KDP: కాశినాయన మండలం గంగనపల్లె హరిజవాడకు చెందిన కందుల దిలీప్‌పై (24) దండగులు పెట్రోల్ పోసి నిప్పటించిన విషయం తెలిసిందే. స్థానికులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయాకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. చిన్న వయసులోనే దిలీప్ మృతి చెందడంతో తలిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

March 2, 2026 / 06:37 AM IST

నాదెండ్ల మనోహర్‌ను కలిసిన బాల మురళీకృష్ణ

TPT: రాష్ట్ర మంత్రి, జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌ను నిన్న సత్యవేడు జనసేన నాయకుడు బాలమురళీకృష్ణ కలిశారు. ఈ సందర్భంగా సభ్యత్వ నమోదుపై చర్చించారు. నిరుపేదలకు రూ.400 సభ్యత్వ రుసుమును తామే భరిస్తామని తెలిపారు. సభ్యత్వం పొందిన వారికి రూ.5 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని పేర్కొన్నారు. సభ్యత్వం కోసం 9866383898 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

March 2, 2026 / 06:37 AM IST

21 మంది ప్రాణాలు కోల్పోవడం తీరనిలోటు: మాజీ మంత్రి

కృష్ణా: వేట్లపాలెం ఘటనపై మాజీమంత్రి కొడాలి నాని ఆదివారం స్పందించారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమన్నారు. 21 మంది ప్రాణాలు కోల్పోవడం రాష్ట్రానికి తీరని లోటన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు పూర్తి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

March 2, 2026 / 06:35 AM IST

నెల రోజుల పాటు పోలీస్ యాక్ట్ అమలు: డీఎస్పీ

NLR: కందుకూరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో నెల రోజుల పాటు పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉంటుందని ఆదివారం డీఎస్పీ బాలసుబ్రమణ్యం తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్ యాక్ట్ 30ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. కందుకూరు నియోజకవర్గంతో పాటు పొన్నలూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్ శాఖ అనుమతి లేకుండా సమావేశాలు నిర్వహించకూడదన్నారు.

March 2, 2026 / 06:34 AM IST

సంతల ఆదాయం ద్వారా మార్కెట్‌కు రూ. 3.83 లక్షల ఆదాయం

ATP: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డు ప్రాంగణంలో ఈవారం జరిగిన పశువులు, జీవాల సంతల ద్వారా రూ. 3.83 లక్షల మేర ఆదాయం వచ్చినట్లు మార్కెటింగ్ శాఖ ఏడీ రాఘవేంద్రకుమార్ తెలిపారు. అందులో శనివారం జరిగిన గొర్రెలు, మేకలు, పొట్టేళ్ల సంత ద్వారా రూ. 2.40 లక్షలు, ఆదివారం జరిగిన పశు వులు, గేదెలు, ఎద్దుల సంత ద్వారా రూ. 1.43 లక్షలు వసూలైనట్లు తెలిపారు.

March 2, 2026 / 06:34 AM IST

‘ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవాలి’

VZM: స్దానిక ఎమ్మెల్యే పూసపాటి అతిది గజపతిరాజు ఆదివారం TDP జిల్లా కార్యాలయంలో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికీ కృషి చేయాలని ఆమె సూచించారు. ప్రతి నాయకుడు, కార్యకర్త ఆయా ప్రాంతాల్లో ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవాలని గుర్తించిన సమస్యలను పరిష్కరించాలన్నారు.

March 2, 2026 / 06:33 AM IST

అంగన్వాడీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి

కోనసీమ: అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు సంక్షేమానికి రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. ఆదివారం రామచంద్రపురంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించినప్పటికీ, అంగన్వాడీలకు తాము ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు అందజేస్తున్నట్లు తెలిపారు.

March 2, 2026 / 06:33 AM IST