TG: హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా ఏడు నగరాల్లో ఇళ్ల అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. జూలై నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో 11 శాతం మేర తగ్గినట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ‘అనరాక్ ఓ’ వెల్లడించింది. మొత్తం 1.07లక్షల యూనిట్ల విక్రయాలు జరగగా గతేడాది ఇదే త్రైమాసికంలో 1,20,290 యూనిట్లు అమ్ముడుపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో ధరలు అధికంగా 32 శాతం పెరగడం ప్రధాన కారణంగా తెలిసింది.