• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కేంద్ర నోడల్ అధికారిగా నీరజ్ కుమార్ గయాగి

VZM: భారత ప్రభుత్వం పీఎం శ్రీ పథకం అమలును పరిశీలించేందుకు దేశవ్యాప్తంగా జాయింట్ సెక్రటరీ హోదా కలిగిన సుమారు 170 మంది అధికారులను నోడల్ అధికారులుగా నియమించిందని కలెక్టర్ రామ సుందర్ రెడ్డి మంగళవారం తెలిపారు. జిల్లా కేంద్ర నోడల్ అధికారిగా జాయింట్ సెక్రటరీగా నీరజ్ కుమార్ గయాగి నియమితులైనట్లు చెప్పారు.

February 25, 2026 / 07:48 AM IST

జగన్‌తో కదిరి వైసీపీ ఇంఛార్జ్ భేటీ

సత్యసాయి: పులివెందుల పార్టీ కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బి.ఎస్. మక్బూల్ అహ్మద్ కలిశారు. కదిరి నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలను జగన్‌కు వివరించారు. వాణిజ్య విభాగం అధ్యక్షులు పీఎండీ షకీల్ కూడా ఈ భేటీలో పాల్గొని నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై చర్చించారు.

February 25, 2026 / 07:47 AM IST

రైల్వే గేట్ వద్ద వాహనదారులకు కౌన్సిలింగ్

కృష్ణా: గుడివాడ మండలం మల్లాయిపాలెం రైల్వే గేట్ వద్ద ఎస్సై చంటిబాబు బుధవారం వాహన తనిఖీలు చేపట్టారు. ప్రజల భద్రత దృష్ట్యా ఓవర్ లోడ్‌తో ప్రయాణిస్తున్న ప్రయాణికుల వాహనాలను గుర్తించి డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎస్సై మాట్లాడుతూ.. వాహనదారులు రోడ్డు భద్రత నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అనుమతించిన పరిమితికి మేరకే ప్రయాణికులను తీసుకువెళ్లాలన్నారు.

February 25, 2026 / 07:45 AM IST

శాసనమండలిలో ఎమ్మెల్సీ గళం

W.G: ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్, వర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలను ఎమ్మెల్సీ గోపిమూర్తి మంగళవారం శాసనమండలిలో ప్రస్తావించారు. ఏళ్ల తరబడి సేవలందిస్తున్న వీరిని, అసిస్టెంట్ ప్రొఫెసర్లను వెంటనే క్రమబద్ధీకరించాలన్నారు. ఎయిడెడ్ కళాశాలల్లోని అన్-ఎయిడెడ్ సిబ్బందిని సైతం రెగ్యులర్ చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

February 25, 2026 / 07:40 AM IST

పారిశుద్ధ్య కార్మికులకు పనిముట్లు అందజేత

ATP: గుంతకల్లు మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు బుధవారం మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి పనిముట్లను అందజేశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికుల భద్రత, సామర్థ్యాన్ని పెంచేందుకు పనిముట్లు, రక్షణ పరికరాలను అందజేశామన్నారు. ఈ పరికరాలు నగర స్వచ్ఛతకు దోహదపడతాయన్నారు.

February 25, 2026 / 07:40 AM IST

ప్రవేశ పరీక్ష ఈనెల 8కి వాయిదా

AKP: కశింకోట మండలం తాళ్లపాలెంలో బీఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాలలో మిగులు సీట్ల భర్తీకి వచ్చే నెల 2 నిర్వహించనున్న ప్రవేశపరీక్షను 8వ తేదీకి వాయిదా వేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ రత్నావళి మంగళవారం తెలిపారు. ఆరోజు 6, 7 తరగతులకు ఉదయం 10 గంటల నుంచి 11:30 గంటల వరకు, 8, 9,10 తరగతులకు మధ్యాహ్నం 2 నుంచి 3.30 గంటల వరకు జరుగుతుందన్నారు.

February 25, 2026 / 07:39 AM IST

తిరుపతికి వెళ్లే వారికి ALERT

TPT: తిరుపతి ప్రధాన స్టేషన్‌లో రద్దీ తగ్గించేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అరక్కోణం, చెన్నై సెంట్రల్ మెమూ రైళ్లు ఇకపై తిరుపతికి రావు. తిరుచానూరు రైల్వే స్టేషన్ నుంచే ఇవి రాకపోకలు సాగించనున్నాయి. ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులు ఇకపై తిరుపతి బదులు తిరుచానూరు స్టేషన్‌కు వెళ్లాల్సి ఉంటుంది.

February 25, 2026 / 07:38 AM IST

వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళ అరెస్ట్

NDL: నంద్యాలలోని బాలాజీ కాంప్లెక్స్ ప్రాంతంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మహిళను మంగళవారం సాయంత్రం అరెస్ట్ చేసినట్లు వన్ టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. వ్యభిచారం జరుగుతుందనే సమాచారం మేరకు దాడలు చేసి ఒక మహిళను అరెస్టు చేసి, ఆమె అనుచరులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిపై కేసు నమోదు చేశామన్నారు. కాగా, ఆ మహిళపై ఇదివరకే పలు కేసులు ఉన్నాయన్నారు.

February 25, 2026 / 07:36 AM IST

వైద్యారోగ్యశాఖలో పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా పలు పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారని డీఎంహెచ్‌వో డా. నరసింహ నాయక్ మంగళవారం తెలిపారు. మొత్తం 9 పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నామన్నారు. మార్చి 2 నుంచి 11వ తేదీ వరకూ కాకినాడ DMHO కార్యా లయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు.

February 25, 2026 / 07:30 AM IST

కౌతాళంలో ఆగని రాజీనామాల పర్వం

KRNL: కౌతాళంలో రాజీనామాల పర్వం ఆగడం లేదు. కుంబలనూరు, దోమలదిన్నె సర్పంచులు వీరేశ్, మమత TDP సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఉరుకుంద శ్రీ లక్ష్మీనరసింహ ఈరన్న స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ పదవి విషయంలో పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వారు తెలిపారు. కష్టపడ్డ నాయకులకు నియోజకవర్గంలో సముచిత స్థానం లభించడం లేదన్నారు.

February 25, 2026 / 07:30 AM IST

నేడు రామచంద్రపురంలో జాబ్ మేళా

కోనసీమ: రామచంద్రపురంలో బుధవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి వాసంశెట్టి సుభాష్ కార్యాలయం సిబ్బంది వెల్లడించారు. 10వ తరగతి, డిప్లొమా, డిగ్రీ అర్హత ఉండి, 18-35 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులు ఈ మేళాకు హాజరు కావచ్చన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సుభాష్ సూచించారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

February 25, 2026 / 07:30 AM IST

‘జర్నలిస్టుల చలో విజయవాడ జయప్రదం చేయాలి’

VZM: వచ్చే నెల 4 న జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని APWJF జిల్లా అధ్యక్షుడు కె.రమేశ్‌ నాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం బొబ్బిలిలో చలోవిజయవాడ పోస్టర్‌ను ఆవిష్కరించారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు,పెన్షన్‌ మీడియా కమిషన్‌ ఏర్పాటు, వెల్ఫేర్‌ ఫండ్‌కు50 కోట్లు కేటాయింపు పరిష్కారించాలన్నారు.

February 25, 2026 / 07:25 AM IST

దుకాణాలు తనిఖీ చేసిన మున్సిపల్ అధికారులు..!

CTR: ప్లాస్టిక్ కవర్ల విక్రయాలను అరికట్టేందుకు మున్సిపల్ యంత్రాంగం చర్యలు చేపట్టింది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్‌ బ్యాగుల వాడకంపై అంక్షలు ఉన్నప్పటికీ పుంగనూరు పట్టణంలో విక్రయాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు సిబ్బంది బృందాలుగా ఏర్పడి మంగళవారం పలు దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

February 25, 2026 / 07:23 AM IST

‘RTC డిపోలు మూసివేయడం అన్యాయం’

PPM: ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 12 RTC డిపోలు మూసివేసేందుకు సన్నాహాలు చేస్తుండడం చాలా అన్యాయమని ఏపీ PDT నేషనల్ మజ్దాూర్ యూనియన్ పాలకొండ డిపో కార్యదర్శి రాజేశ్ అన్నారు. మంగళవారం పాలకొండ డిపోవద్ద ఎర్ర బ్యాడ్జీలు ధరించి ధర్నా చేపట్టారు. విద్యుత్తు బస్సులను తెచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 4 డిపోల మూసివేతకు ఆదేశాలు జారీ చేసిందని ఆరోపించారు.

February 25, 2026 / 07:23 AM IST

జేఎన్టీయూ ఎంబీఏ, ఎంసీఏ పరీక్ష ఫలితాలు విడుదల

ATP: జేఎన్టీయూ అనంతపురం పరిధిలో నిర్వహించిన ఎంబీఏ, ఎంసీఏ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను మంగళవారం విడుదల చేశారు. ఎంబీఏ, ఎంసీఏ విభాగాలకు చెందిన ఒకటి, రెండు సెమిస్టర్ల రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి. వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ ఆదేశాల నుంచి పరీక్షల విభాగం అధికారులు నాగప్రసాదానాయుడు, శివకుమార్ ఫలితాలు విడుదల చేశారు.

February 25, 2026 / 07:20 AM IST