ప్రస్తుతం మనదేశంలోకి ఏటా 70-80 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తుండగా.. వచ్చే కొన్నేళ్లలో దీన్ని 100 బిలియర్లకు చేర్చాలనుకుంటున్నట్లు పరిశ్రమ ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం కార్యదర్శి అమర్ దీప్ సింగ్ తెలిపారు. ఇందుకు FDI దరఖాస్తుల ఆమోద ప్రక్రియను క్రమబద్ధీకరిస్తున్నామని పేర్కొన్నారు. పెట్టుబడులను మరింతగా ప్రోత్సహించేందుకు రక్షణ, రైల్వేలు, బీమా, టెలికాం వంటి రంగాల్లో నిబంధనలను సడలించినట్లు వెల్లడించారు.