ప్రపంచ కుబేరుడి లిస్ట్‌లో ఉన్న జెఫ్ బెజోస్(Jeff Bezos) మరోసారి వార్తల్లో నిలిచారు. నెట్టింట ఆయన వేసుకున్న షర్ట్ ధర(Shirt Rate) గురించి చర్చ నడుస్తోంది. కొన్ని లక్షల కోట్ల ఆస్తికి అధిపతి అయిన జెఫ్ బెజోస్ ఈ మధ్యనే తన లవర్‌తో కలిసి కోచెల్లా మ్యూజిక్ ఫెస్టివల్(Music Festival)లో కనిపించాడు. ఈవెంట్లో అందరితో కలిసి ఉత్సాహంగా ఆడిపాడాడు. ఈ సందర్భంగా బెజోస్ (Bezos)కు సంబంధించిన కొన్ని వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతున్నాయి.
జెఫ్ బెజోస్(Jeff Bezos) ఫోటోలు చూసిన నెటిజన్ల(Netizens)ను ఆయన ధరించిన షర్ట్ ఆకర్షించింది. సాధారణంగా శ్రీమంతులు ఎక్కువగా కాస్ట్లీ బట్టలనే ధరిస్తూ ఉంటారు. అయితే అమెజాన్ వ్యవస్థాపకుడు(Amazon Ceo) జెఫ్ బెజోస్(Jeff Bezos) వేసుకున్న షర్ట్ ధర(Shirt Rate) మాత్రం చాలా తక్కువే. ప్రస్తుతం ఆ షర్ట్ ధరపైనే నెట్టింట చర్చ జరుగుతోంది.
బెజోస్(Bezos) ధరించిన షర్ట్(Shirt) అమెజాన్(Amazon)లో 12 డాలర్లకు లభిస్తోందని ఓ నెటిజన్ తెలిపాడు. అంటే మన కరెన్సీలో ఆ షర్ట్ విలువ(Shirt Rate) రూ.980లు మాత్రమే. అమెజాన్ అధినేత ధరించిన షర్ట్ విలువ తెలియడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. శ్రీమంతుడయ్యుండి ఇలాంటి చీప్ షర్ట్ ను ఎలా ధరించావని కొందరు ప్రశ్నిస్తుండగా మరికొందరు మాత్రం బెజోస్ (Bezos)పై ప్రశంసలు కురిపిస్తున్నారు.