»What Is Whatsapp Proxy How To Use Whatsapp Offline Without Internet
WhatsApp: ఇక ఇంటర్నెట్ లేకుండానే వాట్సాప్ వినియోగం..!
ప్రముఖ కమ్యూనికేషన్ యాప్ వాట్సాప్ గురించి ఎవరికీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ వాడేవారే. ఎవరికైనా మెసేజ్ చేయాలన్నా, వీడియో కాల్ చేయాలన్నా అందరూ వాట్సాప్ వాడుతున్నారు. ఈ మధ్య శుభకార్యాలకు పిలుపులు కూడా వాట్సాప్ లోనే జరుగుతున్నాయి.
వాట్సాప్ లో మరికొద్దిరోజుల్లో అందరూ మెచ్చే సూపర్ ఫీచర్ రానుంది. ఈ ఫీచర్ తో ఇంటర్నెట్ లేకపోయినా, వాట్సాప్ లో ఛాట్ చేయవచ్చు. వాట్సాప్ తీసుకొచ్చిన ఈ సరికొత్త ఫీచర్ వాట్సాప్ ప్రాక్సీ. మొబైల్ డేటా అందుబాటులో లేని సమయంలో ఈ వాట్సాప్ ప్రాక్సీ ద్వారా చాట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. సెట్టింగ్స్ లో స్టోరేజ్ అండ్ డేటా మీద క్లిక్ చేస్తే చివరలో ప్రాక్సీ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది. ఒక వేళ ఆ సెట్టింగ్స్ కనిపించకపోతే వాట్సాప్ లేటెస్ట్ వర్షన్‌ను అప్డేట్ చేసుకోవాలి. ప్రాక్సీ సెట్టింగ్స్ ఓపెన్ చేసి ప్రాక్సీ అడ్రస్ సెట్ చేయాలి. కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వగానే ఒక చెక్ మార్క్ కనిపిస్తుంది. అప్పుడు ఇంటర్నెట్ లేకుండానే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో ఛాటింగ్ చేసుకునే వీలుంటుంది.
అత్యవసరం అయితేనే ప్రాక్సీని వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ప్రాక్సీ చేయడంతో మీ ఐపీ అడ్రస్ ప్రాక్సీ ప్రొవైడర్ తెలిసిపోతుంది. అలాగే ప్రాక్సీ సమయంలో ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్ ఆన్‌లో ఉందో లేదో తప్పని సరిగా చూసుకోవాలి. ప్రాక్సీ ద్వారా వాట్సాప్‌ను ఉపయోగించడం ద్వారా ప్రైవసీకి ఎలాంటి భంగం వాటిల్లదని, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ద్వారా సురక్షితంగా ఉంటుందని మెటా పేర్కొటుంది. అయినప్పటికీ మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిదని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.