• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

హిందూపురంలో మెగా జాబ్ మేళా.. ఎప్పుడంటే?

సత్యసాయి: ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 15న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. హిందూపురంలోని సప్తగిరి డిగ్రీ, పీజీ కళాశాలలో జరిగే ఈ మేళాలో 90కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని 5,000 ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. యువతీ యువకులు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.

March 6, 2026 / 08:00 AM IST

‘జనసేన సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి’

KKD: జనసేన పార్టీ సంస్థాగత బలోపేతానికి సభ్యత్వ నమోదు ఎంతో కీలకమని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. కాకినాడలోని తన క్యాంపు కార్యాలయంలో జగ్గంపేట నియోజకవర్గ నాయకులు, ‘సాధక్’లతో గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రజా సమస్యలపై జనసేన చేస్తున్న పోరాటాన్ని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

March 6, 2026 / 08:00 AM IST

40 ఏళ్ల తర్వాత విశాఖ ‘జూకు’ బ్లాక్ పాంథర్

విశాఖ జుపార్కుకి అరుదైన బ్లాక్ పాంథర్ వచ్చి చేరింది. అస్సాం స్టేట్ జూ పార్కుతో జంతు మార్పిడి కార్యక్రమంలో భాగంగా పలు జంతువులను ఇక్కడకు తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దాదాపు 40 ఏళ్ల తర్వాత ఆడ బ్లాక్ పాంథర్‌ను తీసుకురావడం విశేషం. అస్సాం నుంచి వచ్చిన అడవి మగ చిరుత, జంతువుల జన్యుపరమైన వైవిధ్యాన్ని పెంచుతుందని అధికారులు తెలిపారు.

March 6, 2026 / 07:55 AM IST

‘స్థానిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలి’

AKP: స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని వైసీపీ శ్రేణులకు పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ పిలుపునిచ్చారు. మునగపాక క్యాంపు కార్యాలయంలో గురువారం మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జేడ్పీటీసీ పెంటకోట స్వామి సత్యనారాయణ పాల్గొన్నారు.

March 6, 2026 / 07:52 AM IST

స్కూల్ బస్సు ఢీకొని మహిళ మృతి

TPT: తిరుపతిలో రేణిగుంట రోడ్డులోని జూడియో షోరూమ్ వద్ద రోడ్డు దాటుతున్న మహిళను స్కూల్ బస్సు ఢీకొనడంతో గురువారం సాయంత్రం మృతి చెందింది. స్కూల్ బస్సు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన మహిళను స్థానికులు రుయా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆమె వద్ద ఏలాంటి ఫోటో గుర్తింపు ఆధారాలు లేవని అలిపిరి పోలీసులు తెలిపారు.

March 6, 2026 / 07:46 AM IST

శాసనమండలిలో ఎమ్మెల్సీ గళం..!

W.G: అసంపూర్తిగా ఉన్న రైతు సేవా కేంద్రాలను పూర్తి చేయాలని శాసన మండలి సభ్యులు వంక రవీంద్ర నాథ్ డిమాండ్ చేశారు. గురువారం శాసన మండలిలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. గత ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించి 2020 మే నెల 30న ప్రారంభించి అప్పటి కేంద్ర ప్రభుత్వంతో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రశంసలు అందుకున్నారని గుర్తు చేశారు.

March 6, 2026 / 07:45 AM IST

రాయచోటిలో ఘనంగా ఇఫ్తార్ విందు

అన్నమయ్య: వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి రాయచోటి పట్టణంలోని రింగ్ రోడ్ నూర్ మసీదు వద్ద యూసుఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రంజాన్ నెలలో జరిగే ఇఫ్తార్ విందులు ఆత్మీయత, సహృద్భావాలకు నిదర్శనమని పేర్కొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

March 6, 2026 / 07:45 AM IST

డ్రైవర్లకు నిద్రమత్తు వదలగొడుతున్న పోలీసులు

కోనసీమ: అర్ధరాత్రి, తెల్లవారుజామున జరిగే రహదారి ప్రమాదాలను అడ్డుకునేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం వినూత్నంగా స్పందించింది. అమలాపురంలో గురువారం రాత్రి నిద్రమత్తు వల్ల తలెత్తే ముప్పును తప్పించేందుకు లారీలు, బస్సులు, కార్ల డ్రైవర్లను అప్రమత్తం చేస్తూ పంపుతున్నారు. పోలీసుల ఈ చొరవతో ప్రయాణికులు క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.

March 6, 2026 / 07:42 AM IST

‘విద్యార్థులను ప్రభుత్వ బడిలో చేర్పిద్దాం’

VZM: గరివిడి మండలం దుమ్మెద గ్రామంలో కోనూరు స్కూల్ ఉపాధ్యాయులు గురువారం సాయంత్రం డ్రైవ్ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలను కాపాడుకుందాం.. విద్యార్థులను చేర్పిద్దాం అంటూ తల్లిదండ్రులకు అవగాహనపరిచారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాలు తల్లిదండ్రుల భారం తగ్గిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు వెంపడాపు రమణమూర్తి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

March 6, 2026 / 07:42 AM IST

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

KDP: వేంపల్లి (M)లోని బక్కన్నగారి పల్లెకు చెందిన రైతు రెడ్డి బోయిన సూర్యనారాయణ (30) అప్పుల బాధ తట్టుకోలేక గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు 2.50 ఎకరాల పొలం ఉండగా అరటి, మొక్కజొన్న, వేరుశనగ పంటలు సాగు చేసేవాడు. 5 బోర్లు వేసి రూ.12 లక్షలకు పైగా అప్పులు అయ్యాయి. పంటలకు దిగుబడి రాకపోవడం, గిట్టుబాటు ధరలు లేక చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

March 6, 2026 / 07:42 AM IST

కల్తీ పాలు ఘటన.. 9కి చేరిన మృతుల సంఖ్య

E.G: రాజమండ్రిలో కల్తీ పాల ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఈ ఘటనలో మొత్తం 20 మంది అడ్మిట్ కాగా, ఇప్పటి వరకు మొత్తం 9 మంది మృతి చెందినట్లు వెల్లడించారు. మిగిలిన 11 మంది బాధితులు వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. అయితే, అందులో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.

March 6, 2026 / 07:40 AM IST

‘బెంతు ఒరియాల సమస్యలను పరిష్కరించండి’

SKLM: బెంతు ఒరియా కులస్థులకు న్యాయం చేయాలని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అశోక్ బాబు కోరారు. గురువారం అమరావతిలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కె.రఘు రామ కృష్ణం రాజును కలిసి వినతిపత్రం అందజేసి, బెంతు ఒరియాల సమస్యలను వివరించారు. వారు ప్రధానంగా ఏ కులంలో ఉన్నారో తెలియని దుస్థితి నెలకొందని, క్యాస్ట్ సర్టిఫికేట్ లేకుండా జీవిస్తున్నారని తెలిపారు.

March 6, 2026 / 07:36 AM IST

డిపోలో RO ప్లాంట్‌ను ప్రారంభించిన జోనల్ ఛైర్మన్

NLR: ప్రయాణికుల సౌకర్యార్థం రాపూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో ఏర్పాటు చేసిన RO ప్లాంట్‌ను ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ సన్నపురెడ్డి సురేశ్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఆర్టీసీ డిపోలలో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ అభివృద్ధిపై దృష్టి సారించిందన్నారు.

March 6, 2026 / 07:30 AM IST

రేషన్ పంపిణీపై సూచనలు..!

నంద్యాల: పట్టణం, రూరల్ పరిధిలోని రేషన్ డీలర్లతో ఇన్‌ఛార్జ్ తహసీల్దార్‌ సత్య శ్రీనివాసులు సమావేశమయ్యారు. ప్రభుత్వం అందిస్తున్న బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రేషన్ పంపిణీ విషయంలో ఎలాంటి అవకతవకలు, అక్రమాలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

March 6, 2026 / 07:25 AM IST

ఉగ్రాణంపల్లి ప్రాథమిక పాఠశాల హెడ్‌మాస్టర్ సస్పెండ్

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం ఉగ్రాణంపల్లి ప్రాథమిక పాఠశాల HM శ్రీనివాసులును సస్పెండ్ చేస్తూ డీఈవో రాజేంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన విధులకు సక్రమంగా హాజరు కావడం లేదని, అప్పుడప్పుడు మద్యం తాగి పాఠశాలకు వస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. డిప్యూటీ డీఈవో ఇందిర విచారణ చేపట్టారు. ఆరోపణలు వాస్తవమే అని రిపోర్ట్ ఇవ్వడంతో సస్పెండ్ చేశారు.

March 6, 2026 / 07:23 AM IST