Tata Motors Launch Nexon EV Facelift: టాటా మోటార్స్ (Tata Motors) నెక్సాన్ (Nexon) నుంచి రెండు కార్లను విడుదల చేసింది. నెక్సాన్ ఫేస్ లిప్ట్, నెక్సాన్ ఈవీ ఫేస్ లిప్ట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కార్ల ధరలు రూ.8.09 లక్షల నుంచి రూ.14.74 లక్షల మధ్య ఉండనున్నాయి. కార్ల బుకింగ్స్ ప్రారంభం అయ్యాయని.. త్వరలో డెలివరీ చేస్తామని తెలిపారు. కొత్తగా 11 వేరియంట్లలో నెక్సాన్ తీసుకొచ్చారు. రివోట్రోన్ 1.2 లటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 120 పీఎస్ పవర్, 170 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తోంది. రివో టార్క్ 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 115 పీఎస్ పవర్‌ను 260 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేయనుంది.
క్రియేటివ్, క్రియేటివ్ ప్లస్, క్రియేటివ్ ప్లస్ ఎస్, ఫియర్ లెస్, ఫియర్ లెస్ ఎస్, ఫియర్ లెస్ ప్లస్ ఎస్, ఫ్యూర్, ఫ్యూర్ ఎస్, స్మార్ట్, స్మార్ట్ ప్లస్, స్మార్ట్ ప్లస్ ఎస్ పేరుతో కార్లు అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్ వేరియంట్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 7 స్పీడ్ డీసీఏతో వస్తోంది. డీజిల్ వేరియంట్ 6 స్పీడ్ ఎండీ, 6 స్పీడీ ఏఎంటీ ఆప్షన్లతో వస్తోంది. నెక్సాన్ పేస్ లిప్ట్‌లో ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, రీడిజైన్డ్ బంపర్స్, 16 ఇంచుల అల్లాయ్ వీల్స్ ఇస్తున్నారు. ఆరు ఎయిర్ బ్యాగ్స్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్, 360 డిగ్రీల సరౌండ్ వ్యూ సిస్టమ్ ఉంది. ఆరు రంగుల్లో కార్లు అందుబాటులో ఉన్నాయి.
ఇక నెక్సాన్ (Nexon) ఈవీ ఫేస్ లిప్ట్ విషయానికి వస్తే.. రెండు బ్యాటరీ వేరియంట్లలో వస్తోంది. మిడ్ రేంజ్లో 30 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ, లాంగ్ రేంజ్లో 40.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఇచ్చారు. మిడ్ రేంజ్ నెక్సాన్ సింగిల్ చార్జ్‌తో 325 కిలోమీటర్లు ట్రావెల్ చేయవచ్చు. లాంగ్ రేంజ్లో 465 కిలోమీటర్లు వెళ్లొచ్చు. 15ఏ ప్లగ్ పాయింట్ ద్వారా చార్జ్ చేస్తే మిండ్ రేంజ్ బ్యాటరీ 10.5 గంటలు.. లాంగ్ రేంజ్ బ్యాటరీ 15 గంటల పడుతుంది. ఫాస్ట్ చార్జీంగ్ కేవలం 56 నిమిషాల్లో బ్యాటరీ 10 నుంచి 100 శాతం చార్జ్ అవుతుందని కంపెనీ తెలిపింది. వాహనం నుంచి వాహనానికి కూడా చార్జీంగ్ సదుపాయాన్ని అందించింది. 12.3 ఇంచుల టచ్ స్క్రీన్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. ఆటోమేటిక్ ఏసీ, వైర్ లెస్ ఫోన్ చార్జర్, క్రూయిజ్ కంట్రోల్, ఆరు ఎయిర్ బ్యాగులు ఇచ్చారు. 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఇచ్చారు.