ATP: పదో తరగతి విద్యార్థులకు రేపటి నుంచి గ్రాండ్ టెస్టులు మొదలవుతాయని డీఈవో ప్రసాద్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం తెలుగు, బుధవారం హిందీ, గురువారం ఇంగ్లీష్, శుక్రవారం లెక్కలు, శనివారం భౌతిక శాస్త్రం, సోమవారం జీవశాస్త్రం, మంగళవారం సోషల్, పరీక్షలు ఉంటాయన్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం 1.30గంటల నుంచి 4.45 వరకు ఈ పరీక్షలు జరుగుతాయన్నారు.
CTR: పలమనేరు రూరల్ మండలంలోని జగమర్ల పంచాయతీ దేవలంపేట నందున్న శ్రీ వందన మల్లేశ్వర స్వామి దేవాలయం నందు త్రయోదశి ఆదివారం శ్రీపార్వతి వందన మల్లేశ్వర స్వామికి అత్యంత ఘనంగా కల్యాణోత్సవం నిర్వహించారు. ఆది దంపతుల కళ్యాణోత్సవం కన్నుల విందుగా తిలకించిన అశేషమైన భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.
ప్రకాశం: దర్శి పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంప్‌ను కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యమని తెలిపారు. ఉచిత వైద్య పరీక్షలు, మందుల పంపిణీ ద్వారా పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం అభినందనీయమని అన్నారు.
ATP: జిల్లాలో ఆదివారం నుంచి ఈనెల 15 వరకు చౌక ధరల దుకాణాలలో సరుకులు పంపిణీ చేస్తారని జేసీ విష్ణు చరణ్ తెలిపారు. జిల్లాలోని 6,74,333 రేషన్ కార్డులకు సరిపడా నిత్యవసర సరుకులు చౌక ధరల దుకాణాలకు సరఫరా చేసామన్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 వరకు సరుకులు పంపిణీ చేస్తారన్నారు.
కోనసీమ: ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు MSME రుణాలు పొందేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారని, ఆసక్తిగల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆలమూరు మండలం టీడీపీ అధ్యక్షుడు ఈదల సత్తిబాబు కోరారు. ఈ పథకం ద్వారా రుణాలు రూ.10 లక్షల నుంచి రూ.2కోట్ల వరకు వారు నిర్వహించే పరిశ్రమ ఆధారంగా రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు.
ELR: ఉంగుటూరు మండలం అక్కుపల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. ఆదివారం ఉంగుటూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జనసేనలో పార్టీల చేరిన వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా చేసి పార్టీలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ.. జనసేన పార్టీ సిద్ధాంతాలు చేరి పార్టీలో చేరిన వైసిపి కార్యకర్తలకు ఆయన అభినందించారు.
VZM: చీపురుపల్లి గ్రామ పంచాయతీ EO ఝన్సీరాణి పర్యవేక్షణలో ఆదివారం ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించారు. ఈ మేరకు డైలీ మార్కెట్, లెక్చలర్స్ వీధులతో పాటు సచివాలయం-5, రాజాంరోడ్డు, కనకమహాలక్ష్మి ప్రాంగణంలో పారిశుద్ధ్య కార్మికులు కాలువ పూడికలు తీశారు. అనంతరం చెత్త కుప్పలను డంపింగ్ యార్డ్‌కు తరలించారు. ఈ పనులను JA రాము పరిశీలించారు.
KRNL: ఉరుకుంద ఈరన్న స్వామి ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ వ్యవహారంపై రాజీనామాలు చేసిన వల్లూరి నాగేశ్వరరావు, వల్లూరి పట్టాభి తమ రాజీనామాలను ఇవాళ వెనక్కి తీసుకున్నారు. టీడీపీ అధిష్టానం పిలుపు మేరకు విజయవాడలో నారా లోకేష్ తదితరులతో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇతరులు కూడా రాజీనామాలు వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
VZM: క్రీడలు క్రమశిక్షణకు, ఆత్మవిశ్వాసానికి ప్రతీకలని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి అన్నారు. భోగాపురం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా జరిగిన ఆంధ్రప్రదేశ్ యూత్ వాలీబాల్ (పురుషుల & మహిళల) జట్టు ఎంపికలను ఆదివారం ఆమె ప్రారంభించారు. విద్యార్థి దశ నుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని పిలుపునిచ్చారు. కాసేపు క్రీడాకారులతో కలిసి వాలీబాల్ ఆడారు.
AKP: నర్సీపట్నం శాఖా గ్రంధాలయంలో ఆదివారం చిల్డ్రన్ బుక్స్ ఎగ్జిబిషన్ లైబ్రేరియన్ దమయంతి ఆధ్వర్యంలో నిర్వహించారు. పిల్లల కథలు, పిల్లల సాహిత్యాలు, దేశ నాయకులు చరిత్రలు, జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు,ఇంగ్లీష్ కదల పుస్తకాలు మొదలైనవి ప్రదర్శించారు. పిల్లలందరూ పుస్తకాలను తిలకించి, వారికి నచ్చిన పుస్తకాలు తెచ్చుకొని చదువుకున్నారు.
NLR: వలేటివారిపాలెం మండలం మాలకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి శనివారం రూ.9,76,224 లక్షల ఆదాయం వచ్చినట్లు EO చంద్రశేఖర్ తెలిపారు. ప్రత్యేక దర్శనానికి రూ.2,45,900, లడ్డూ ప్రసాదానికి రూ.2,16,105, అన్న ప్రసాదానికి రూ.3,98,528, తలనీలాలకు రూ.31,725, వివిధ పూజలకు సంబంధించి రూ.62,506, రూమ్ అద్దెల ద్వారా రూ.21,440 సమకూరిందని వివరించారు.
E.G: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల తరుఫున ఏపీ జేఏసీ జాయింట్ సెక్రటరీగా రాజమండ్రికి చెందిన దడాల జగ్గారావు నియమితులయ్యారు. స్థానిక ఎన్జీవో హోమ్‌లో జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో సంఘ అధ్యక్షుడు మీసాల మాధవరావు ఈ నియామకాన్ని ప్రకటించారు. జగ్గారావు మాట్లాడుతూ.. గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగుల సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.
ATP: గుత్తి మండలం కొత్తపేట గ్రామంలోని చెరువు కట్టపై వెలసిన హజరత్ యాదుల్లాహ్ భాష ఖాద్రి రహిమతుల్లా అలైహి 175వ ఉరుసు ఉత్సవాల వాల్ పోస్టర్లను గుత్తి, పామిడి మండల ఇన్‌ఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ ఆవిష్కరించారు. ఉరుసు నిర్వాహకులు ఇసాక్ మాట్లాడుతూ.. ఈనెల 2, 3, 4 తేదీలలో స్వామివారి ఉరుసు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
NDL: బండి ఆత్మకూరు మండలం లింగాపురం గ్రామంలో ఆదివారం ఎస్సై జగన్మోహన్ పోలీస్ సిబ్బందితో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. గ్రామంలో బెల్ట్ షాపు నడిపేవారు, రౌడీ షీటర్ల ఇళ్లను తనిఖీ చేశారు. పత్రాలు లేని 6 మోటార్ సైకిళ్లు, మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. ఎవరైనా ఆ సాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అన్నమయ్య: రాయచోటిలో ఆదివారం నాన్‌వెజ్ ధరలు వెల్లడయ్యాయి. చికెన్ కేజీ రూ. 230, స్కిన్‌లెస్ చికెన్ రూ. 260గా విక్రయిస్తున్నారు. మటన్ ధర కేజీ రూ. 950గా స్థిరంగా కొనసాగుతోంది. చేపలలో కొరమేను రూ. 450, రాగండి రూ. 200, బొచ్చెలు రూ. 230గా ఉన్నాయి. రంజాన్ సందర్భంగా చికెన్‌కు డిమాండ్ పెరగడంతో ధరలు పెరిగినప్పటికీ వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారని వ్యాపారులు తెలిపారు.