షిర్డీ(Shiridi) వెళ్లే భక్తులకు అలర్ట్. మే 1వ తేది నుంచి షిర్డీ గ్రామస్తులు బంద్(Bandh) పాటించనున్నారు. ఆలయానికి ప్రతిపాదించిన సీఎస్ఎఫ్ఐ భద్రత(CSFI Security)ను ఆ గ్రామంలోని ప్రజలు వ్యతిరేకించారు. అందుకు నిరసనగా మే 1 నుంచి షిర్డీలో నిరవధిక బంద్(Shiridi Bandh) చేయనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం ముందు నాలుగు డిమాండ్లను ఉంచుతూ నిరసన తెలుపుతున్నట్లు వెల్లడించారు. షిర్డీలో సాయి బాబా ఆలయాని(Shiridi Saibaba Temple)కి భద్రతను కల్పించే ఉద్దేశంతో సాయి సంస్థాన్, మహారాష్ట్ర పోలీసులు సీఐఎస్ఎఫ్ భద్రతను ఏర్పాటు చేశారు. అయితే ఆ భద్రతా నిర్ణయాన్ని షిర్డీ గ్రామస్తులు వ్యతిరేకిస్తూ బంద్ చేపడతామని హెచ్చరించారు.
ఉగ్రవాదుల ముప్పు కారణంగా షిర్డీ(Shiridi)లో ప్రభుత్వం భద్రతను పెంచింది. ప్రతి రోజూ ఆలయ పరిసరాల్లో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపడుతోంది. అయితే భద్రత వ్యవస్థకు బదులుగా సీఐఎస్ఎఫ్ భద్రత(CSFI Security) కల్పించాలనే చర్చ మొదలైంది. ఈ విషయంలో 2018లోనే సంజయ్ కాలే అనే వ్యక్తి బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారించిన కోర్టు సాయి సంస్థాన్ అభిప్రాయాన్ని కోరింది. సీబీఎస్ఎఫ్ భద్రతకు సాయి సంస్థాన్ కూడా మద్దతు తెలిపింది. అయితే ఆ నిర్ణయాన్ని షిర్డీ గ్రామస్తులు వ్యతిరేకించారు.
బంద్ సమయంలో సాయిబాబా ఆలయం(Shiridi Saibaba Temple) తెరిచే ఉంటుంది. భక్తులందరికీ సాయి బాబా సంస్థాన్ లో బస, ప్రసాద, క్యాంటీన్ సేవలు కొనసాగుతాయి. భక్తులకు వసతి సదుపాయాలు కూడా ఉంటాయి. అయితే బంద్ సమయంలో అన్ని వ్యాపారాలను పూర్తిగా మూసివేయనున్నట్లు షిర్డీ గ్రామస్తులు తెలిపారు. షిర్డీలో సీఐఎస్ఎఫ్ భద్రత(CSFI Security) వద్దని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే సాయిబాబా సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టును కూడా రద్దు చేయాలని కోరుతున్నారు. డిప్యూటీ కలెక్టర్, తహశీల్దార్, ప్రాంతీయ అధికారితోనే షిర్డీలో కమిటీ ఉండాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రీస్టీ బోర్డుల్లో 50 శాతం ధర్మకర్తలు షిర్డీవారే అయ్యి ఉండాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.