»Layoffs In 2023 Rolls Royce And Linkdin May Cut Thousand Of Job Know Update
Layoffs in 2023: భారీగా ఉద్యోగులకు తొలగించేందుకు రెడీ అయిన రోల్స్ రాయిస్, లింక్డ్ ఇన్
ఉద్యోగాల కోత ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది.. యూకేకి చెందిన 100ఉద్యోగులను కంపెనీ ఇంటికి పంపనుంది. మరోవైపు, లింక్డ్ఇన్ కూడా తన కంపెనీలో పని చేస్తున్న వందలాది మంది ఉద్యోగులను తొలగించాలని కూడా నిర్ణయించింది. వీరందరినీ త్వరలో ఇంటికి సాగనంపనున్నారు. ఇంజినీరింగ్, టాలెంట్ అండ్ ఫైనాన్స్ టీమ్లలోని 668 మంది ఉద్యోగులను కంపెనీ తొలగించనుంది.
Layoffs in 2023: లగ్జరీ కార్ల తయారీ కంపెనీ రోల్స్ రాయిస్ కూడా ఉద్యోగాలను తగ్గించేందుకు సిద్ధమవుతోంది. ఖర్చు తగ్గింపులో భాగంగా కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఈ నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగాల కోత ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది.. యూకేకి చెందిన 100ఉద్యోగులను కంపెనీ ఇంటికి పంపనుంది. మరోవైపు, లింక్డ్ఇన్ కూడా తన కంపెనీలో పని చేస్తున్న వందలాది మంది ఉద్యోగులను తొలగించాలని కూడా నిర్ణయించింది. వీరందరినీ త్వరలో ఇంటికి సాగనంపనున్నారు. ఇంజినీరింగ్, టాలెంట్ అండ్ ఫైనాన్స్ టీమ్లలోని 668 మంది ఉద్యోగులను కంపెనీ తొలగించనుంది. ఈ కోత లింక్డ్ఇన్ కంపెనీలో మొత్తం 20,000 మంది ఉద్యోగులున్నారు. ఇప్పుడు అందులోంచి 3 శాతం మందిని తొలగించనుంది కంపెనీ.
రోల్స్ రాయిస్‌లో తొలగింపులు ఎందుకు జరుగుతున్నాయి?
కొత్త సీఈవో రాకతో కంపెనీ మంచి వృద్ధిని నమోదు చేసుకుంది. కొత్త CEO ఖర్చులను తగ్గించడానికి అనేక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఉద్యోగ కోతలను కూడా అతని ప్రణాళికలో చేర్చుకున్నారు. దీని తర్వాత లగ్జరీ కార్ల తయారీ సంస్థ తన ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమైంది. త్వరలో వేలాది మంది ఉద్యోగులు ఉద్వాసనకు గురయ్యే అవకాశం ఉంది. రోల్స్ రాయిస్ తన వర్క్‌ఫోర్స్‌లో మార్పులకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, ఇందులో సుమారు 3 వేల మంది తయారీయేతర ఉద్యోగులను తగ్గించవచ్చని మే నెలలో సండే టైమ్స్ నివేదిక పేర్కొంది.
లింక్డ్ఇన్లో తొలగింపులు ఎప్పుడు జరిగాయి?
ఈ కంపెనీ సంవత్సరం ఫస్ట్ ఆఫ్ లో 141మందిని ఓసారి.. 516 మంది కార్మికులను మరో విడుతలో తొలగించింది. అంతకు ముందు సంవత్సరం 6,000 మంది కార్మికులు ఉన్నారు. మేలో సోషల్ మీడియా నెట్వర్క్ తన కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి కార్యకలాపాలు, సహాయక బృందాల నుండి 716 ఉద్యోగాలను తొలగించాలని నిర్ణయించింది. ఖర్చులను తగ్గించుకోవడానికి, అమెజాన్, గూగుల్, ఫేస్బుక్ వంటి అనేక పెద్ద కంపెనీలు కూడా 2023 సంవత్సరంలో ఉద్యోగాలను తగ్గించాయి. భారతదేశంలోని అనేక స్టార్టప్‌లు కూడా ఉద్యోగాలను తగ్గించాయి.