దక్షిణ కొరియా వాహన దిగ్గజం హ్యుందాయ్ మోటార్ అనుబంధ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా IPO ప్రతిపాదనకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతినిచ్చింది. దీంతో ఈ సంస్థ సుమారు రూ.25,000 కోట్ల సమీకరణే లక్ష్యంగా IPOకు రానుంది. అక్టోబరులోనే ఈ ఐపీఓ ఉండొచ్చని సమాచారం. మొత్తం ఆఫర్ సేల్ పద్ధతిలో 142,194,700 ఈక్విటీ షేర్లను సంస్థ విక్రయించనుంది. ఈ ఇష్యూ కోసం కంపెనీ విలువను 18-20 బిలియన్ డాలర్లుగా పరిగణించనున్నారు.