»New Safari And Harrier Suvs Released By Tata Motors Indian Market
Tata Motors: నుంచి కొత్త సఫారీ, హారియర్ SUVలు రిలీజ్
ప్రముఖ సంస్థ టాటా మోటార్స్(Tata Motors) నుంచి సరికొత్త మోడల్ SUVలు మార్కెట్లోకి వచ్చాయి. అదిరిపోయే ఫీచర్లతోపాటు అద్భుతమైన డిజైన్లతో వచ్చిన వీటి ధర, ఫీచర్లు ఎంటో ఇప్పుడు చుద్దాం. అంతేకాదు వీటికి సమర్థవంతమైన భద్రతా సౌకర్యాలు కూడా ఉన్నాయని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
New Safari and Harrier SUVs released by Tata Motors indian market
ప్రముఖ అగ్రశ్రేణి సంస్థ టాటా మోటార్స్(Tata Motors) మంగళవారం SUV సఫారీ, SUV హారియర్ కొత్త మోడల్ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేసింది. ఆకర్షణీయమైన డిజైన్లతో వచ్చిన ఈ వాహనాల్లో ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ ఫీచర్లు కూడా ఉన్నాయి. కొత్త సఫారీ, హారియర్లు పెద్దల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (33.05/34), చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (45/49) అత్యధిక స్కోర్‌తో వస్తున్నాయని టాటా మోటార్స్ తెలిపింది. ఇవి భారతీయ రోడ్లపై నడపడానికి అత్యంత సురక్షితమైన వాహనాలుగా ఉంటాయని వెల్లడించింది.
ల్యాండ్ రోవర్ D8 ప్లాట్‌ఫారమ్ నుంచి తీసుకోబడిన OMEGARC ఆర్కిటెక్చర్‌పై నిర్మించబడిన ఈ SUVలు దేశంలో రూ.16.19 లక్షలు (కొత్త సఫారీకి), రూ.15.49 లక్షలు (కొత్త హారియర్ కోసం) ప్రారంభ ధర నుంచి అందుబాటులో ఉన్నట్లు ప్రకటించారు. ఈ కొత్త SUVలు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్‌తో కూడిన ADAS, 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ‘స్మార్ట్ E-షిఫ్టర్’ గేర్ నాబ్, ప్యాడిల్ షిఫ్టర్లు, టచ్-బేస్డ్ కంట్రోల్ ప్యానెల్ వంటి ఫీచర్లతో వస్తున్నాయి. దీంతోపాటు డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌తో సహా అనేక కొత్త ఫీచర్లను కలిగి ఉన్నట్లు తెలిపారు. 2023 టాటా హారియర్, సఫారీ గ్లోబల్ NCAP ద్వారా 5-స్టార్ రేటింగ్‌ను పొందాయని చెప్పారు. 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, నావిగేషనల్ డిస్ప్లేతో కూడిన 10.25-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10 స్పీకర్ JBL ఆడియో సిస్టమ్, 4 సిలిండర్ డీజిల్ ఇంజన్, 170hp, 350Nm సహా అనేక కొత్త ఫీచర్లను కలిగి ఉన్నాయి.